Green Field Bio Ethanol Plant in Chodavaram: చోడవరంలో గ్రీన్‌ ఫీల్డ్‌ బయో ఇథనాల్‌ ప్లాంట్‌

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పంచదార ఉత్పత్తికంటే అధికాదాయా­న్నిచ్చే బయో ఇథనాల్‌ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్స­హించేలా చర్యలు తీసుకుంటోంది. 
Ethanol Plant in Chodavaram

 తొలి దశలో అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్‌ ఫీల్డ్‌ బయో ఇథనాల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు 60 కిలోలీటర్ల ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్‌ ఏర్పాటుకానుంది. చోడవరం చక్కెర కర్మాగారంలో బయో ఇథనాల్‌ యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేయగా.. జూలై 10న అనుమతులు మంజూరు చేసి పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదికను పంపాల్సిందిగా కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది.

Millets Export: చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ

కేంద్ర ప్రభుత్వం ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమాన్ని కలిపి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే లీటరు పెట్రోలో 10 శాతం ఇథనాల్‌ కలుపుతుండగా, ఈ మొత్తాన్ని 2025–26 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆ మేరకు మిగులు ధాన్యాల నుంచి ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేలా ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌(ఈబీపీ) పథకాన్ని ప్రవేశపెట్టింది.

Fishing Harbour in Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్‌ హార్బర్‌

#Tags