Technology Center in Kopparthi: కొప్పర్తిలో టెక్నాలజీ సెంటర్‌

రాష్ట్రంలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను చేయిపట్టి నడిపించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకేసింది.
Technology Center in Kopparthi

ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేలా కొత్తగా మరో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. విశాఖలోని టెక్నాలజీ సెంటర్‌ లాగానే వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తిలో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటుకానుంది.

AP Industrial Development: ఏపీలో రూ.1,072 కోట్లతో పరిశ్రమలు... 21,079 మందికి ఉపాధి!!

సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో దీనిని ఏర్పాటు చేస్తారు.  దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ సీహెచ్‌ రాజేశ్వరరెడ్డి  తెలిపారు. వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో కేంద్ర ప్రతినిధులు పరిశీలించిన సుమారు 19.5 ఎకరాల భూమిని కేటాయించాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి కేంద్ర అదనపు కార్యదర్శి రజనీష్‌ లేఖ రాశారు.

Daikin ACs in Nellore: నెల్లూరు జిల్లాలో డైకిన్‌ ఏసీలు

#Tags