U19 T20 Asia Cup: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్
భారత యువ మహిళల జట్టు తొలి అండర్-19 టీ20 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో విజేతగా అవతరించింది.
డిసెంబర్ 22వ తేదీ జరిగిన ఫైనల్లో నిక్కీ ప్రసాద్ నాయకత్వంలో భారత జట్టు 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో తెలంగాణకు చెందిన టీనేజ్ ఓపెనర్ గొంగడి త్రిష అర్ధ సెంచరీ చేసింది. తరువాత బంగ్లాదేశ్ జట్టు 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలిపోయింది.
ఈ టోర్నీలో రెండు అర్ధసెంచరీలు చేసిన 'ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ' అవార్డులు లభించాయి.
T20 Series: టీ20లో ‘రికార్డు’ విజయం సాధించిన భారత మహిళల జట్టు
#Tags