Indian Hockey Team Sponsorship: ఒడిశా 2033 వరకు భారత హాకీ స్పాన్సర్‌

హాకీ మీద ఒడిషా ప్రభుత్వం మరోసారి తన ప్రేమను చాటుకుంది. భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్‌ను 2033 వరకు పొడిగించాలని నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. గత కొన్నేళ్లుగా ఒడిశా భారత హాకీకి మంచి ప్రోత్సాహాన్నిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో హాకీ అంటే ఇప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఆ రాష్ట్రమే. రాష్ట్రంలో హాకీ అభివృద్ధి కోసం అనేక వసతులు కల్పించిన ఒడిశా.. ప్రపంచకప్లతో పాటు మరికొన్ని అంతర్జాతీయ ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చింది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్‌) స్పాన్సర్‌ గా ఉంటోంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags