కరెంట్ అఫైర్స్ (సెప్టెంబర్ 1 - 7, 2017) బిట్ బ్యాంక్
1. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అరవింద్ పనగరియా
2) రాజీవ్ కుమార్
3) శశికాంత్ శర్మ
4) రంజిత్ పటేల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రముఖ ఆర్థిక వేత్త టీకే రాజీవ్ కుమార్‌ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయనకన్నా ముందు ఈ పదవిలో ఉన్న అరవింద్ పనగరియా ఆగస్టు 1న రాజీనామా చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది. దీనికి భారత ప్రధాని చైర్మన్ గా ఉంటారు.
- సమాధానం: 2
2. న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా ఇటీవల నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు ?
1) ప్రియాంకా చోప్రా
2) లారాదత్తా
3) ఐశ్వర్యారాయ్
4) కృతి సనన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: బాలీవుడ్ నటి కృతిసనన్ ఇటీవల న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. భారత్, న్యూజిలాండ్ మధ్య విద్య సంబంధాల బలోపేతం కోసం ఆమె కృషి చేస్తారు. న్యూజిలాండ్ విద్యా సంస్థల్లో చేరేలా విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రచారం కల్పిస్తారు.
- సమాధానం: 4
3. ఇస్రో చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ సంస్థతో కలిసి రూపొందించిన ఉపగ్రహం ఏది ?
1) irnss -1h
2) irnss - 1a
3) irnss - 1b
4) irnss - 1c
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుంచి pslv c 39 రాకెట్ ద్వారా irnss -1h ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. అయితే ప్రయోగం నాలుగో దశలో ఉపగ్రహం హీట్ షీల్డ్ తెరుచుకోకపోవడంతో ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఇస్రో చరిత్రలో తొలిసారిగా బెంగళూరులోని ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ సంస్థతో కలిసి ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. ఇందులో 25 శాతం అభివృద్ధి పనులను ఆ సంస్థ చేపట్టింది. ఈ ప్రయోగానికి మందు వరకు ప్రైవేటు సంస్థలు ఇస్రోకు కేవలం ప్రయోగాల్లో పరికరాల సరఫరాకు మాత్రమే పరిమితమయ్యేవి.
- సమాధానం: 1
4. భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులైయ్యారు ?
1) రాజీవ్ మహర్షి
2) నసీం జైదీ
3) అచల్ కుమార్ జ్యోతి
4) సునీల్ అరోరా
- View Answer
- సమాధానం: 4
వివరణ: సమాచార, ప్రసారాల శాఖ మాజీ కార్యదర్శి సునీల్ అరోరాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. ఆయన ఈ పదవిలో నాలుగేళ్లు ఉంటారు. 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేశారు. భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారితో కలిపి ముగ్గురు కమిషనర్లు ఉంటారు. ప్రస్తుత భారత ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అచల్ కుమార్ జ్యోతి.
- సమాధానం: 4
5. తదుపరి కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులైన రాజీవ్ మహర్షి ఏ రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ?
1) మధ్యప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) రాజస్తాన్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: తదుపరి కంప్టోల్రర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా నియమితులైన రాజీవ్ మహర్షి రాజస్తాన్ క్యాడర్ చెందిన 1978 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుత కాగ్ శశికాంత్ శర్మ పదవీ కాలం 2017 సెప్టెంబర్ 25తో ముగుస్తుంది. ఆ తర్వాత రాజీవ్ మహర్షి కాగ్ గా బాధ్యతలు చేపడతారు.
కాగ్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం ఏర్పడిన రాజ్యాంగ కార్యాలయం. కాగ్ ని రాష్ట్రపతి నియమిస్తారు. కాగ్ పదవీకాలం 6 ఏళ్లు లేదా 65 ఏళ్లు. ఇందులో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది. కాగ్ నిబంధనలు, విధులను పేర్కొంటూ ప్రత్యేక చట్టాన్ని 1953లో తీసుకొచ్చారు. 1971లో ఈ చట్టంలో కొన్ని సవరణలు చేశారు.
- సమాధానం: 3
6. ఇటీవల జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన గోవిందోభాగ్ రకం వరి ఏ రాష్ట్రంలో పండుతుంది ?
1) ఆంధ్రప్రదేశ్
2) పశ్చిమ బెంగాల్
3) పంజాబ్
4) అసోం
- View Answer
- సమాధానం: 2
వివరణ: గోవిందోభాగ్ రకం వరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ జిల్లాలో పండుతుంది. ఈ వరికి ఇటీవల ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స రిజిస్ట్రీ జీఐ ట్యాగ్ ఇచ్చింది. ఉత్పత్తి, తయారీలో ఒక ప్రాంతంలో ప్రాముఖ్యత పొందిన ఉత్పత్తులకు ఈ హోదా లభిస్తుంది.
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స ఆఫ్ గూడ్స (రిజిస్ట్రేషన్స అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ - 1999.. భారత్‌లో 2003 సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం 2004-05లో డార్జిలింగ్ టీ భారత్ లో తొలి జీఐ ట్యాగ్ పొందింది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 300 ఉత్పత్తులు, పంటలు, వస్తువులకు ఈ ట్యాగ్ లభించింది.
- సమాధానం: 2
7. ఇటీవల స్మార్ట్ అగ్రికల్చర్ కాన్ క్లేవ్ ఎక్కడ జరిగింది ?
1) బెంగళూరు
2) కోల్కత్తా
3) న్యూఢిల్లీ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: స్మార్ట్ అగ్రికల్చర్ సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో జరిగింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, యూకేకు చెందిన బయోటెక్నాలజీ అండ్ బయోలాజికల్ సెన్సైస్ రీసర్చ్ కౌన్సిల్, రీసర్చ్ కౌన్సిల్స్ యూకే ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశంలో ప్రత్యేక వ్యవసాయ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ పద్ధతులను శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసి అధిక ఉత్పత్తులు సాధించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
- సమాధానం: 3
8. జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 1 - 7
2) సెప్టెంబర్ 8- 15
3) జూలై 1 - 7
4) ఆగస్టు 1 - 7
- View Answer
- సమాధానం: 1
వివరణ: జాతీయ పౌష్టికాహార వారోత్సవాలను ఏటా సెప్టెంబర్ 1 - 7 వరకు నిర్వహిస్తారు. కేంద్ర మహిళా శిశు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆహార, పౌష్టికాహార బోర్డు ఈ వారోత్సవాలను నిర్వహిస్తుంది. మంచి ఆరోగ్య కోసం మంచి ఆహారం అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
2017 Theme : Optimal infant and young child feeding practices: Better child health.
- సమాధానం: 1
9. ప్రపంచంలో తక్కువ స్థాయిలో శుద్ధి చేసిన తొలి యురేనియం బ్యాంకుని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1) కజకిస్తాన్
2) ఇరాన్
3) దక్షిణ కొరియా
4) ఉజ్బెకిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూఎన్ న్యూక్లియర్ నిఘా సంస్థ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కలిసి ప్రపంచంలో తొలి లో ఎన్రిచ్డ్ యురేనియం బ్యాంకుని కజకిస్తాన్‌లోని ఓస్కేమెన్లో ప్రారంభించాయి. ప్రపంచంలో ఏ దేశం ఆధీనంలో లేని తొలి యురేనియం బ్యాంకు కూడా ఇదే. ఈ బ్యాంకులో దాదాపు 90 టన్నుల లో ఎన్ రిచ్డ్ యురేనియం నిల్వలు ఉంటాయి. అసాధారణ పరిస్థితులలో తమ అణు కర్మాగారాలలో ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఐఏఈఏ సభ్య దేశాలు ఈ బ్యాంకు నుంచి యురేనియం నిల్వలను పొందవచ్చు. దీన్ని విద్యుత్ ఉత్పత్తి కోసమే వాడాల్సి ఉంటుంది.
- సమాధానం: 1
10. భారత్ కు చెందిన అదానీ గ్రూప్ రక్షణ ఉత్పత్తుల కోసం ఇటీవల ఏ దేశానికి చెందిన రక్షణ, ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం చేసుకుంది ?
1) స్వీడన్
2) స్విట్జర్లాండ్
3) జర్మనీ
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్వీడన్‌కు చెందిన సాబ్ కంపెనీతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంలో భారత్‌లో సింగిల్ ఇంజిన్ ఫైటర్ జెట్స్‌ను తయారు చేస్తాయి. ఈ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు.
- సమాధానం: 1
11. ఐ డూ వాట్ ఐ డూ పుస్తక రచయిత ఎవరు ?
1) ఉర్జిత్ పటేల్
2) రఘురామ్ రాజన్
3) అమర్త్యసేన్
4) శశిథరూర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐ డూ వాట్ ఐ డూ పుస్తకాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించారు. ఆర్బీఐ గవర్నర్‌గా తన అనుభవాలను వివరిస్తూ ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. రాజన్ 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 23వ గవర్నర్‌గా ఉన్నారు.
- సమాధానం: 2
12. ఇటీవల ఏ దేశం ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణకు ప్రపంచంలో కెల్లా అతి కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టింది ?
1) భారత్
2) అమెరికా
3) కెన్యా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తూ కెన్యా ప్రపంచంలో కెల్లా కఠినమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం కెన్యాలో ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, విక్రయం, వినియోగం పూర్తిగా నిషిద్ధం. నిబంధనలను అతిక్రమించిన వారు 4 ఏళ్ల జైలు శిక్ష లేదా 40 వేల డాలర్ల జరిమానా చెల్లించాలి.
కెన్యా కన్నా ముందే ఆఫ్రికా ఖండంలోని ఇతర 9 దేశాలు ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించాయి. ఆసియాలో ఈ చర్యలు చేపట్టిన తొలి దేశం బంగ్లాదేశ్.
- సమాధానం: 3
13. The CIAPM & DIPP జియోగ్రాఫికల్ ఇండికేషన్స ప్రమోషన్ కోసం ఇటీవల ప్రారంభించిన సోషల్ మీడియా క్యాంపెయిన్ హాష్ ట్యాగ్ ఏంటి ?
1) #talkipforpromotion
2) #letstalk
3) #letstalkip
4) #letsgetonip
- View Answer
- సమాధానం: 3
వివరణ: The cell for IPR Promotions and Management & CIAPM భారత జియోగ్రాఫికల్ ఇండికేషన్స ప్రమోషన్ కోసం #letstalkip హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ ప్రారంభించింది. ఇంటలెక్చ్యుల్ ప్రాపర్టీ రైట్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. CIAPM డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్టియ్రల్ పాలసీ అండ్ ప్రమోషన్ - DIPP, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
- సమాధానం: 3
14. 2017 సంవత్సరానికిగాను ప్రకటించిన యునెస్కో అక్షరాస్యత పురస్కారాలలో కన్ ఫ్యూషియస్ ప్రైజ్ ఫర్ లిటరసీ అవార్డును పొందిన సంస్థ ఏది ?
1) అడల్ట్ టికో ప్రోగ్రామ్
2) సిటిజన్స్ ఫౌండేషన్
3) ఫున్ ద్జా ప్రాజెక్టు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రపంచ అక్షరాస్యతకు ఉత్తమంగా, నవ కల్పనలతో కృషి చేసినవారికి యునెస్కో ఏటా సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇటీవల 51వ లిటరసీ డేను పురస్కరించుకొని ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో కన్ ఫ్యూషియస్ ప్రైజ్ ఫర్ లిటరసీ అవార్డుని కొలంబియాకు చెందిన అడల్ట్ టికో ప్రోగ్రామ్, పాకిస్తాన్‌కు చెందిన సిటిజన్స ఫౌండేషన్, దక్షిణ కొరియాకు చెందిన ఫున్ ద్జా ప్రాజెక్టులకు లభించింది.
అవార్డుల్లో భాగంగా యునెస్కో ప్రదానం చేసే సెంటర్ ఫర్ ది స్డడీస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఫెర్మారెన్స అవార్డుకు జోర్డాన్‌కు చెందిన ఉయ్ లవ్ రీడింగ్ ప్రాజెక్టు దక్కించుకుంది. అవార్డు గ్రహీతలకు మెడల్ తో పాటు రూ. 12.8 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తారు. ఈ అవార్డును 1967 నుంచి అందజేస్తున్నారు.
- సమాధానం: 4
15. భారత్ లో జరగనున్న ఫిఫా అండర్ - 17 ప్రపంచ అధికారిక గీతానికి సంగీతం అందించింది ఎవరు ?
1) ఏఆర్ రహమాన్
2) దేవీశ్రీప్రసాద్
3) తమన్
4) ప్రీతమ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఫిఫా అండర్ 17 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ అధికారిక పాటని స్థానిక నిర్వహణ కమిటీ, సోనీ పిక్చర్స్ రూపొందించాయి. కర్కే దిఖ్ లా దే గోల్ అనే పల్లవితో ప్రారంభయ్యే ఈ పాటని ప్రముఖ గీత రచయిత అమితాబ్ భట్టాచార్య రచించారు. సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు.
- సమాధానం: 4
16. విద్యుత్ ఆదా కోసం ఇటీవల మలేషియాలోని మెలాకలో ప్రారంభించిన పథకం పేరు ఏమిటి ?
1) ఉజ్వల
2) ఉజాలా
3) శక్తి
4) ఉదయ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మలేషియాలోని మెలాకలో భారత కేంద్ర ప్రభుత్వ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ది ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా మెలాకాలోని ప్రతి ఇంటికి 9 వాట్ల ఎల్ ఈ డీ 10 బల్బులను 10 మలేషియా రింగిట్ లకే పంపిణీ చేస్తారు.
భారత్‌లో ఈ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభత్వం 2015 మే 1న ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను అందించి విద్యుత్ వాడకాన్ని తగ్గించాలన్నది ఈ స్కీమ్ లక్ష్యం.
- సమాధానం: 1
17. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సులో ప్రవేశపెట్టిన మయన్మార్ వ్యతిరేక తీర్మానానికి మద్దతు తెలపని దేశం ఏది ?
1) బంగ్లాదేశ్
2) ఇండోనేషియా
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ పార్లమెంటరీ సదస్సు ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఇందులో రోహింగ్యా ముస్లింల సమస్య విషయంలో మయన్మార్ వైఖరిని తప్పుపడుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలోని భారత్ బృందం ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించలేదు.
- సమాధానం: 4
18. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆసియాలో అత్యంత అవినీతి ఉన్న దేశం ఏది ?
1) పాకిస్తాన్
2) మయన్మార్
3) థాయ్‌లాండ్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, యాంటీ కరెప్షన్ గ్లోబల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అవినీతిపై నివేదిక రూపొందించింది. ఇటీవల ఈ నివేదికను విడుదల చేసిన ఫోర్బ్స్.. ఆసియాలో అత్యంత అవినీతి ఉన్న దేశం భారత్ అని తేల్చింది. ఈ నివేదిక ప్రకారం భారత్ 69 శాతం అవినీతితో ఆసియాలో తొలి స్థానంలో ఉంది. 65 శాతంతో వియత్నాం రెండు, 41 శాతంతో థాయ్‌లాండ్ మూడు, 40 శాతంతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
పాఠశాలలు, ఆస్పత్రులు, గుర్తింపు పత్రాల జారీ, పోలీసు, వినియోగ సేవలు పొందేందుకు లంచం అడుగుతున్న తీరుని అధ్యయనం చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించారు.
- సమాధానం: 4
19. దేశంలోని ఏ రాష్ట్రం రోహింగ్యా శరణార్థుల పిల్లలకు గుర్తింపు కార్డులు ఇవ్వనుంది ?
1) అసోం
2) పశ్చిమ బెంగాల్
3) ఒడిశా
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మయన్మార్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చి పశ్చిమ బెంగాల్లో ఉంటున్న రోహింగ్యాల పిల్లలకు ఐరాస గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. వీటిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దేశంలో 16,500 మంది రోహింగ్యా శరణార్థులు నమోదయ్యారని ఐరాస లెక్కలు చెబుతున్నాయి. రోహింగ్య శరణార్థులకు భారత ప్రభుత్వం దీర్ఘకాలిక విసాలు జారీ చేస్తుంది. ఇవి వారు ఉద్యోగాలు పొందేందుకు, పౌరు సేవలు పొందేందుకు ఉపయోగపడతాయి.
- సమాధానం: 2
20. ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏ దేశాల్లో సుస్థిరాభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1.4 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది ?
1) పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, కజకిస్తాన్
2) భారత్, చైనా, రష్యా
3) శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్
4) థాయ్ లాండ్, మయన్మార్, ఫిలిప్పీన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూ డెవలప్మెంట్ బ్యాంకు - ఎన్డీబీ భారత్, చైనా, రష్యాలో సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1.4 బిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో భారత్ వాటా 470 మిలియన్ డాలర్లు. ఈ నిధులతో మధ్యప్రదేశ్‌లోని బహుళ గ్రామీణ తాగు నీటి సరఫరా పథకాన్ని చేపడతారు.
న్యూ డెవలప్మెంట్ బ్యాంకుని బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేశాయి. దీన్నే బ్రిక్స్ బ్యాంకు అని కూడా అంటారు. చైనాలోని షాంఘైలో దీని ప్రధాన కార్యాలయం ఉంది. బ్యాంకు తొలి ప్రాంతీయ కార్యాలయాన్ని దక్షిణాఫ్రికాలోని జోహన్నస్ బర్గ్‌లో ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 2
21. ఇటీవల సీబీఎస్ఈ బోర్డు చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది ?
1) రాజేశ్ కుమార్ చతుర్వేది
2) అనితా కర్వాల్
3) మేఘనా నాథ్
4) సునీల్ అరోరా
- View Answer
- సమాధానం: 2
వివరణ: 1998 బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనితా కర్వాల్‌ను సెంట్రల్ బోర్డ్ ఆప్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న రాజేశ్ కుమార్ చతుర్వేదిని జాతీయ స్కిల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ డెరైక్టర్ జనరల్‌గా నియమించింది.
- సమాధానం: 2
22. భారత దేశ రక్షణ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులైన నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 3
వివరణ: నిర్మలా సీతారామన్ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖ అప్పగించారు. దీంతో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత రక్షణ శాఖను చేపట్టిన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు. పునర్వ్యవస్థీకరణకు ముందు నిర్మలా సీతారామన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నారు.
- సమాధానం: 3
23. ఏ బ్రిక్స్ సదస్సులో ఉగ్రవాదంపై తొలిసారి చర్చ జరిగింది ?
1) 9వ బ్రిక్స్ సదస్సు
2) 8వ బ్రిక్స్ సదస్సు
3) 7వ బ్రిక్స్ సదస్సు
4) 6వ బ్రిక్స్ సదస్సు
- View Answer
- సమాధానం: 1
వివరణ: చైనాలోని జియామెన్‌లో సెప్టెంబర్ 3 - 5 వరకు 9వ బ్రిక్స్ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా ముందుకెళ్లాలని సభ్య దేశాలు తీర్మానించాయి. బ్రిక్స్ దేశాలు - బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా
- సమాధానం: 1
24. బ్రిక్స్ దేశాలకు ప్రత్యేక రేటింగ్ ఏజెన్సీ ఉండాలని ప్రతిపాదించిన నేత ఎవరు ?
1) జిన్ పింగ్
2) వ్లాదిమిర్ పుతిన్
3) మైకెల్ టెమర్
4) నరేంద్ర మోదీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: చైనాలోని జియామెన్ లో జరిగిన 9వ బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల కోసం ప్రత్యేకంగా బ్రిక్స్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదించారు. సదస్సులోని ప్లీనరీ సెషన్ లో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ సూచన చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా సీఆర్ఏ మార్కెట్లో ఎస్ అండ్ పీ, మూడీస్, ఫిచ్ సంస్థల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఈ మూడు సంస్థలు అమెరికావే.
- సమాధానం: 4
25. మహేంద్ర సింగ్ ధోని ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓ బ్యాట్స్ మెన్ ను స్టంపింగ్ చేయడం ద్వారా వన్డేల్లో వంద స్టింపింగ్ల మార్కుని అందుకున్నాడు ?
1) ఆస్ట్రేలియా
2) బంగ్లాదేశ్
3) శ్రీలంక
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సీరీస్‌లో భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వంద స్టంపింగ్ల మార్కుని చేరుకున్నాడు. శ్రీలంక ఆటగాడు అకిల ధనుంజయను అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డుని నమోదు చేశాడు. శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర 99 స్టంపింగ్ లతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉండగా ఇప్పుడు ధోని ఆ స్థానాన్ని సాధించాడు.
- సమాధానం: 3
26. ఇటలీ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) లూయిస్ హామిల్టన్
2) సెబాస్టియన్ వెటెల్
3) బొటాస్
4) ఒకాన్ ఆరో
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటలీలో జరిగిన గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసులో మెర్సిడీస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. మెర్సిడిస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానంలో, ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు.
- సమాధానం: 1
27. ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్ ఎవరు ?
1) గౌరవ్ బిధురి
2) అఖిల్ కుమార్
3) మేరీ కోమ్
4) దేవేంద్రొ సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన 19వ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన భారత బాక్సర్ గౌరవ్ బిధురి కాంస్య పతకం సాధించాడు. దీంతో విజేందర్ - 2009, వికాస్ క్రిష్ణన్ - 2011, శివ థాపా - 2015 తర్వాత భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన నాలుగో బాక్సర్‌గా గౌరవ్ నిలిచాడు.
- సమాధానం: 1
28. ఇటీవల ఏ దేశం హైడ్రోజన్ బాంబుని పరీక్షించింది ?
1) దక్షిణ కొరియా
2) ఉత్తర కొరియా
3) జపాన్
4) అమెరికా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ద్వారా హైడ్రోజన్ బాంబుని విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఇది ఉత్తర కొరియా జరిపిన ఆరవ న్యూక్లియర్ పరీక్ష. గతేడాది సెప్టెంబర్‌లో జరిపిన ఐదో ప్రయోగం కన్నా ఆరో ప్రయోగం 5 నుంచి 6 రెట్లు శక్తిమంతమైందని దక్షిణ కొరియా వెల్లడించింది.
- సమాధానం: 2
29. ఇంటర్నేషన్ డే ఆఫ్ చారిటీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) సెప్టెంబర్ 5
2) సెప్టెంబర్ 6
3) సెప్టెంబర్ 7
4) సెప్టెంబర్ 8
- View Answer
- సమాధానం: 1
వివరణ: సెప్టెంబర్ 5న మదర్ థె రెసా వర్ధంతిని పురస్కరించుకొని ఏటా ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ దినోత్సవంగా నిర్వహిస్తారు. ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్ 5న ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని 2012 డిసెంబర్ 17న తీర్మానించింది. దీంతో 2013 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మదర్ థెరెసా 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు.
- సమాధానం: 1
30. ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టం - 1958 ప్రకారం ఇటీవల ఏ రాష్ట్రాన్ని మరో ఆరు నెలల పాటు డిస్టర్బ్ డ్ ఏరియాగా ప్రకటించారు ?
1) అస్సాం
2) నాగాలాండ్
3) మణిపూర్
4) మిజోరం
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2017 ఆగస్టు 31 తర్వాత మరో ఆరు నెలల పాటు అసోం రాష్ట్రాన్ని డిస్టర్బడ్ ఏరియాగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ చట్టం అసోం రాష్ట్రంలో 1990 నుంచి అమల్లో ఉంది. గతేడాది ఆ రాష్ట్రంలో 75 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇందులో 33 మంది చనిపోయారు. ఉల్ఫా ఉగ్రవాదులు, ఎన్డీ ఎఫ్బీ గ్రూపుల వల్ల రాష్ట్రంలో వరుసగా హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
- సమాధానం: 1
31. భారత్‌లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని ఇటీవల ప్రారంభించిన సంస్థ ఏది ?
1) భారత ఆహార సంస్థ
2) నీతి ఆయోగ్
3) సీబీఎస్ఈ
4) మహిళా, శిశు సంక్షేమ శాఖ
- View Answer
- సమాధానం: 2
వివరణ: పోషకాహార లోప రహిత భారత్‌ను సాధించేందుకు నీతి ఆయోగ్ నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీని ప్రారంభించింది. హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, పద్మశ్రీ హెచ్ సుదర్శన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- సమాధానం: 2
32. ప్లస్ అలియన్స ప్రైజ్ - 2017కు ఎంపికైంది ఎవరు ?
1) ఎన్ ఆర్ నారాయణమూర్తి
2) అజీమ్ ప్రేమ్ జీ
3) ముకేశ్ అంబానీ
4) చందా కొచ్చర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్లస్ అలియన్స ప్రైజ్‌ని 2016 ఫిబ్రవరిలో ప్రారంభించారు. రీసర్చ్ ఇన్నోవేషన్, విద్యా ఆవిష్కరణ, గ్లోబల్ లీడర్ షిప్, గ్లోబల్ ఇన్నవేషన్ అంశాల్లో ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. 2017 సంవత్సరానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణమూర్తి ప్లస్ అలియన్స నుంచి గ్లోబల్ లీడర్ షిప్ విభాగంలో ఈ అవార్డును అందుకున్నారు. ముంబైకు చెందిన శాస్త్రవేత్త వీణా సహజ్ వాల్లా ది న్యూ సైన్స ఆఫ్ గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టుకు గాను రీసర్చ్ ఇన్నోవేషన్ విభాగంలో అవార్డుని అందుకున్నారు.
- సమాధానం: 1
33. ఇటీవల గురుగ్రామ్ నగరంలో వెయ్యి ఈ - రిక్షాలను ఏ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు ?
1) స్మార్ట్ - ఈ
2) స్మార్ట్ - ఆర్
3) స్మార్ట్ - ఏ
4) స్మార్ట్ - ఎం
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రయాణికులను మెట్రో స్టేషన్ల వరకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ - ఈ కార్యక్రమం కింద వచ్చే నాలుగేళ్లలో ఉపాధి లేని యువతకు లక్ష ఈ - రిక్షాలను అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం స్మార్ట్ - ఈ, హర్యానా ప్రభుత్వం, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా గురుగ్రామ్ నగరంలో తొలి విడతగా వెయ్యి ఈ - రిక్షాలను ఇటీవల ప్రారంభించారు.
- సమాధానం: 1
34. ఇటీవల ఏ దేశాలకు చెందిన సంస్థలు బాలిక, మహిళా విద్యకు కృషి చేసినందుకు గాను యునెస్కో ప్రైజ్‌ను గెలుచుకున్నాయి ?
1) భారత్, చైనా
2) అఫ్గనిస్తాన్, కజకిస్తాన్
3) థాయ్‌లాండ్, పెరూ
4) జపాన్, రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: బాలికా, మహిళా విద్య కోసం కృషి చేసినందుకుగాను రెండు సంస్థలకు ఇటీవల యునెస్కో - 2017 ప్రైజ్‌ను ప్రకటించారు. థాయ్‌లాండ్‌కు చెందిన ది డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ డాటర్స్ అండ్ కమ్యూనిటీస్ సెంటర్ ఇన్ ద గ్రేటర్ మెకాంగ్ సబ్ రీజియన్ - డీఈపీడీసీ - జీఎంఎస్, పెరూకు చెందిన మొబైల్ మేక్ టెక్ బస్ లేబ్స్ , మినీ అకడామీ ఆప్ సైన్స అండ్ టెక్నాలజీ సంస్థలు ఈ ప్రైజ్ ను అందుకున్నాయి. అవార్డు కింద 50 వేల డాలర్ల నగదు బహుమతి అందజేశారు.
- సమాధానం: 2
35. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి కోసం ప్రత్యేకంగా దీక్ష పోర్టల్ ను ప్రారంభించింది ?
1) ఉపాధ్యాయులు
2) పాత్రికేయులు
3) క్రీడాకారులు
4) శాస్త్రవేత్తలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: టీచర్లకు ప్రత్యేత డిజిటల్ వేదికను ఏర్పాటు చేసేందుకు disksha.gov.in అనే పోర్టల్‌ను కేంద్ర హెచ్ఆర్డీ మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఉపాధ్యాయ శిక్షణ కోసం నమోదు అయినప్పటి నుంచి ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసే వరకు టీచర్ల జీవన శైలికి సంబంధించిన పూర్తి సమాచారంతో, విలువైన సలహాలు, సూచనలతో పోర్టల్‌ను రూపొందించారు.
- సమాధానం: 1
36. ఇటీవల రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం రద్దయిన 15.44 లక్షల విలువైన నోట్లలో ఎన్ని లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగివచ్చాయి ?
1) రూ. 15. 44 లక్షల కోట్లు
2) రూ. 15. 28 లక్షల కోట్లు
3) రూ. 15 లక్షల కోట్లు
4) రూ. 14 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ.500 నోట్లలో రద్దు అనంతరం 99 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరికి వచ్చాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016-17 వార్షిక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం రద్దయిన రూ.15.44 లక్షల విలువైన నోట్లలో.. రూ.15.28 లక్షల విలువైన నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయి. కేవలం రూ.16,050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకులకు రాలేదు.
- సమాధానం: 2
37. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల్లో ఎంత శాతం నిధులను మహిళా రైతుల కోసం కేటాయించాలని ఇటీవల నిర్ణయించడం జరిగింది ?
1) 25 శాతం
2) 30 శాతం
3) 35 శాతం
4) 40 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్న నిధుల్లో 30 శాతం మహిళా రైతులకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ నమూనా సర్వే ప్రకారం దేశంలో ఆర్థిక స్వాతంత్ర్యం కలిగిన మహిళలల్లో 80 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు.
- సమాధానం: 2
38. వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసార, డిజిటల్ హక్కులని స్టార్ ఇండియా ఎంత మొత్తానికి దక్కించుకుంది ?
1) రూ.13,347.50 కోట్లు
2) రూ. 14,347.50 కోట్లు
3) రూ. 15,347.50 కోట్లు
4) రూ.16,347.50 కోట్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐదేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులని సోనీతో పోటీ పడి స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం 2018 నుంచి 2022 వరకు ఉంటుంది.
- సమాధానం: 4
39. తీర ప్రాంత కోత కారణంగా ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోని పారాలి వన్ దీవి పూర్తిగా కనుమరుగైంది ?
1) లక్షద్వీప్
2) అండమాన్ అండ్ నికోబార్
3) డామ్ అండ్ డయూ
4) దివిసీమ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆర్ ఎం హిదయతుల్లా కోస్టల్ ఏరోషన్ అనే అంశంపై అధ్యయనానికి గాను కేరళలోని కాలికట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ అందుకున్నారు. ఆయన జరిపిన అధ్యయనం ప్రకారం లక్షద్వీప్ పరిధిలో గోల్డ్ చైన్ ఆఫ్ ఐలాండ్స లోని పారాలి 1 దీవి తీర ప్రాంత కోత కారణంగా పూర్తిగా కనుమరుగైంది.
- సమాధానం: 2
40. స్లినెక్స్ - 2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి ?
1) భారత్, శ్రీలంక
2) భూటాన్, శ్రీలంక
3) చైనా, శ్రీలంక
4) బంగ్లాదేశ్, శ్రీలంక
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత్, శ్రీలంక దేశాల నౌకాదళ సిబ్బంది మధ్య సంబంధాల బలోపేతం కోసం స్లినెక్స్ పేరుతో సంయుక్త నౌకా విన్యాసాలు సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 14 వరకు విశాఖపట్నంలో జరిగాయి. 2005 నుంచి రెండు దేశాలు ఈ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి.
- సమాధానం: 1
41. ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య ఎన్ని కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయి ?
1) రూ. 3 వేల కోట్లు
2) రూ. 4 వేల కోట్లు
3) రూ. 5 వేల కోట్లు
4) రూ.6 వేల కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వాల మధ్య రూ. 3వేల కోట్ల విలువైన ఆరు ఒప్పందాలు కుదిరాయి. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గనులు, రవాణా, సాంకేతికత, వైద్యం, విద్య, ఆక్వాకల్చర్ రంగాల్లో పశ్చిమ ఆస్ట్రేలియా పెట్టుబడులు పెడుతుంది.
- సమాధానం: 1
42. తెలంగాణలో వెయ్యి ఎకరాల లోపు వ్యవసాయ భూములు ఉన్న గ్రామాల సంఖ్య ఎంత ?
1) 5,976
2) 4,976
3) 3,976
4) 6,976
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన రైతు సమగ్ర సర్వే నివేదికవివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 45.1 లక్షల మంది రైతుల వద్ద 1.24 కోట్ల ఎకరాలు భూమి ఉంది.
- సమాధానం: 1
43. ఇటీవల అర్జున అవార్డులు అందుకున్న క్రీడాకారుల్లో ఎవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది ?
1) జ్యోతి సురేఖ వెన్నెం
2) చతేశ్వర పుజారా
3) వరుణ్ భాటి
4) ప్రకాశ్ నన్జప్పా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి వెన్నెం జ్యోతి సురేఖ ఇటీవల భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు అందుకుంది. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు కోటి రూపాయల నజరానాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, విజయవాడలో 500 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది.
- సమాధానం: 1
44. స్కోచ్ సంస్థ 2017 సంవత్సరానికి గాను ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1) కె.తారకరామారావు
2) నారా లోకేష్
3) ప్రియాంక్ ఎం ఖర్గే
4) ప్రియా దత్
- View Answer
- సమాధానం: 1
వివరణ: స్కోచ్ సంస్థ 2017 సంవత్సరానికిగాను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావుకి ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ప్రకటించింది. సృజనాత్మక విధానాలతో రాష్ట్రానికి అవసరమైన ఐటీ రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తున్నందుకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. స్కోచ్ సంస్థ 2003 నుంచి వివిధ రాష్ట్రాల పరిపాలనను అంచనా వేస్తూ స్మార్ట్ గవర్నెన్స్ అవార్డులను అందజేస్తుంది.
- సమాధానం: 1
45. మిస్ ఇండియా దక్షిణాఫ్రికా గాటెంగ్ - 2017 అందాల పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు ?
1) అడ్డేపల్లి శ్రీశుభ
2) ప్రియాంక వర్షి
3) వనిత నానో
4) పరిణీతి చౌహాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అడ్డేపల్లి శ్రీశుభ మిస్ ఇండియా దక్షిణాఫ్రికా కిరీటాన్ని సొంతం చేసుకుంది. భారతీయ సంతతికి చెందిన యువతి ఈ పోటీల్లో నెగ్గడం ఇది రెండోసారి.
- సమాధానం: 1
46. ఇటీవల ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎన్నికై న వివేక్ గోయంకా ఏ గ్రూప్ సంస్థలకు మేనేజింగ్ డెరైక్టర్ గా ఉన్నారు ?
1) ది హిందూ
2) మలయాల మనోరమ
3)ఎక్స్‌ప్రెస్ గ్రూప్
4) టైమ్స్ ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా ఎక్స్‌ప్రెస్ గ్రూప్ మేనేజింగ్ డెరైక్టర్ వివేక్ గోయంకా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రియద్ మాథ్యూ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. పీటీఐ వైస్ చైర్మన్‌గా ది హిందూ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ ఎన్నికయ్యారు.
- సమాధానం: 3
47. ఇటీవల ఏ బ్యాంకుని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డొమస్టిక్ సిస్టమేటికల్లి ఇంపార్టెంట్ బ్యాంకు (D-SIB) జాబితాలో చేర్చింది ?
1) హెచ్డీఎఫ్సీ
2) బ్యాంక్ఆఫ్ ఇండియా
3) యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా
4) సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీని ఇండియా డొమస్టిక్ సిస్టమేటికల్లి ఇంపార్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రకటించింది. వ్యాపార నిర్వహణలో వైఫల్యానికి తావులేకండా అత్యంత బలంగా ఉన్న బ్యాంకులకు ఈ హోదా ఇస్తారు. బ్యాంకుల ఆస్తులు విలువ దేశ జీడీపీలో 2 శాతంకన్నా ఎక్కువ ఉంటే ఈ గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులకు ఈ గుర్తింపు లభించింది.
- సమాధానం: 1
48. సూర్యరశ్మి, నీటిని ఉపయోగించి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కృత్రిమ ఆకుని ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు ?
1) సీఎస్ఐఆర్
2) ఇస్రో
3) ఇక్రిశాట్
4) సీసీఎంబీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: సూర్యరశ్మి, నీటి ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కృత్రిమ ఆకుని పూణెలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసర్చ్, నేషనల్ కెమికల్ లాబోరేటరీ శాస్త్రవేత్తలు రూపొందించారు. తాము తయారు చేసిన ఆకు 23 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం ఉంటుందని.. దీని ద్వారా గంటకు 6 లీటర్ల హైడ్రోజన్ ఇంధనం ఉత్పత్తి అవుతుందని సీఎస్ఐఆర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చిన్నకొండ గోపీనాథ్ వెల్లడించారు.
- సమాధానం: 1
49. ఆస్ట్రేలియా బాస్కెట్ బాల్ టీమ్‌తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తొలి భారతీయ బాస్కెట్ బాల్ ప్లేయర్ ఎవరు ?
1) అమ్ జ్యోత్ సింగ్
2) యద్విందర్ సింగ్
3) అమ్రిత్ పాల్ సింగ్
4) విశెష్ బ్రిగువంశి
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత బాస్కెట్ బాల్ టీమ్ కెప్టెన్ అమ్రిత్ పాల్ సింగ్‌తో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ కింగ్స బాస్కెట్ బాల్ జట్టు ఇటీవల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీంతో.. ఆస్ట్రేలియా బాస్కెట్ బాల్ టీమ్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తొలి భారతీయ ప్లేయర్ గా అమ్రిత్ పాల్ సింగ్ నిలిచాడు.
- సమాధానం: 3
50. ఇటీవల హాకీ ఇండియా హాకీ కోచ్ పదవి నుంచి ఎవరిని తొలగించింది ?
1) రోలంట్ ఓల్ట్స్‌మన్
2) హర్బిందర్ సింగ్
3) డేవిడ్ జాన్
4) ధన్ రాజ్ పిళ్లె
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత హాకీ జట్టు కోచ్ పదవి నుంచి నెదర్లాండ్స్ కు చెందిన రోలంట్ ఓల్ట్స్‌మన్ ను హాకీ ఇండియా తొలగించింది. రెండేళ్లుగా హాకీ జట్టు పర్ఫార్మెన్స్ బాగా లేకపోవటంతో ఆయనను పదవి నుంచి తొలగించారు. గత 10 ఏళ్లలో హాకీ ఇండియా జట్టు కోచ్ పదవి నుంచి కోచ్‌ను తప్పించడం ఇది ఆరోసారి.
- సమాధానం: 1