TS DSC & TET Exam Dates 2024 : డీఎస్సీ, టెట్‌-2024 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. వీళ్లు కూడా టెట్ రాయాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : పాఠశాల విద్య శాఖ‌ కమిషన్ టెట్‌, డీఎస్సీ-2024 ప‌రీక్ష తేదీలను వెల్ల‌డించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టెట్‌-2024ను మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన ప్రకటించారు.

అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌తో పాట.. పూర్తి సమాచారంను మార్చి 20వ తేదీన‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్‌ బేస్డ్‌గా జరిగే ఈ పరీక్షకు మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు.

డీఎస్సీ-2024 ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..
డీఎస్సీ-2024 దరఖాస్తు తేదీలను కూడా పొడిగించిన విష‌యం తెల్సిందే. జూన్ 6వ తేదీ వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో జూలై 17వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న‌ట్టు కమిషనరేట్‌ పేర్కొంది. 

☛ TS DSC 2024 District Wise Posts Details : జిల్లాల వారీగా 11062 టీచర్ల‌ పోస్టుల ఖాళీల వివరాలు ఇవే.. ముఖ్య‌మైన తేదీలు ఇలా..

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి..
రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్ర‌వ‌రి 29వ తేదీన‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ-2024 దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్‌ అర్హత లేని బీఈడీ, డీఎడ్‌ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

80 వేల మంది ఉపాధ్యాయులు టెట్‌ రాయాల్సిందే..
ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్‌ రాయాల్సి ఉంటుంది.

#Tags