Divya Deshmukh: ప్రపంచ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్ విజేతగా దివ్య

భారత యువ చెస్‌ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌ తన కెరీర్‌లో ఒక అద్భుతమైన ఘనత సాధించింది.

గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్‌ జూనియర్‌ (అండర్‌-20 అమ్మాయిల విభాగం) చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత నంబర్‌ 3 క్రీడాకారిణి, 18 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్‌ విజేతగా నిలిచింది. 11 రౌండ్ల టోర్నీలో దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 

చివరి రౌండ్‌లో, దివ్య క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై 57 ఎత్తుల్లో విజయం సాధించింది. నాగపూర్‌కు చెందిన ఈ యువ క్రీడాకారిణి టోర్నీలో తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను డ్రా చేసుకుని అజేయంగా నిలిచింది.

క్రచ్యాన్‌ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా, అలవెర్దియెవా అయాన్‌ (అజర్‌బైజాన్‌; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి రక్షిత రవి (7.5 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 

విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ.1 లక్షా 79 వేలు) నగదు బహుమతితో పాటు స్వర్ణ పతకం మరియు విజేత ట్రోఫీ లభించాయి. 

Ultimate Fighting Championship: యూఎఫ్‌సీ చరిత్రలో భారత్‌ తొలి విజయం ఇదే..!

దివ్య సాధించిన విజయాలు ఇవే..
2020- ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌(టీమ్‌) - స్వర్ణం
2022- వుమెన్స్‌ ఇండియన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ - విజేత
2022- చెస్‌ ఒలింపియాడ్‌(వ్యక్తిగత విభాగం) - కాంస్యం
2023- ఆసియా మహిళా చెస్‌ చాంపియన్‌షిప్‌ - విజేత
2023- టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ టోర్నమెంట్‌(వుమెన్స్‌ రాపిడ్‌) - ప్రథమ స్థానం
2024- ఫిడే వరల్డ్‌ అండర్‌ 20 గర్ల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ - చాంపియన్‌.

#Tags