Potti Sriramulu: ఆధునిక శిబిచక్రవర్తి అమరజీవి.. నేడు పొట్టి శ్రీరాములు జయంతి

అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసులో మహా లక్ష్మమ్మ, పొట్టి గురవయ్య దంపతులకు జన్మించారు.

బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన శ్రీరాములు తల్లి దగ్గరే నలుగురి సంతానంలో ఒకడిగా పెరిగాడు. శ్రీరాములు జీవించిన 52 ఏళ్లలో తొలి 20 ఏళ్ళు మద్రాసులోనే ఉన్నారు. శ్రీరాములు ఫిఫ్త్ ఫార్మ్ వరకు మద్రాసులో చదివారు. అది పూర్తి కాలేదు. దీంతో బొంబాయిలోని విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1924లో శానిటరీ ఇంజనీరింగ్‌, ప్లంబింగ్‌లో డిప్లమో చేశారు. గ్రేట్ ఇండియన్ పెనిన్స్యులర్ రైల్వే (ప్రస్తుత సెంట్రల్ రైల్వే)లో అసిస్టెంట్ ప్లంబర్‌గా ఉద్యోగం పొందారు. శ్రీరాములు తల్లి మహాలక్ష్మమ్మ 1928లో చనిపోయింది. ఆ తర్వాత భార్య సీతమ్మ ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ, ఆ పిల్లాడు ఐదు రోజులకే చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు క్షయ రోగంతో సీతమ్మ మరణించింది. ఇలా వ‌రుస‌గా తీరని విషాదాలను ఎదుర్కొన్నారు. 

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ పరిచయంతో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. మూడేళ్ళపాటు తలలో నాలుకగా సబర్మతీ ఆశ్రమంలో గడిపి గాంధీజీ ఆలోచనను, ఆచరణను తన రక్తంలో జీర్ణించుకున్నారు. 1933 ఆగస్టు 1 రాత్రి గాంధీజీతో పాటు బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధించిన 34 మందిలో పొట్టి శ్రీరాములు ఒకరు. ఇది ఆయనకు తొలిసారి జైలు జీవితాన్ని పరిచయం చేసింది.

Sania Mirza: వండర్‌ ఉమన్ సానియా మీర్జా టెన్నిస్‌కు వీడ్కోలు.. ఆమె జీవిత విశేషాలివే..

1934 జనవరి 15న పగలు రెండు గంటల సమయంలో బిహార్‌ ఉత్తర ప్రాంతంలో మూడు సార్లు తీవ్రంగా కంపించి భయంకరమైన శబ్దంతో భూకంపం ముంచెత్తింది. దీని ప్రభావం 77 వేల చదరపు మైళ్లకు వ్యాపించిందనీ, ఫలితంగా కోటి న్నరమంది తీవ్ర సమస్యలకు గురయ్యారనీ అంచనా. పది లక్షల ఇళ్ళు, 1,400 కిలోమీటర్ల రైలు మార్గం ధ్వంసమయ్యాయి. ఐదో నెల జైలు శిక్ష అనుభవిస్తున్న ఎంతో మందితోపాటు భూకంపం కారణంగా పొట్టి శ్రీరాములు విడుదలై గాంధీజీ సలహా మేరకు బిహార్‌ భూకంప బాధి తుల కేంద్ర సహాయక సంఘంలో సభ్యుడుగా చేరారు. దీనికి నాయకత్వం వహిస్తున్నది బాబూ రాజేంద్రప్రసాద్‌. దాదాపు పది నెలలపాటు నిద్రా హారాలు మాని, సహాయ సేవా కార్యక్రమాలను పొట్టి శ్రీరాములు గొప్పగా నిర్వహించారు. 
1937లో మేనమామ భార్య తండ్రి అయిన గోనుగుంట్ల నర్సయ్య మరణంతో శ్రీరాములు ప్రజా జీవితం తెలుగు ప్రాంతానికి తరలివచ్చింది. ప్రత్యేక రాష్ట్రం కోసం తనను తాను త్యాగం చేసుకున్న అమరజీవిగానే ఆయన తెలుసు. నిజానికి పొట్టి శ్రీరాములు ధీరోదాత్త ఆత్మత్యాగం కారణంగా తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, గుజరాతీలు, మహారాష్ట్రీయులు.. ఇలా ఎన్నో మాతృభాషలవారు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పరచు కోగలిగారు. 

Bathukamma : బతుకమ్మ పండుగ నేపథ్యం ఏమిటి..? ఏఏ రోజు ఎలా జ‌రుపుకుంటారో తెలుసా మీకు..?

1937 నుంచి తెలుగు ప్రాంతాలలో హరిజ నోద్ధరణ, హరిజనుల దేవాలయ ప్రవేశం, ఖాదీ ప్రచారం, మద్యపానాన్ని మాన్పించడం, పాకీ పనివారి సమస్యలు తీర్చడం, భిక్షువుల సమస్య తీర్చడం, హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటు పడడం – ఇలా ఎన్నోరకాలుగా శ్రీరాములు కృషి సాగింది. ఇంతే కాకుండా సరళంగా, మంచి వ్యక్తీకరణతో సాగే రచనలు చేయగల సామర్థ్యం కూడా గలిగినవాడు. గుడివాడ నుంచి ఎర్నేని సుబ్రహ్మణ్యం నడిపిన ‘దరిద్ర నారాయణ’ పత్రికలో పొట్టి శ్రీరాములు స్వతంత్ర రచనలతోపాటు ఆంగ్ల వ్యాసాలకు అనువాదాలు కూడా కనబడ తాయి. గాంధీ స్మారక నిధి, ఇంకా కాంగ్రెస్‌ కమిటీ బాధ్యుడిగా భాష తెలియని ప్రభుత్వం కారణంగా ప్రజా కార్యక్రమాలు సరిగా నిర్వహింపబడటం లేదని గుర్తించి స్వభాషారాష్ట్రం కోసం ఆత్మార్ప ణకు  పూనుకొన్న యోధుడు పొట్టి శ్రీరాములు. సి.రాజగోపాలాచారి వంటి కొందరు నాయకులు కొంత దూరదృష్టితో, ఉదారబుద్ధితో వ్యవహరించి ఉంటే తెలుగువారు పొట్టి శ్రీరాములును కోల్పోయి ఉండేవారు కాదు!          

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌కు ఎంతో క‌`షి చేశారు. ఆయ‌న ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం 1952 అక్టోబర్ 10 నుంచి 58 రోజులపాటు మద్రాస్‌(చెన్నై)లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. డిసెంబర్ 15న ఆయన ప్రత్యేక భాషా రాష్ట్రం కోసం అసువులు బాసి అమరజీవి అయ్యారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 2008 మే 22వ తేదీన నెల్లూరు జిల్లా పేరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

International Womens Day: జయహో.. జనయిత్రీ

#Tags