ఏయూ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా

ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం పరిధిలో అక్టోబరు 5 నుంచి నిర్వహించాల్సిన పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరం పరీక్షలు, అక్టోబరు 12 నుంచి నిర్వహించాల్సిన రెండో సంవత్సరం పరీక్షలు కోవిడ్ తీవ్రత కారణంగా వాయిదా వేసినట్లు దూరవిద్య కేంద్రం సంచాలకులు ఆచార్య పి.హరిప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 7702257813, 08912844143, 08912844142 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.