Romagna Grand Prix: రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో ఐదో విజయాన్ని సొంతం చేసుకున్న వెర్‌స్టాపెన్‌!!

ఫార్ములా వన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ ఐదో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మే 19వ తేదీ ఇటలీలో జరిగిన ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ ఘనంగా విజేతగా నిలిచాడు.

‘పోల్‌ పొజిషన్‌’ నుండి రేసును ప్రారంభించిన వెర్‌స్టాపెన్‌, నిర్ణీత 63 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 25 నిమిషాల 25.252 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో, చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు.

Federation Cup 2024: ఫెడరేషన్ కప్‌లో నీరజ్‌ చోప్రాకు స్వర్ణం

#Tags