కరెంట్ అఫైర్స్ మార్చి (1 – 7) బిట్ బ్యాంక్
1. రిలయన్స్ ట్రెండ్స్ ప్రచారకర్తగా ఇటీవల నియమితులైన తెలుగు సినీ నటుడు ఎవరు?
1) దగ్గుబాటి రానా
2) అల్లు అర్జున్
3) మహేశ్ బాబు
4) ప్రభాస్
- View Answer
- సమాధానం: 1
వివరణ: రిలయన్స్ రిటైల్ కు చెందిన రెడీమేడ్ దుస్తుల విక్రయ కేంద్రాల నిర్వహణ విభాగం రిలయన్స్ ట్రెండ్స్.. టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానాని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. రిలయన్స్ ట్రెండ్స్ దేశంలోని 220 నగరాల్లో 430 రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇందులో 200కు పైగా స్టోర్స్ దక్షిణాదిలో ఉన్నాయి.
- సమాధానం: 1
2. అవాడా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది ?
1) కర్ణాటక
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: అవాడా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. దీని ద్వారా 1,200 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రకటించింది.
- సమాధానం: 3
3. లారెస్ స్పోర్ట్స్ అవార్డులు – 2017లో స్పోర్ట్స్ మన్ ఆఫ్ ది ఇయర్, కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్న ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ ఎవరు?
1) రాఫెల్ నాదల్
2) రోజర్ ఫెడరర్
3) నొవాక్ జకోవిచ్
4) ఆండీ ముర్రే
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఇటీవల జరిగిన లారెస్ స్పోర్ట్స్ అవార్డులు - 2017 ప్రదానోత్సవంలో.. క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకుగాను టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’.. ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. ఫెడరర్ గతంలో 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్ ‘స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు.
‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అందుకుంది.
- సమాధానం: 2
4. సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాల్మీకి రామాయణం, పోతన భాగవతాన్ని తెలుగు వ్యవహారిక భాషలో రచించిన రచయిత ఎవరు?
1) నాయుని కృష్ణమూర్తి
2) తనికెళ్ల భరణి
3) అంపశయ్య నవీన్
4) సి నారాయణ రెడ్డి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రసిద్ధ రచయిత, ప్రచురణకర్త నాయుని కృష్ణమూర్తి ఇటీవల బెంగళూరులో కన్నుమూశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. కథ, నవలా రచయితగా, పౌరాణిక గ్రంథకర్తగా నాయుని ప్రసిద్ధులు. ఆయన సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వాల్మీకి రామాయణం, పోతన భాగవతాన్ని తెలుగు వ్యవహారిక భాషలో రచించారు. ఈ పుస్తకాలు బాపు బొమ్మలతో వెలువడ్డాయి. నాయుని.. విజయవాణి సంస్థను స్థాపించి 125 పుస్తకాలను ప్రచురించారు.
- సమాధానం: 1
5. ఆంధ్రప్రదేశ్ వరప్రదాయనిగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్రత్యేక కథనాలను ఏ చానల్ ప్రసారం చేయనుంది?
1) బీబీసీ
2) డిస్కవరీ
3) నేషనల్ జియోగ్రాఫిక్
4) యానిమల్ ప్లానెట్
- View Answer
- సమాధానం: 3
వివరణ: పోలీవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్రత్యేక కథనాలు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో ప్రసారం అవుతాయి. ఇందుకోసం చిత్రీకరణకు అనుమతి ఇస్తు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చిత్రీకరణ, ప్రసారాల కోసం రాష్ట్ర జల వనరుల శాఖ రూ.75 లక్షలు చెల్లిస్తుంది. డ్రోన్లు, విమానం వినియోగించి నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తుంది.
- సమాధానం: 3
6. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గ్రేహౌండ్స్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది ?
1) సెక్షన్ 9(3)
2) సెక్షన్ 8
3) సెక్షన్ 10
4) సెక్షన్ 12
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 9(3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో గ్రే హౌండ్స్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. రూ.219 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో ఉన్న గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందిన క్రమంలో ఏపీకి కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఈ మేరకు రాజధాని అమరావతిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
- సమాధానం: 1
7. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ – 2018 ప్రకారం ప్రపంచ కుబేరుల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం:3
వివరణ: హురున్ గ్లోబల్ రిmచ్ లిస్ట్ – 2018 ప్రకారం.. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్ లోనే ఎక్కువ మంది సంపన్నులున్నారు. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో 100 కోట్ల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారి సంఖ్య 131. చైనాలో 819 మంది, అమెరికాలో 571 మంది ఉన్నారు. ఇక ఈ సంవత్సరం 123 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఆమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
- సమాధానం:3
8. ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రచారంలో భాగంగా ఇటీవల ఏ మేగజైన్ ప్రచురించిన కవర్ పేజీ వివాదానికి దారి తీసింది?
1) ఔట్ లుక్
2) స్వాతి
3) టైమ్స్
4) గృహలక్ష్మీ
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఓపెన్ బ్రెస్ట్ ఫీడింగ్ (బహిరంగంగా పిల్లలకు పాలు ఇవ్వడం) ప్రచారంలో భాగంగా కేరళకు చెందిన ప్రముఖ మలయాళ మేగజైన్ “గృహలక్ష్మీ” ప్రత్యేక సంచిక తెచ్చింది. బిడ్డ నోటికి చనుబాలు అందించి... చిరునవ్వుతో గర్వంగా కెమెరాను చూస్తున్న తల్లిగా.. సినీ నటి, రచయిత్రి గిలు జోసెఫ్ కవర్ పేజీపై కనిపించారు. అయితే.. ఇది వివాదానికి దారితీసింది. ఉద్దేశం మంచిదే అయినా ఇంకా పెళ్లి కాని యువతి ఫోటోని కవర్ పేజీపై అలా ముద్రించటం ఏంటన్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
- సమాధానం: 4
9. కింది వారిలో ఎవరిపై భారత పారాలింపిక్ కమిటీ ఇటీవల మూడేళ్ల నిషేధాన్ని విధించింది?
1) శరత్ గైక్వాడ్
2) ప్రశాంత్ కర్మాకర్
3) నిరంజన్ ముకుందన్
4) సుయాష్ జాధవ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహిళా స్విమ్మర్లను వీడియో తీసిన పారా స్విమ్మర్, అర్జున అవార్డు గ్రహీత ప్రశాంత్ కర్మాకర్ పై భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) ఇటీవల మూడేళ్ల నిషేధం విధించింది. గతేడాది జాతీయ చాంపియన్ షిప్ సందర్భంగా అనుమతి లేకుండా వీడియోలు తీశాడని అతిడిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2003లో వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్ గా ప్రశాంత్ గుర్తింపు tgపొందాడు.
- సమాధానం: 2
10. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ను ఇటీవల భారత్ లోని ఏ నగరంలో ప్రారంభించారు?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) అహ్మదాబాద్
4) భువనేశ్వర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ని ఇటీవల బెంగళూరులో ప్రారంభించారు. శక్తి స్థల్ గా పిలిచే ఈ మెగా ప్రాజెక్టుని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య పావగడలోని తిరుమణి గ్రామంలో ప్రారంభించారు. కర్ణాటక సౌర విద్యుత్ అభివృద్ధి సంస్థ సహకారంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుమారు 13 వేల ఎకరాల్లో ఈ పార్కుని ఏర్పాటు చేశారు.
- సమాధానం: 1
11. సీనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా రెజ్లర్ ఎవరు?
1) నవజోత్ కౌర్
2) సాక్షి మాలిక్
3) కవితా దేవి
4) బబితా కుమారి
- View Answer
- సమాధానం: 1
వివరణ: కిర్గిస్తాన్ లోని బిష్కెక్ లో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత రెజ్లర్ నవజోత్ కౌర్ పసిడి పతకం సాధించింది. 65 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగం ఫైనల్లో నవజోత్ 9-1 స్కోర్ తో జపాన్ కు చెందిన మియా ఇనూయిని ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా సీనియర్ ఆసియా రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్ గా ఘనత పొందింది.
- సమాధానం: 1
12. ఇటీవల క్విన్స్ లాండ్ లో జరిగిన అధికారిక టోర్నీలో 100-104 ఏళ్ల విభాగంలో బరిలోకి దిగి స్వర్ణం సాధించిన 99 ఏళ్ల జోర్జ్ కోరోనెస్ ఏ దేశానికి చెందినవారు?
1) ఇంగ్లండ్
2) ఆస్ట్రేలియా
3) జపాన్
4) స్విట్జర్లాండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆస్ట్రేలియాకు చెందిన జోర్జ్ కోరోనెస్ 99 ఏళ్ల వయసులో క్వీన్స్ లాండ్ లో జరిగిన స్విమ్మింగ్ పోటీలో పాల్గొని స్వర్ణం సాధించారు. 50 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఈవెంట్ లో 56.1 సెకనల్లో గమ్యం చేరిన జార్జ్ .. 35 సెకన్ల తేడాతో హారిసన్ అనే స్విమ్మర్ పేరిట ఉన్న గత ప్రపంచ రికార్డుని తిరగరాశాడు.
- సమాధానం: 2
13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎవరి కోసం “పలకరింపు” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) వృద్ధులు
2) వికలాంగులు
3) చిన్నారులు
4) వ్యాపారస్తులు
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “పలకరింపు” పేరుతో చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్చి 5వ తేదీ నుంచి 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ పథకం ద్వారా అప్పుడే పుట్టిన వారి దగ్గర నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార, అనారోగ్య సమస్యలపై దృష్టి సారిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ఐఎంఏ, ఐఏపీలు ఈ కార్యక్రమానికి సహకరించాయి. అలాగే.. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.
- సమాధానం: 3
14. మూడో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగాయి?
1) ఉత్తరప్రదేశ్
2) ఉత్తరాఖండ్
3) ఆంధ్రప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మూడో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు మార్చి 1 నుంచి 7 వరకు ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ లో జరిగాయి. ఈ ఉత్సవాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రారంభించారు. 150 దేశాలకు చెందిన 600 మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
- సమాధానం: 2
15. మహిళా సురక్షిత నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది?
1) రూ.2,900 కోట్లు
2) రూ.1,000 కోట్లు
3) రూ.5,000 కోట్లు
4) రూ.10,000 కోట్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: సురక్షిత నగరాలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2,900 కోట్లు కేటాయించింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో నగరాలను ఎంపిక చేసింది. నిర్భయ నిధుల్లో నుంచి ఖర్చు చేస్తున్న ఈ నిధులతో వీడియో పర్యవేక్షణ, ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు, వీడియో ఫీడ్ షేరింగ్ ఉన్న పెట్రోలింగ్ వ్యాన్ లను, మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.
- సమాధానం: 1
16. ఆర్థిక నేరగాళ్లు, రుణం ఎగవేసి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఏది?
1) ఎకనామిక్ అవుట్ సైడ్ అఫెండర్స్ బిల్లు
2) ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు
3) ఫారిన్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లు
4) ఎకనమిక్, ఫైనాన్స్ అఫెండర్స్ బిల్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: మెసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వారు, రుణం ఎగవేసి అదృశ్యమైన వారికి సంబంధించి అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని విక్రయించే అధికారం కల్పించే ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ మార్చి 1న ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రత్యేక కోర్టు అనుమతితో బకాయిలను తక్షణమే రాబట్టుకునేందుకు వీలు కలుగుతుంది. ఆర్థిక నేరగాళ్లతో పాటు రూ.100 కోట్లకు పైగా రుణ బకాయి పడి విదేశాలకు పారిపోయిన వారికీ ఇది వర్తిస్తుంది.
- సమాధానం: 2
17. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 150 రకాల సేవలతో టీ-యాప్ ఫోలియో యాప్ ను ప్రారంభించింది. అయితే ఈ తరహా యాప్ ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది ?
1) ఆంధ్రప్రదేశ్
2) గుజరాత్
3) తమిళనాడు
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
వివరణ: వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే foవేదిక ద్వారా అందించే ఉద్దేశంతో రూపొందించిన టీ-యాప్ ఫోలియో యాప్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల ప్రారంభించారు. ఈ తరహా సేవలను ప్రస్తుతం కర్ణాటక అందిస్తుండగా.. రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ యాప్ ద్వారా రెవెన్యూ, ఆదాయ, కుల ధ్రువీకరణ వంటి 150 రకాల సేవలు పొందవచ్చు.
- సమాధానం: 4
18. ఇటీవల ఎన్సీఆర్బీ ట్రోఫీ – 2017ను గెలుచుకున్న యాప్ ఏది?
1) టీఎస్ కాప్
2) ఏపీ పోలీస్
3) టీఎన్ కాప్
4) కేపీ కాప్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ పోలీసు విభాగం రూపొందించిన టీఎస్ కాప్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ సీఆర్ బీ – 2017) ట్రోఫీ – 2017ను గెలుచుకుంది. ఎన్సీఆర్బీ ఏటా టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీసు శాఖలో కంప్యూటరీకరణ తదితర అంశాలపై పోటీ నిర్వహిస్తోంది. ఇందులో అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాలు పోటీ పడగా.. టీఎస్ కాప్ ట్రోఫీని సాధించింది.
- సమాధానం: 1
19. టాటా-బోయింగ్ సంస్థలు తెలంగాణలోని ఏ ప్రాంతంలో హెలికాప్టర్ బాడీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి?
1) పోచంపల్లి
2) హన్మకొండ
3) ఆదిభట్ల
4) సిద్ధిపేట
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్, దేశీ దిగ్గజం టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ ఉమ్మడిగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో హెలికాప్టర్ బాడీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. ఇది మార్చి 1న ప్రారంభమైంది. భారత్ లో అమెరికా రక్షణ రాయబారి కెన్నెత్ జెస్టర్, రతన్ టాటా, బోయింగ్ సీఈవో లీన్ కారెట్, మంత్రి కేటీఆర్ లతో కలిసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రారంభించారు. బోయింగ్ కు చెందిన ఏహెచ్ 64 అపాచీ హెలికాప్టర్ల తయారీకి కీలకమైన ఫ్యూజ్ లీజ్ అనే ప్రధాన ఫ్రేమ్ ను, కొన్ని ఏరో స్ట్రక్చర్లను ఈ కేంద్రంలో తయారు చేస్తారు.
- సమాధానం: 3
20. దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా పీపీపీ పద్ధతిలో ఫీడర్ అంబులెన్స్ సేవలను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) హిమాచల్ ప్రదేశ్
4) కేరళ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మారుమూల ప్రాంతాలకు చేరుకునే ద్విచక్ర వాహనాలతో కూడిన ఫీడర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా 122 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 108 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసిన 60 నిమిషాల్లో సంఘటన స్థలానికి ఫీడర్ అంబులెన్స్ చేరుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
- సమాధానం: 1
21. ఈ కింది వాటిలో ఏది దక్షిణ మధ్య రైల్వేలో తొలి మహిళా రైల్వే స్టేషన్?
1) తిరుపతి
2) చంద్రగిరి
3) వరంగల్
4) కాచిగూడ
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి రైల్వే స్టేషన్ ను మహిళా స్టేషన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తిగా మహిళా సిబ్బందితో ఒక రైల్వే స్టేషన్ ను నిర్వహించటం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇదే తొలిసారి.
- సమాధానం: 2
22. దేశంలోనే తొలిసారిగా ఇటీవల ఏ నగరంలో హెలీ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాయి?
1) హైదరాబాద్
2) ముంబై
3) బెంగళూరు
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోనే మొట్ట మొదటిగా బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం- ఎలక్ట్రానిక్ సిటీ మధ్య ఈ హెలికాప్టర్ ట్యాక్సీ సేవలను మార్చి 5న ప్రారంభించారు. కేరళలోని కొచ్చికి చెందిన తంబి ఏవియేషన్ సంస్థ ఈ సేవలను ప్రవేశపెట్టింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ట్రాఫిక్‌లో 1 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అయితే హెలికాప్టర్లో 15 నిమిషాల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి అన్ని పన్నులు కలిపి టిక్కెట్ ధరను రూ.4 వేలుగా నిర్ణయించారు.
- సమాధానం: 3
23. ఇటీవల భారత్ లో పర్యటించిన త్రాన్ దాయి క్వాంగ్.. ఏ దేశ అధ్యక్షుడు ?
1) వియత్నాం
2) జోర్డాన్
3) ఉత్తర కొరియా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: వియత్నాం అధ్యక్షుడు త్రాన్ దాయి క్వాంగ్.. ఇటీవల భారత్ లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం.. మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. అణు ఇంధనం, వాణిజ్యం, వ్యవసాయం రంగాలతోపాటు ఆయిల్, గ్యాస్ నిక్షేపాల అన్వేషణలో సహకారం పెంచుకునేందుకు అంగీకరించారు.
- సమాధానం: 3
24. కేన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) అపోలో
2) టాటా ట్రస్ట్
3) విప్రో
4) మైక్రోసాఫ్ట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేన్సర్ వ్యాధి నియంత్రణకు టాటా ట్రస్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మార్చి 1న శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కె. తారకరామారావు, టాటా సంస్థల అధినేత, మాజీ చైర్మన్ రతన్ టాటా పాల్గొన్నారు.
- సమాధానం: 2
25. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం – 2018కి ఎంపికైన మహ్మద్ ఆజమ్ తెలంగాణలోని ఏ జిల్లాకు చెందినవారు?
1) కరీంనగర్
2) నిజామాబాద్
3) నల్గొండ
4) ఆదిలాబాద్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ పురస్కారం 2018 కి కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఆజమ్ ఎంపికయ్యారు. ఆజమ్... సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు కలిగి ప్రజా ఉద్యమాల్లో నాలుగేళ్లుగా చురుకుగా పాల్గొంటున్నారు.
- సమాధానం: 1
26. ఎవరి నాగరికత కాలంలో దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇనుము వాడినట్లు ఏపీ పురావస్తు పరిశోధనల ద్వారా ఇటీవల వెల్లడైంది?
1) సింధు నాగరికత
2) హరప్ప నాగరికత
3) మయ నాగరికత
4) మెగాలిథిక్ నాగరికత
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో సింధు నాగరికత కంటే 500 ఏళ్ల ముందే ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నదీ తీరాన మెగాలిథిక్ నాగరికత కాలంలో ఇనుము వాడినట్లు ఏపీ పురవాస్తు శాఖ అధికారుల పరిశోధనల ద్వారా ఇటీవల వెల్లడైంది. అంతేకాకుండా సింధు నాగరికత కాలం నాటి ప్రజల కంటే దక్షిణ భారతదేశంలో విలసిల్లిన మెగాలిథిక్ నాగరికత కాలం నాటి ప్రజలు ఆధునికంగా ముందున్నారని స్పష్టమైంది. ఆదిమానవ దశ నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ జీవనానికి మధ్య ఉన్న సంధి దశనే మెగాలిథిక్ నాగరికత అంటారు. క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,000 మధ్య ఈ నాగరికత దక్షిణ భారతదేశంలో విలసిల్లింది. సింధులోయ నాగరికతలో క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 మధ్య ఇనుము వాడినట్లు పరిశోధకులు నిర్ధారించారు.
- సమాధానం: 4
27. తెలంగాణ తొలి ఎన్నికల ప్రధాన అధికారిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేప్టటారు?
1) రజత్ కుమార్
2) మహేందర్ రెడ్డి
3) రాజీవ్ శర్మ
4) భన్వర్ లాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ తొలి సీఈవోగా రజత్‌కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఈవోగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఏపీ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈవోగా కొనసాగారు. భన్వర్‌లాల్ పదవీ విరమణ పొందాక ఏపీ సీఈవోగా సిసోడియా బాధ్యతలు చేపట్టారు.
- సమాధానం: 1
28. దేశంలోనే తొలిసారిగా అధికారికంగా విద్యుత్ కారుని ఉపయోగించిన ఘనతను దక్కించుకున్న జిల్లా ఏది?
1) వరంగల్
2) రాయపూర్
3) విశాఖపట్నం
4) ధార్వాడ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: దేశంలోనే తొలిసారిగా విద్యుత్ కారును విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అందజేసింది. విశాఖలోని వివిధ శాఖల అధికారులకు దాదాపు 110 ఎలక్ట్రిక్ కార్లను ప్రభుత్వం కేటాయించింది. తద్వారా దేశంలోనే తొలిసారిగా అధికారికంగా విద్యుత్ కారును ఉపయోగించిన ఘనత విశాఖ జిల్లాకు దక్కింది.
- సమాధానం: 3
29. 2018 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని మూడీస్ అంచనా వేసింది?
1) 7.6 శాతం
2) 6.5 శాతం
3) 8 శాతం
4) 8.5 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ 2018 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటును 7.6 శాతంగా అంచనా వేసింది. 2016 నాటి డీమోనిటైజేషన్, 2017లో తీసుకొచ్చిన జీఎస్టీ ప్రతికూల ప్రభావాల నుంచి కోలుకుంటుందని చెప్పటానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయని తన నివేదికలో పేర్కొంది. మరో రేటింగ్ సంస్థ.. క్రిసిల్.. 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
- సమాధానం: 1
30. 2016-17లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని కోట్ల రూపాయల రుణాలను రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు?
1) రూ.50,000 కోట్లు
2) రూ.81,683 కోట్లు
3) రూ. లక్ష కోట్లు
4) రూ. 2 లక్షల కోట్లు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 2016-17లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.81,683 కోట్ల విలువైన రుణాలను మాఫీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మార్చి 6న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. అయితే, బ్యాంకులు పన్ను ప్రయోజనాల కోసం, అదేవిధంగా మూలధన సద్వినియోగం కోసం బ్యాలెన్స్ షీట్ రైటాఫ్ కింద చూపిస్తాయని... సంబంధిత రుణ గ్రహీతలు ఈ బకాయిలను తిరిగి చెల్లించాల్సిందేనని జైట్లీ స్పష్టం చేశారు.
- సమాధానం: 2
31. 2019లో చంద్రునిపై 4జీ కవరేజ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోన్న సంస్థ ఏది?
1) ఇస్రో
2) వొడాఫోన్
3) జాక్సా
4) ఎయిర్ టెల్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచి.. దాదాపు 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. 2019లో చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జర్మనీకి చెందిన టెలికాం సంస్థ వొడాఫోన్ సన్నాహాలు చేస్తోంది. టెక్నాలజీ పార్ట్నర్గా నోకియాతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్‌కు చెందిన పీటీ స్పేస్ కంపెనీ సైంటిస్టుల సహకారంతో వొడాఫోన్, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
- సమాధానం: 2
32. ఇటీవల డోపీంగ్ లో పట్టుబడ్డ భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ ఎవరు?
1) నీరజ్ చోప్రా
2) జగదీశ్ బిష్నోయ్
3) కాశీనాథ్ నాయక్
4) దవీందర్ సింగ్ కాంగ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ దవిందర్ సింగ్ కంగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడు. 2017 నవంబర్‌లో అతని నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరిశీలించగా దవిందర్ నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వెంటనే అతన్ని పాటియాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి-1 పోటీల నుంచి తప్పించింది.
- సమాధానం: 4
33. ప్రపంచ కప్ షూటింగ్ లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఇటివల రికార్డు సృష్టించిన షూటర్ ఎవరు?
1) మనూ భాకర్
2) అంజలి భగత్
3) హీనా సిద్ధు
4) కవితా యాదవ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మెక్సికోలోని గ్వాడలహారాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో 16 ఏళ్ల భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్ నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా నిలిచి మరో స్వర్ణాన్ని గెలుచుకుంది.
- సమాధానం: 1
34. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక్ చెస్ టోర్నమెంట్ – 2018 విజేత ఎవరు?
1) వ్లాదిమిర్ క్రామ్నిక్
2) మాగ్నస్ కార్లసన్
3) విశ్వనాధన్ ఆనంద్
4) గేరీ కాస్పరోవ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్, 48 ఏళ్ల విశ్వనాధన్ ఆనంద్ చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
- సమాధానం: 3
35. పాకిస్తాన్ సెనెట్ కు ఎన్నికైన తొలి హిందూ దళిత మహిళగా ఇటీవల రికార్డుకెక్కిన కృష్ణకుమారి కోహ్లీ.. ఆ దేశంలోని ఏ ప్రావిన్స్ (ప్రాంతం) నుంచి గెలుపొందారు ?
1) సింధ్
2) ఖైబర్
3) పంజాబ్
4) బలోచిస్తాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ కు చెందిన కృష్ణకుమారి.. ఆ దేశ సెనెట్‌కు ఎన్నికై న తొలి హిందూ దళిత మహిళగా రికార్డుకెక్కారు. సింధు ప్రావిన్స్ లోని థార్ జిల్లాలో ఉన్న మారుమూల ధనగామ్ గ్రామానికి చెందిన కోహ్లీ.. ఆ ప్రావిన్స్ లోని రిజర్వ్ స్థానానికి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) తరఫున పోటీ చేసి సెనెటర్‌గా గెలుపొందారు.
- సమాధానం: 1
36. మేఘాలయ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) ముఖుల్ సంగ్మా
2) కాన్రాడ్ సంగ్మా
3) డాన్ కుపార్ రాయ్
4) డీడీ లపాంగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మేఘాలయ 12వ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) చీఫ్ కాన్రాడ్ సంగ్మా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రుల చేత గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఇటీవల మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచినా.. రెండే సీట్లు గెలిచిన బీజేపీ ఇతరుల మద్దతు కూడగట్టి ఎన్పీపీ అధికారంలోకి వచ్చేలా చేసింది.
- సమాధానం: 2
37.ఐటీబీపీ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా కంబాట్ అధికారిణిగా ఎంపికైన ప్రకృతి.. ఏ రాష్ట్రానికి చెందినవారు ?
1) ఉత్తరప్రదేశ్
2) ఆంధ్రప్రదేశ్
3) త్రిపుర
4) బిహార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: వరణ: బిహార్ లోని సమస్తీపూర్ జిల్లాకు చెందిన ప్రకృతి.. ఐటీబీపీ చరిత్రలోనే తొలిసారిగా నేరుగా కంబాట్ అధికారిణిగా ఎంపికయ్యారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) కోసం 2016లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో పాతికేళ్ల ప్రకృతి మాత్రమే కంబాట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు.
- సమాధానం: 4
38. ఇటీవల జరిగిన 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ చిత్రం పురస్కారం గెలుచుకున్న చిత్రం ఏది?
1) ది షేప్ ఆఫ్ వాటర్
2) డార్కెస్ట్ అవర్
3) గెట్ ఔట్
4) ఫాంటమ్ థ్రెడ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో.. ది షేప్ ఆఫ్ వాటర్ ఉత్తమ చిత్రం పురస్కారం పొందింది. ఈ చిత్రానికి నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి. డన్ కర్క్ చిత్రం మూడు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. ది షేప్ ఆఫ్ వాటర్ చిత్రానికి గాను గెలెర్మో డెలెటొరో ఉత్తమ డైరెక్టర్.. త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి చిత్రానికి గాను ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ ఉత్తమ నటి.. డార్కెస్ట్ అవర్ చిత్రానికి గాను గ్యారీ ఓల్డ్ మేన్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని పొందారు.
- సమాధానం: 1
39. ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డు – 2017కు ఇటీవల ఎవరు ఎంపికయ్యారు?
1) షాలీ చోప్రా
2) సాగరిక ఘోష్
3) ఉమా సుధీర్
4) స్వేతా సింగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2017 సంవత్సరానికి ప్రతిష్టాత్మక చమేలీ దేవి అవార్డు ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్‌కు లభించింది. రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విస్తృతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది.
- సమాధానం: 3
40. ఐబీఎస్ఎఫ్ స్నూకర్ టీమ్ ప్రపంచ కప్ – 2018ని ఏ దేశ జట్టు గెలుచుకుంది ?
1) చైనా
2) భారత్
3) పాకిస్తాన్
4) జపాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తొలిసారి నిర్వహించిన ప్రపంచ స్నూకర్ కప్ టీమ్ ఈవెంట్లో భారత్ జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ-మానన్ చంద్రలతో కూడిన భారత్ 3-2తో మొహమ్మద్ ఆసిఫ్-బాబర్ మసీ సభ్యులుగా ఉన్న పాకిస్తాన్‌ను ఓడించింది.
- సమాధానం: 2
41. ఇటీవల బ్రిటన్ లో జరిగిన పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ అవార్డుల్లో జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న బాలీవుడ్ నటుడు ఎవరు?
1) అమితాబ్ బచ్చన్
2) బొమన్ ఇరానీ
3) జాకీ ష్రాఫ్
4) శతృఘ్న సిన్హా
- View Answer
- సమాధానం: 4
వివరణ: బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు శతృఘ్న సిన్హా.. ఇటీవల బ్రిటన్ లో జరిగిన పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ అవార్డుల్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. యూకేకు చెందిన ఆసియాన్ వాయిస్ వీక్లీ ఈ అవార్డులని ఏటా ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 4
42. ఇండియా బై ద నైల్ – 2018 సాంస్కృతిక వేడుక ఇటీవల ఏ దేశంలో జరిగింది?
1) నైజీరియా
2) దక్షిణ సుడాన్
3) ఈజిప్ట్
4) తునిసియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఇండియా బై ద నైల్ – 2018 సాంస్కృతిక వేడుక ఈజిప్టులోని కైరో నగరంలో జరిగింది. 12 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో భారత సంస్కృతీ, సంప్రదాయాలను ప్రదర్శించారు. ఈజిప్టులో జరిగే అతిపెద్ద విదేశీ వేడుక ఇదే.
- సమాధానం: 3
43. రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు?
1) రాబర్ట్ కోచర్యాన్
2) ఆర్మెన్ సర్కిసియాన్
3) సెర్జ్ సర్గ్ స్యాన్
4) లెవాన్ టెర్ పెట్రోస్యాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియా నూతన అధ్యక్షుడిగా ఆర్మెన్ సర్కిసియాన్ ఎన్నికయ్యారు. సెర్జ్ సర్గ్ స్యాన్ నుంచి ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్మెన్... 1996 నుంచి 1997 వరకు ఆర్మేనియా ప్రధాన మంత్రిగా పనిచేశారు.
- సమాధానం: 2
44. ఇటీవల ఏ రాష్ట్రం పాఠశాలల్లో చదివే బాలికలకు ఖుషి పేరుతో ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) పంజాబ్
2) కేరళ
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవల ఖుషీ పేరుతో పాఠశాలల్లో చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరు నుంచి 12వ తరగతి చదివే బాలికలకు వీటిని పంపిణీ చేస్తుంది. ఇందుకోసం ఏటా రూ.70 కోట్లు వెచ్చిస్తుంది.
- సమాధానం: 4
45. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) మార్చి 1
2) మార్చి 3
3) మార్చి 5
4) మార్చి 7
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని ఏటా మార్చి 3న నిర్వహిస్తారు. 2014 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
2018 Theme: Big cats: predators under threat
- సమాధానం: 2
46. భారత్ దేశంతో కలిసి సూర్యకిరణ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న దేశం?
1) మలేషియా
2) బంగ్లాదేశ్
3) నేపాల్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 3
వివరణ: భారత్, నేపాల్ దేశాలు.. సూర్యకిరణ్ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ఏటా రెండు సార్లు నిర్వహిస్తున్నాయి. 2011 నుంచి ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. అటవీ ప్రాంతంలో యుద్ధం, తీవ్రవాద వ్యతిరేక పోరులో శిక్షణ కోసం ఈ విన్యాసాలు జరుగుతాయి.
- సమాధానం: 3
47. బంగ్లాదేశ్ లో రోప్పూర్ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం భారత్, బంగ్లాదేశ్ తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏది?
1) రష్యా
2) జపాన్
3) ఫ్రాన్స్
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: రోప్పూర్ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం భారత్, బంగ్లాదేశ్, రష్యా దేశాలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్లాంట్ నిర్మాణం గతేడాది ప్రారంభమైంది.
- సమాధానం: 1
48. “How to be Human”, పుస్తక రచయిత ఎవరు?
1) మీరా నాయర్
2) దీప్తి నావల్
3) మంజీత్ హిరాణి
4) సునీతా గోవారికర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ హిరాని భార్య మంజీత్ హిరాని రచించిన హౌ టూ బి హ్యూమన్ పుస్తకాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవల ఆవిష్కరించారు.
- సమాధానం: 3
49. జర్మనీ చాన్సలర్ గా ఇటీవల ఏంజెలా మెర్కెల్ మరోసారి ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవి చేపట్టడం ఇది ఎన్నోసారి ?
1) మూడు
2) నాలుగు
3) ఆరు
4) ఐదు
- View Answer
- సమాధానం: 2
వివరణ: యూరప్ లో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీకి చాన్సలర్ గా ఏంజెలా మెర్కెల్ ఇటీవల మరోసారి ఎన్నికయ్యారు. ఆమె ఈ పదవి చేపట్టడం ఇది నాలుగోసారి.
- సమాధానం: 2
50. నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) వముజో ఫెసావో
2) షుర్హో జెలియా లీజిత్సు
3) నెఫ్యూ రియో
4) టీఆర్ జెలియాంగ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత నెఫ్యూరియో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ పీబీ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 60 సీట్లకు గాను నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్), బీజేపీ-నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ) కూటములు చెరో 29 స్థానాల్లో గెలుపొందాయి. ఇతరుల మద్దతుతో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
- సమాధానం: 3