Agni Prime: కొత్త తరం బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని ప్రైమ్‌’ పరీక్ష విజయవంతం

కొత్త తరం బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని ప్రైమ్‌’ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఎలైట్‌ స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ పరీక్షించాయి.

ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి జూన్ 7వ తేదీ రాత్రి దీనిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. దేశ వ్యూహాత్మక ఆయుధ సంపత్తి సాధనలో అగ్ని ప్రైమ్‌ మరో ముందడుగని పేర్కొన్నారు. పరీక్ష ప్రయోగంలో ఈ క్షిపణి అన్ని పరామితులను చేరుకుందని, సైనిక దళాల్లో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని రక్షణ శాఖ పేర్కొంది. 
అగ్ని ప్రైమ్‌ క్షిపణి 1,000 నుంచి 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అగ్ని ప్రైమ్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవోకు, ఎలైట్‌ స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందనలు తెలిపారు. 

BrahMos Supersonic Missile: బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించిన నేవీ

#Tags