ISS: అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవులపై అధ్యయనం

భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వివిధ రకాల సూక్ష్మ జీవులపై ఐఐటీ మద్రాస్, అమెరికా అంతరిక్ష సంస్థ–నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు.

ఇందులో పలు కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. క్లెబ్సియెల్లా నిమోనియే అనే బ్యాక్టీరియా రకం మిగతా సూక్ష్మజీవులకు ప్రయోజనకారిగా ఉంటున్నట్లు తేలింది. ఒక ఫంగస్‌ వృద్ధిని అది అడ్డుకుంటున్నట్లు వెల్లడైంది. అంతరిక్ష కేంద్రాన్ని క్రిమిరహితంగా మార్చేందుకు, సూక్ష్మజీవుల వల్ల వ్యోమగాముల ఆరోగ్యంపై ప్రభావం పడకుండా చూసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

October Weekly Current Affairs (Science & Technology) Bitbank: Which space agency has launched the Crew-5 mission?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags