కరెంట్ అఫైర్స్ నవంబర్ (8 - 15) బిట్ బ్యాంక్
1. కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ పశుక్రీడ పేరు ఏమిటి ?
1) జల్లికట్టు
2) కంబాలా
3) తబాలా
4) సిరిమానోత్సవం
- View Answer
- సమాధానం: 2
వివరణ: కర్ణాటకలో సంప్రదాయ పశు క్రీడ కంబాలాను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కంబాలా క్రీడ నిర్వహణ కోసం పెటా చట్టంలో మార్పులు చేస్తు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలంటూ కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఆర్డినెన్స్‌పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. దాని చెల్లుబాటు అంశాన్ని మాత్రం పరిశీలిస్తామని ఇటీవల పేర్కొంది.
- సమాధానం: 2
2. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ వేదిక పేరు ఏమిటి ?
1) SHe-Box
2) Online Box
3) E-Women
4) E-WCD
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు షీ - బాక్స్ (సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్టాన్రిక్ బాక్సు) అనే ఆన్లైన్ వేదికను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. 2017 జూలైలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినుల కోసం ప్రారంభించిన ఈ వేదికను ఇటీవల ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు అందుబాటులోకి తెచ్చారు.
- సమాధానం: 1
3. ఏ రంగానికి సంబంధించి ఇటీవల యునెస్కో చెన్నై నగరాన్ని క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చింది ?
1) మీడియా
2) సినిమా
3) సంగీతం
4) సాహిత్యం
- View Answer
- సమాధానం: 3
వివరణ: యునెస్కో ఇటీవల 44 దేశాల్లోని 64 నగరాలను కొత్తగా క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చింది. దీంతో ఈ నెట్ వర్క్ జాబితా 72 దేశాలతో 180కి చేరింది. సంగీతం విభాగంలో చెన్నై నగరానికి ఇటీవల ఈ జాబితాలో చోటు దక్కింది. సిటీ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో జైపూర్, సిటీ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ ఫోల్క్ ఆర్ట్ విభాగంలో వారణాసి 2015 డిసెంబర్లో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్‌లో చేరాయి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు.
- సమాధానం: 3
4. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ - 2017లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది ?
1) తెలంగాణ
2) హర్యానా
3) ఒడిశా
4) ఛత్తీస్ గఢ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: వ్యాపారానికి అనుకూలమైన సంస్కరణలు అమలు చేస్తున్న(business reforms action plan) రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను ఏటా ప్రకటిస్తున్నారు. 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 61.83 శాతం స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. 54.03 శాతం స్కోరుతో హర్యానా రెండో స్థానంలో, 45.70 స్కోరుతో ఒడిశా మూడో స్థానంలో, 45.43 స్కోరుతో ఛత్తీస్గడ్ నాలుగో స్థానంలో నిలిచాయి.
- సమాధానం: 1
5. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్ ఎవరు ?
1) కిడాంబి శ్రీకాంత్
2) హెచ్ఎస్ ప్రణయ్
3) సాత్విక్ సాయిరాజ్
4) సాయి ప్రణీత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి హెచ్ఎస్ ప్రణయ్ టైటిల్ విజేతగా నిలిచాడు.
- సమాధానం: 2
6. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) పీవీ సింధు
2) రితుపూర్ణ దాస్
3) సైనా నెహ్వాల్
4) శ్రీ కృష్ణ ప్రియ
- View Answer
- సమాధానం: 3
వివరణ: 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధును ఓడించి సైనా నెహ్వాల్ టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను సాత్విక్ సాయి రాజ్, అశ్విని పొన్నప్ప గెలుచుకున్నారు.
- సమాధానం: 3
7. 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు అందుబాటులోకి రానున్నాయి ?
1) 650
2) 250
3) 100
4) 400
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(IPPB) సేవలను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ బ్యాంకులను 1 లక్ష 55 వేల గ్రామీణ పోస్ట్ ఆఫీసులతో అనుసంధానం చేస్తారు.
- సమాధానం: 1
8. కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతి సుంకాన్ని ఇటీవల ఎంతకు పెంచింది ?
1) 10 శాతం
2) 20 శాతం
3) 30 శాతం
4) 50 శాతం
- View Answer
- సమాధానం: 2
వివరణ: గోధుమలపై ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBEC) ఇటీవల 20 శాతానికి పెంచింది. దేశీయంగా రైతులు పండించిన గోధుమ పంటకు మంచి ధరలు లభించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బటానీల(peas) పై దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పెంచింది.
- సమాధానం: 2
9. ఆసియాన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్- 2017లోపసిడి పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ?
1) కిమ్ హ్యాంగ్ మి
2) క్రిస్టీ మార్టిన్
3) మేరీ కోమ్
4) కవిత గోయట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆసియాన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ లైట్ వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్మిని ఓడించి భారత బాక్సర్ మేరీ కోమ్ విజేతగా నిలిచింది. మొత్తంగా ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమెకిది 5వ స్వర్ణం.
- సమాధానం: 3
10. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో ఉండే ఆలివ్ రైడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం భారత్‌లోని ఏ రాష్ట్ర తీర ప్రాంతానికి అధికంగా వస్తాయి ?
1) ఆంధ్రప్రదేశ్
2) గోవా
3) ఒడిశా
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆలివ్ రైడ్లీ తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం ఒడిశా కేంద్రపారా జిల్లాలోని గహరిమాతా బీచ్‌కి అధిక సంఖ్యలో తరలివస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో నెలల్లో అవి ఇక్కడ గుడ్లను పొదుగుతాయి. 2016-17లో 9.75 లక్షల ఆలివ్ రైడ్రీ తాబేళ్లు ఈ ప్రాంతానికి వచ్చాయి. ఈ తాబేళ్ల సంఖ్యరోజు రోజుకీ తగ్గిపోతున్నందున వీటిని IUCN ప్రమాదంలో ఉన్న జంతువుల జాబితాలో చేర్చింది. భారత్‌లో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంఆలివ్ రైడ్లీ తాబేళ్ల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
- సమాధానం: 3
11. 19వ ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ - 2017 ఎక్కడ జరిగింది ?
1) టర్కీ
2) చైనా
3) ఇండోనేషియా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ - 2017 సమావేశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ సమావేశాలను మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. 2014 సమావేశాలు టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగాయి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహిస్తారు.
- సమాధానం: 4
12. భారత్‌లో ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాల్లో ఉపయోగపడేందుకు డిజాస్టర్ మ్యాప్స్‌ను రూపొందించిన సంస్థ ఏది ?
1) ట్విటర్
2) గూగుల్
3) ఫేస్బుక్
4) లింక్డిన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి ఫేస్బుక్ తొలి డిజాస్టర్ రెస్పాన్స్ సమ్మిట్‌ను ఇటీవల నిర్వహించింది. ఈ సందర్భంగా భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజాస్టర్ మాప్స్‌ను విడుదల చేసింది.
- సమాధానం: 3
13. నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) చిత్రా రామకృష్ణ
2) చందా కొచ్చర్
3) దేబ్ జానీ ఘోష్
4) వనితా నారాయణన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ (NASSCOM - National Association of sotware and services companies) ప్రెసిడెంట్‌గా దేబ్జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. దేబ్జానీ ఘోష్ ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండిగా పనిచేశారు.
- సమాధానం: 3
14. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముఖ్య విధులు ఏంటి ?
1) ప్రవేశ పరీక్షల నిర్వహణ
2) బ్యాంకు పరీక్షల నిర్వహణ
3) స్కాలర్ షిప్ లబ్ధ్దిదారుల ఎంపిక
4) ఉద్యోగ కల్పన
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల కేంద్ర కేబినెట్ స్వయంప్రతిపత్తితో కూడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రారంభంలో సీబీఎస్ఈ నిర్వహిస్తున్న పరీక్షలని ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్రమంగా మిగతా పరీక్షల నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
- సమాధానం: 1
15. ప్రధానమంత్రి లడఖ్ పునరుత్పాతక ఇంధన కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలో తొలి జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రారంభించారు ?
1) అరుణాచల్ ప్రదేశ్
2) సిక్కిం
3) ఉత్తరాఖండ్
4) జమ్ము అండ్ కశ్మీర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రధానమంత్రి లడఖ్ పునరుత్పాదక ఇంధన కార్యక్రమంలో భాగంగా జమ్ము కశ్మీర్ కార్గిల్ ప్రాంతంలోని బియారస్ డ్రాస్‌లో 1.5 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుని నిర్మించారు. కార్గిల్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ నిర్మించిన ఈ ప్రాజెక్టుని ఇటీవల ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు.
- సమాధానం: 4
16. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి సురక్షితమైన మంచి నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు వెచ్చిస్తాయి ?
1) 70 : 30
2) 50 : 50
3) 60 : 40
4) 30 : 70
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2009లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమాన్ని(NRDWP) 2020 వరకు కొనసాగించాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం రూ.23,050 కోట్లు మంజూరు చేసింది. అలాగే కార్యక్రమాన్ని పునర్ వ్యవస్థీకరించడం ద్వారా పైప్లైన్లతో అన్ని గ్రామాలకు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యక్రమానికి అయ్యే నిధుల్లో చెరి సగం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
- సమాధానం: 2
17. ఇటీవల ఏ రాష్ట్రం ఉర్దూని రెండో అధికారిక భాషగా గుర్తించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణలో రెండో అధికారిక భాషగా ఉర్దూని గుర్తించేందుకు వీలుగా తెలంగాణ భాషల చట్ట సవరణకు రాష్ట్ర శాసనసభ ఆమోముద్ర వేసింది. వాస్తవానికి 1966లోనే ఉర్దూని రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో అది జిల్లా యూనిట్‌గా అమలైంది. ఇప్పుడు చట్ట సవరణతో రాష్ట్ర యూనిట్ గా ఉర్దూ రెండో అధికారిక భాషగా అమలు కానుంది.
- సమాధానం: 1
18. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం హెపటైటిస్ - సీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా ఓరల్ మెడిసన్ అందిస్తుంది ?
1) పంజాబ్
2) పశ్చిమ బెంగాల్
3) హర్యానా
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హెపటైటిస్ - సీతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఓరల్ మెడిసన్ అందిస్తున్న దేశంలోని తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. నెలకు 28 వేల నుంచి 30 వేల రూపాయల విలువ గల మందులను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తుంది.
- సమాధానం: 3
19. IBSF వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ - 2017ను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ?
1) మైక్ రస్సెల్
2) పంకజ్అద్వాని
3) గీత్ సేథి
4) రుపేష్ షా
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఐబీఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఖతార్‌లోని దోహలో జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వాని.. ఇంగ్లండ్‌కు చెందిన మైక్ రస్సెల్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పంకజ్ కు ఇది 17వ ప్రపంచ టైటిల్. దీంతో ఏ క్రీడలోనైనా భారత్ నుంచి అత్యధిక ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా పంకజ్ అద్వాని నిలిచాడు.
- సమాధానం: 2
20.ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్(APEC) సమావేశాలు ఇటీవల ఎక్కడ జరిగారుు ?
1) భారత్
2) చైనా
3) సింగపూర్
4) వియత్నాం
- View Answer
- సమాధానం: 4
వివరణ: వియత్నాంలోని డా నాంగ్‌లో ఆసియా - పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ సమావేశాలు జరిగాయి. ఈ సమ్మిట్‌ను వియత్నాం నిర్వహించడం ఇది రెండోసారి. 2018 సమావేశాలు పాపువా న్యూ గినియాలో జరుగుతాయి.
APEC 1989లో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది. ఇందులో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. 2011 నుంచి ఈ కూటమిలో పరిశీలక దేశంగా ఉన్న భారత్.. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది.
- సమాధానం: 4
21. యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఇరినా బొకోవా
2) ఆడ్రే అజౌలే
3) సౌమ్యా స్వామినాథన్
4) నిక్కీ హేలీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి ఆడ్రే అజౌలే యునెస్కో (UNESCO - United Nations Educational, Science and Cultural Organisation) 11వ డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇరినా బొకోవా స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. 1945 నవంబర్ 16న యునెస్కో ఏర్పాటైంది.
- సమాధానం: 2
22. ఇటీవల ఏ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ?
1) ఫిలిప్పీన్స్
2) ఇజ్రాయెల్
3) చైనా
4) జపాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్సిస్టిట్యూట్(IRI)లో Shri Narendra Modi Resilient Rice Field Laboratory ని ఏర్పాటు చేశారు. ఆసియాన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మనీలా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ పరిశోధక కేంద్రాన్ని సందర్శించి ప్రారంభించారు. ఇరిని 1960లో ప్రారంభించారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.
- సమాధానం: 1
23. 31వ ఆసియాన్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) మనీలా
2) వియత్నాం
3) బ్యాంకాక్
4) జకార్తా
- View Answer
- సమాధానం: 1
వివరణ: 31వ ఆసియాన్ సదస్సు నవంబర్ 13 నుంచి 14 వరకు ఫిలిప్పీన్‌స రాజధాని మనీలాలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని చెప్పారు. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చర్చల్లో భాగస్వాములుగా ఉన్నాయి.
మనీలా వేదికగా ఇటీవల 12వ తూర్పు ఆసియా సదస్సు, 15వ ఆసియాన్ - భారత్ సదస్సులు కూడా జరిగాయి.
- సమాధానం: 1
24. దేశంలో న్యాయ సేవల దినోత్సవాన్ని (legal services day) ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) నవంబర్ 7
2) నవంబర్ 11
3) నవంబర్ 9
4) నవంబర్ 13
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలో న్యాయ సేవల దినోత్సవాన్ని సుప్రీంకోర్టు 1995లో ప్రారంభించింది. ఏటా నవంబర్ 9న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. ఆయన 45వ ప్రధాన న్యాయమూర్తి.
- సమాధానం: 3
25. ఏ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరస్కరించింది ?
1) అభివృద్ధి బ్యాంకింగ్
2) స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్
3) ఇస్లామిక్ బ్యాంకింగ్
4) పేమెంట్స్ బ్యాంకింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్‌లో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరస్కరించింది. షరియా నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఇస్లామిక్ బ్యాంకింగ్‌లో రుణాలపై వడ్డీ తీసుకోవడం నిషిద్ధం. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షతన ఆర్థిక సంస్కరణల కమిటీ దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలంటూ 2008లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
- సమాధానం: 3
26. దేశంలో తొలి గిరిజన ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ?
1) అరకు
2) దంతెవాడ
3) అసిఫాబాద్
4) ములుగు
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో దేశంలో తొలి గిరిజన ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సు జరిగింది. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సులో భాగంగా ఈ సమ్మిట్‌ను నిర్వహించారు.
- సమాధానం: 2
27. దేశ రాజధాని న్యూఢిల్లీలో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టనున్న వాహన ఇంధనం ఏది ?
1) బీఎస్ - 3
2) బీఎస్ - 4
3) బీఎస్ - 5
4) బీఎస్ - 6
- View Answer
- సమాధానం: 4
వివరణ: న్యూఢిల్లీలో 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్ - 6 వాహన ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అరుుతే.. ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో.. ఈ ఇంధనాన్ని 2018 ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. బీఎస్ - 4 ఇంధనలో సల్ఫర్ పరిమాణం 50 పార్ట్స పర్ మిలియన్గా ఉంటే.. బీఎస్ - 6 ఇంధనంలో ఇది 10 పీపీఎమ్‌గా ఉంటుంది.
- సమాధానం: 4
28. పర్యావరణ హిత కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే ఏ సంస్థతో కలిసి బయో టైలెట్స్‌ను రూపొందించింది ?
1) డీఆర్డీవో
2) బీహెచ్ఈఎల్
3) ఇస్రో
4) హెచ్ఏఎల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారతీయ రైల్వే, డీఆర్డీవోతో కలిసి పర్యావరణ హిత బయో టైయోలెట్స్ను రూపొందించింది. రైల్వే శాఖ 2018 డిసెంబర్ నాటికి అన్ని రైళ్లలో ఈ టైలెట్స్‌ను అమర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
- సమాధానం: 1
29. పూర్తి విద్యుత్ శక్తి ఆధారంగా నడిచే ప్రపంచంలోనే తొలి సరకు రవాణా నౌకను రూపొందించిన దేశం ఏది ?
1) భారత్
2) చైనా
3) జపాన్
4) రష్యా
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనాలోని గుంజౌ షిప్‌యార్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ నౌకను రూపొందించింది. 70.5 మీటర్ల పొడవైన నౌకలో 26 టన్నుల లిథియమ్ బేటరీలను అమర్చారు. రెండు గంటల చార్జింగ్‌తో ఈ నౌక 80 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుని రవాణా చేసేందుకు ఈ నౌకను వినియోగిస్తారు.
- సమాధానం: 2
30. దేశంలో తొలి భారీ తీర ప్రాంత ఆర్థిక జోన్(Coastal economic zone)ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) మహారాష్ట్ర
3) తమిళనాడు
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహారాష్ట్రలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్(JNPT) వద్ద కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆటోమొబైల్, టెలికం, ఐటీ రంగాలకు చెందిన 45 కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 14 కోస్టల్ ఎకనామిక్ జోన్లను ఏర్పాటు చేయాలని 2016లో కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
- సమాధానం: 2
31. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషియల్ పే కమిషన్‌ను ఏర్పాటు చేసింది ?
1) జస్టిస్ పి. వెంకట రామారెడ్డి
2) జస్టిస్ ఎన్. వి. రమణ
3) జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్
4) జస్టిస్ దీపక్ మిశ్రా
- View Answer
- సమాధానం: 1
వివరణ: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసేందుకు.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటరామారెడ్డి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషయల్ పే కమిషన్(SNJPC)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్. బసంత్ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులని అందజేస్తుంది.
- సమాధానం: 1
32. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని ఏ నగరంలో ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) కోల్‌కతా
4) చెన్నై
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పాలాల్లో తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తుంది.
- సమాధానం: 1
33. కేంద్ర ప్రభుత్వంరూ. 25 వేల కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ?
1) విశాఖపట్నం
2) వారణాసి
3) రాయ్ పూర్
4) ద్వారకా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఎగ్జిబిషన్ మార్కెట్లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకలో రూ. 25, 703 కోట్ల రూపాయలతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, నాన్ - పీపీపీ పద్ధతిలో 2025 నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
- సమాధానం: 4
34. జాతీయ హరిత ట్రిబ్యునల్ దేశంలోని ఏ దేవాలయంలోకి రోజుకి 50 వేల మందిని మాత్రమే అనుమతిస్తు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ?
1) వైష్ణోదేవీ ఆలయం
2) బద్రీనాథ్ ఆలయం
3) స్వర్ణ దేవాలయం
4) కేదార్నాథ్ ఆలయం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు(ఎన్జీటీ) జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్.
- సమాధానం: 1
35. ప్రపంచ మహిళల టెన్నిస్ చాంపియన్‌షిప్(ఫెడ్ కప్) - 2017ను ఏ జట్టు గెలుచుకుంది ?
1) అమెరికా
2) జర్మనీ
3) ఫ్రాన్స్
4) బెలారస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఫెడ్‌కప్ ఫైనల్లో అమెరికా 3 - 2 తేడాతో బెలారస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అమెరికా జట్టులో యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్, కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, రిస్కీ సభ్యులుగా ఉన్నారు. గతంలో 2000 సంవత్సరంలో అమెరికా ఫెడ్‌కప్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 1
36. 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ దేశంలోని ఏ నగరంలో జరిగింది ?
1) బెంగళూరు
2) న్యూఢిల్లీ
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
వివరణ: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగిన ఈ ఫెరుుర్ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహించింది.
- సమాధానం: 2
37. బంధన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ?
1) భారత్ - బంగ్లాదేశ్
2) భారత్ - పాకిస్తాన్
3) భారత్ - నేపాల్
4) భారత్ - చైనా
- View Answer
- సమాధానం: 1
వివరణ: బంధన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు భారత్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఖుల్నా మధ్య నడుస్తుంది. వారానికోసారి నడిచే ఈ రైలుని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రారంభించారు.
- సమాధానం: 1
38. ఇటీవల కన్నుమూసిన ఒగ్గు కథా పితామహుడు చుక్క సత్తయ్య ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన చుక్క సత్తయ్య ఇటీవల కన్నుమూశారు. తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆయన జన్మించారు. సత్తయ్య 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వంనుంచికళాసాగర్ అవార్డు పొందారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు అందుకున్నారు.
- సమాధానం: 2
39. తెలంగాణ డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అనురాగ్ శర్మ
2) తేజ్ దీప్ కౌర్ మీనన్
3) మహేందర్ రెడ్డి
4) రాజీవ్ త్రివేది
- View Answer
- సమాధానం: 3
వివరణ: తెలంగాణ తొలి డీజీపీగా 2014 నుంచి సేవలందించిన అనురాగ్ శర్మ ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మహేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీగా నియమించింది. అలాగే... అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
- సమాధానం: 3
40. ఖాదీ ఇండియా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017ను ఎవరు గెలుచుకున్నారు ?
1) దెబాషిస్ దాస్
2) అరవింద్ చిదంబరం
3) ఎస్ ఎల్ నారాయణన్
4) లలిత్ బాబు
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక ఖాదీ ఇండియా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ బాబు 9.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలిచాడు.
- సమాధానం: 4
41. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల ఏ దేశంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు ?
1) భారత్
2) యూఏఈ
3) ఆస్ట్రేలియా
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూనెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ(MSDCA) పేరుతో ధోని క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశాడు. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్ట్స క్లబ్, ఆర్కా స్పోర్ట్స క్లబ్‌తో కలిసి ధోని ఈ అకాడమీని నెలకొల్పాడు.
- సమాధానం: 2
42. ఇటీవల జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేత ఎవరు ?
1) సెబాస్టియన్ వెటెల్
2) వాల్తెరి బొటాస్
3) కిమీ రైకోనెన్
4) లూయిస్ హామిల్టన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బ్రెజిల్ గ్రాండ్ ప్రీ రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో మెర్సిడీస్ డ్రైవర్ వాల్తెరీ బొటాస్ నిలిచాడు. ఈ విజయంతో డ్రైవర్స్ చాంపియన్ షిప్లో వెటెల్‌కు రెండో స్థానం ఖాయమైంది. మొదటి స్థానంలో లూయిస్ హామిల్టన్ ఉన్నాడు.
- సమాధానం: 1
43. ఖైదీల ఆరోగ్యం మెరుగుపరచటంతో పాటు వారి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో అవాగహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) కర్ణాటక
2) మధ్యప్రదేశ్
3) హర్యానా
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఈ ఒప్పందం ప్రకారం హర్యానాలోని జైళ్లలోని ఖైదీల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను శ్రీ శ్రీ రవిశంకర్ ఏర్పాటు చేశారు.
- సమాధానం: 3
44. మాంట్రియాల్లో జరిగిన దక్షిణ ఆసియాన్ చిత్రోత్సవం-2017లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు పొందిన భారతీయ షార్ట్ ఫిల్మ్ ఏది ?
1) ఇల్యూషన్
2) ద స్కూల్ బాగ్
3) కై ట్.. ద మెసెంజర్
4) చట్నీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ద స్కూల్ బాగ్ చిత్ర దర్శకుడు ధీరజ్ జిందాల్. మాంట్రియాల్ నగరం కెనడాలో ఉంది.
- సమాధానం: 2
45. శీతాకాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏ నగరంలో ఐదు నెలల పాటు ఉక్కు కర్మాగారాలను మూసివేస్తున్నారు ?
1) ఢిల్లీ
2) ఇస్లామాబాద్
3) బీజింగ్
4) ఢాకా
- View Answer
- సమాధానం: 3
వివరణ: చైనాలోని బీజింగ్‌లో శీతాకాల కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలోని స్టీల్ ప్లాంట్లను మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. పీఎమ్ 2.5గా ఉన్న కాలుష్య పరిమాణాల్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టింది.
- సమాధానం: 3
46. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక పురస్కారం జెనిసెస్ ప్రైజ్ - 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
1) కెయిరా నెట్లే
2) చైర్లైజ్ థెరాన్
3) ఎమ్మా స్టోన్
4) నటాలియా పోర్ట్ మాన్
- View Answer
- సమాధానం: 4
వివరణ: నటి నటాలియా పోర్ట్ మాన్ 2018 జెనెసిస్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. అవార్డు కింద ఆమెకు 1 మిలియన్ డాలర్లు అందజేస్తారు.
- సమాధానం: 4
47. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారుల డిస్ప్లే నేమ్ పరిమితిని ఎన్ని అక్షరాలకు పెంచింది ?
1) 30
2) 50
3) 20
4) 40
- View Answer
- సమాధానం: 2
వివరణ: 20 అక్షరాలుగా ఉన్న డిస్ప్లే నేమ్ పరిమితిని ట్వీటర్ ఇటీవల 50 అక్షరాలకు పెంచింది. పొడవైన పేర్లు కలిగిన వారు తమ పూర్తి పేరుని డిస్ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు వీలుగా ట్వీటర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్వీట్లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ ఇటీవల 140 నుంచి 280కి పెంచింది.
- సమాధానం: 2
48. 2017 నవంబర్ 1 నుంచి అంతర్జాలం ద్వారా చేసే RTGS, NEFT లావాదేవీలకు ఎలాంటి చార్జీలు విధించబోమని ఏ బ్యాంకు ప్రకటించింది ?
1) YES Bank
2) ICICI Bank
3) Axis Bank
4) HDFC Bank
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆన్లైన్ లావాదేవీలపై విధించే చార్జీలను HDFC బ్యాంక్ ఇటీవల సవరించింది. సేవింగ్స్, సేలరీ ఖాతాదారులు నిర్వహించే ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలకు నవంబర్ 1 నుంచి ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. దేశంలో డిజిటల్ ఎకనామీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
- సమాధానం: 4
49. కింది వాటిలో ఏ సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్య దేశంగా భారత్ ఇటీవల తిరిగి ఎన్నికై ంది ?
1) IFAO
2) WIPO
3) UNIDO
4) UNESCO
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఇటీవల జరిగిన 39వ యునెస్కో సాధారణ సభలో భారత్‌కు సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో తిరిగి స్థానం కల్పించారు. యునెస్కో కేంద్ర కార్యాలయం పారిస్‌లో ఉంది.
- సమాధానం: 4
50. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్టాన్రిక్ హార్డ్‌వేర్ రంగానికి సంబంధించి ఇంటెల్, యూఎస్టీ గ్లోబల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) రాజస్తాన్
2) తెలంగాణ
3) కేరళ
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రాష్ట్రాన్ని ఎలక్టాన్రిక్ హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం ఇంటెల్, యూఎస్టీ గ్లోబల్ సంస్థతోఅవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కేరళ ఎలక్టాన్రిక్స్ అండ్ హార్డ్‌వేర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది.
- సమాధానం: 2