Archery World Cup: ఆర్చరీ వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో ఐదోసారి రజత పతకం గెలిచిన దీపిక

ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత మహిళా స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ఐదోసారి రజత పత‌కాన్ని సాధించింది.

మూడేళ్ల తర్వాత సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆడిన దీపిక రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 

చైనా ప్లేయర్ లీ జియామన్‌తో జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో 30 ఏళ్ల దీపిక 0-6తో ఓడిపోయింది. 

క్వార్టర్ ఫైనల్లో దీపిక 6-0తో యాంగ్ జియోలె (చైనా)పై, సెమీఫైనల్లో 6-4తో అలెజాంద్రో వాలెన్సియా (మెక్సికో)పై గెలుపొందింది. కాంస్య పతక మ్యాచ్లో అలెజాండ్రో 6-2తో హన్ యంగ్ జియోన్ (దక్షిణ కొరియా)పై నెగ్గింది. 

➤ స్వర్ణం సాధించిన లీ జియామన్‌కు 30 వేల స్విస్ ప్రాంక్లు (రూ.29 లక్షల 16 వేలు), రజతం నెగ్గిన దీపిక కుమారికి 15 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ.14 లక్షల 58 వేలు), కాంస్యం గెలిచిన అలెజాండ్రోకు 8 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ.7 లక్షల 77 వేలు) ప్రైజ్‌మ‌నీగా లభించాయి.

T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేత న్యూజిలాండ్.. ఇదే తొలిసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే..

➢ ఇప్పటి వరకు దీపిక తొమ్మిదిసార్లు వరల్డ్ కప్ ఫైనల్ టోర్నీల్లో పోటీపడింది. మొత్తం ఆరు పతకాలు గెలిచింది. ఇందులో ఐదు ర‌జ‌తాలు (2024, 2015, 2013, 2012, 2011) ఉన్నాయి. ఒక కాంస్యం (2018లో) కూడా ఆమె సాధించింది.

➢ వర్కప్ ఫైనల్ టోర్నీ చరిత్రలో భారత్కు ఒక్క స్వర్ణ పతకమే లభించింది. 2007లో దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో డోలా బెనర్జీ పసిడి పతకాన్ని సాధించింది.

➢ ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీల్లో దీపిక గెలిచిన పతకాలు 38. ఇందులో 11 స్వర్ణ పతకాలు, 19 రజత పతకాలు, 8 కాంస్య పతకాలు ఉన్నాయి.

Handball Championship: భారత్‌లో తొలిసారి.. ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీ

#Tags