Pharmacist Notification: ఫార్మాసిస్టు గ్రేడ్‌-2 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు తేదీ ఇదే..

ఎనిమిది జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్‌ విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేడ్‌-2 పోస్టుకు వివరాలను వెల్లడించారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఫార్మసిస్టుల గ్రేడ్‌–2 నియామకాలకు ప్రాంతీయ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ బి.సుజాత (విశాఖ,జోన్‌) నోటిఫికేషన్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 8 ఫార్మాసిస్టు గ్రేడ్‌–2 పోస్టులు భర్తీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఆమె తెలిపారు.

INSPIRE Competitions: రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌కు ఎంపికైన విద్యార్థులు..

పూర్తి చేసిన దరఖాస్తులను రేసవానిపాలెంలోని ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు వారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇంటర్మీడియట్‌ అర్హతతోపాటు డి.ఫార్మా/ బి.ఫార్మా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. వివరాల కోసం https@// nagendrasvast. wordpress. com వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.500, మిగిలిన కులాలకు చెందిన అభ్యర్థులు రూ.300,డిమాండ్‌ డ్రాఫ్ట్‌ తీసి దరఖాస్తుకు జత చేయాలన్నారు. రీజనల్‌ డైరెక్టర్‌, వైద్య ఆరోగ్యశాఖ, విశాఖపట్నం పేరిట డీడీ తీయాలని డాక్టర్‌ సుజాత తెలియజేశారు.

#Tags