Arogya Mahila Scheme: తెలంగాణ‌లో ‘ఆరోగ్య మహిళ’ ప‌థ‌కం ప్రారంభం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు క‌రీంన‌గ‌ర్‌లో ప్రారంభించారు.

ఈ ప‌థ‌కంలో భాగంగా ప్రతి మంగళవారం ప్రాథమిక వైద్య కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైన వారిని రెఫరల్‌ ఆసుపత్రులకు పంపించనున్నారు. 33 జిల్లాల్లో అన్ని వయసుల వారికి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రధానంగా ఎనిమిది ప్యాకేజీలుగా విభజించిన ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో డయాగ్నోస్టిక్స్, కేన్సర్‌ స్క్రీనింగ్, పోషకాహార లోపంతో వచ్చే సమస్యలు, మూత్రసంబంధిత సమస్యలు, మెనోపాజ్‌ సంబంధిత, కుటుంబ నియంత్రణ, ఇన్ఫర్టిలిటీ, మెన్‌స్ట్రువల్‌ సమస్యలు, సుఖవ్యాధులు, తక్కువ బరువున్న సమస్యలకు వైద్య పరీక్షలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 20 పాథలాజికల్‌ లాబ్‌లలో నిర్వహిస్తారు. వీటితోపాటు, బీపీ, షుగర్, అనీమియా పరీక్షలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల రిపోర్టులను 24 గంటలలోపే సంబంధిత మహిళలకు అందచేస్తారు.  

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం

కేన్సర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు సైతం
ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో 30 ఏళ్లు పైబడ్డ మహిళలకు బ్రెస్ట్‌ కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేపడతారు. జిల్లా కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులలో మమోగ్రామ్చ కల్పోస్కోపి, క్రియోథెరపి, బయాప్సి, పాప్‌స్మియర్‌ పరీక్షలను నిర్వహిస్తారు. హైదరాబాదులోని నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్‌ ఆసుపత్రుల్లో నిర్ధారిత కేన్సర్‌ మహిళలకు చికిత్స అందిస్తారు. అయోడిన్‌ లోపం (థైరాయిడ్‌ ), విటమిన్‌ డి–3, బి–12 తదితర వైద్య పరీక్షలను అవసరం ఉన్నవారికి నిర్వహిస్తారు.
మూత్ర సంబంధిత వ్యాధులను ఎదుర్కొనే మహిళలకు రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలలో ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు. మెనోపాజ్, బహిష్టు, కుటుంబ నియంత్రణ, సంతానలేమి తదితర సమస్యలకు కూడా పరీక్షలు నిర్వహించి కౌన్సిలింగ్‌ చేస్తారు. అవసరమున్నవారికి అ్రల్టాసౌండ్‌ పరీక్షలకు జిల్లా కేంద్రాలకు రెఫర్‌ చేస్తారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో పాటు పేషంట్‌ కేర్‌ కార్యకర్తలను ఏర్పాటు చేస్తున్నారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Important Dates) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

#Tags