Roller Skating Championship: ఆంధ్రప్రదేశ్‌ స్కేటర్‌ జెస్సీకి పసిడి పతకం

ప్రపంచ స్కేట్‌ ఓసియానియా ఆర్టిస్టిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ పోటీల్లో భాగంగా పసిఫిక్‌ కప్‌ ఓపెన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి మాత్రపు జెస్సీ రాజ్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

న్యూజిలాండ్‌లో జరిగిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 13 ఏళ్ల జెస్సీ ఇన్‌లైన్‌ ఫ్రీ స్కేటింగ్‌ లేడీస్‌ క్యాడెట్‌ విభాగంలో విజేతగా నిలిచింది. తన స్కేటింగ్‌ విన్యాసాలతో ఆకట్టుకున్న జెస్సీ మొత్తం 31.98 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాలుగేళ్ల క్రితం స్కేటింగ్‌లో అడుగు పెట్టిన జెస్సీ జాతీయస్థాయి పోటీల్లో ఒక స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్యాలు గెలిచింది. 

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగ‌మ్మాయి ఈమెనే..

#Tags