200 New Engineering Colleges in TS : ఎంసెట్ విద్యార్థుల‌కు భారీ గుడ్‌న్యూస్‌.. కొత్త‌గా మ‌రో 200 ఇంజినీరింగ్ కాలేజీలు వ‌స్తున్నాయ్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంసెట్ విద్యార్థుల‌కు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) గుడ్‌న్యూస్ చెప్పింది. చాలా మంది ఎంసెట్ ప‌రీక్ష రాసిన విద్యార్థులు.. ప‌రిమిత సంఖ్య‌లోనే ఇంజ‌నీరింగ్ సీట్లు ఉండ‌డంతో.. పాటు అనుకున్న కాలేజీలో.. అనుకున్న సీటు రాక‌పోవ‌డంతో చాల మంది విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెల్సిందే.

అలాగే చాలా మంది విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటాలో ల‌క్ష‌ల ల‌క్ష‌లు ఫీజులు క‌ట్టుతున్నారు. ఈ స‌మ‌స్య విదార్థుల‌తో పాటు.. వీరి త‌ల్లిదండ్రుల‌కు కూడా పెద్ద భారంగా మారింది. ఎట్ట‌కేల‌కు తెలంగాణలో కొత్తగా మరో 200 ఇంజినీరింగ్ కళాశాలలు రానుండంతో.. విద్యార్థుల‌కు ఊర‌ట ల‌భించ‌నున్న‌ది. అలాగే 200 ఇంజినీరింగ్ కాలేజీల‌కు AICTE అనుమతులు కూడా జారీ చేసింది. అయితే కౌన్సిలింగ్ ఈ కొత్త ఇంజ‌నీరింగ్‌ కాలేజీలు ఈ సారి అందుబాటులో ఉంటాయో..లేదో..? ఇంకా క్లారిటీ రాలేదు.

☛ Engineering Seats 2024 : ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు పెంచాలని ప్రభుత్వంపై ఇంజనీరింగ్‌ కాలేజీల ఒత్తిడి

కొత్త‌గా 10 డీమ్డ్ వర్సిటీలు కూడా..
200 ఇంజినీరింగ్ ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు.. 10 డీమ్డ్ వర్సిటీలు, వాటి క్యాంపస్‌లు ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 3 బ్రాంచీల్లో బీటెక్‌ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

 TG EAPCET Counselling 2024: ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్ ప్రారంభం.. తొలి దశ కౌన్సెలింగ్‌ ఇలా..

#Tags