కరెంట్ అఫైర్స్ (జూలై 1-8) బిట్ బ్యాంక్
1. ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) బైచూంగ్ భూటియా
2) ధన్‌రాజ్ పిళ్లై
3) కపిల్ దేవ్
4) మిల్కాసింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తూర్పు బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం భారత్ గౌరవ్‌కు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లైఎంపికయ్యాడు. అలాగే మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు సయ్యద్ నయీముద్దీన్, సభాష్ భౌమిక్ జీవిత సాఫల్య పురస్కారం పొందారు.
- సమాధానం: 2
2. భారత్‌లో యువత ఓటు హక్కు నమోదు కోసం ఎన్నికల సంఘం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) ఫేస్బుక్
2) మైక్రోసాఫ్ట్
3) గూగుల్
4) ఇన్స్టాగ్రామ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ ఒప్పందంలో భాగంగా ఫేస్బుక్ పేజీలలో ఓటు హక్కు నమోదు కోసం 13 భాషల్లో రిమైండర్‌ను ఏర్పాటు చేస్తుంది.
- సమాధానం: 1
3. సాంఘిక అభివృద్ధి ఇండెక్స్ - 2017లో భారత్ ఏ స్థానంలో ఉంది ?
1) 123
2) 100
3) 93
4) 80
- View Answer
- సమాధానం: 3
వివరణ: డెలాయిట్ కంపెనీ సహకారంతో సోషల్ గ్రూప్ ఇంపరేటివ్ సంస్థ సాంఘిక అభివృద్ధి ఇండెక్స్ (సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్)ను తయారు చేసింది. 128 దేశాలతో కూడిన ఈ నివేదికలో డెన్మార్ తొలి స్థానంలో నిలిచింది. ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, నార్వే, స్విట్జర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఈ నివేదికలో 93వ స్థానంలో ఉంది. 128 దేశాలలో 113 దేశాలు తమ సామాజిక పరిస్థితిని 2014 తర్వాత మెరుగుపరుచుకున్నాయి.
- సమాధానం: 3
4. 2019 సంవత్సరానికి గాను యునెస్కో ఏ ప్రాంతాన్ని పుస్తక రాజధానిగా ప్రకటించింది ?
1) న్యూఢిల్లీ
2) సనా
3) ఐవా
4) షార్జా
- View Answer
- సమాధానం: 4
వివరణ: యునెస్కో ఇప్పటి వరకు 19 ప్రాంతాలను పుస్తక రాజధానులుగా ప్రకటించింది. ప్రజల్లో సాహిత్యాభిరుచిని పెంచడం, సంస్కృతీ సంప్రదాయాలను అందరికీ తెలియజే సేందుకు యునెస్కో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
- సమాధానం: 4
5. రెండవ గ్లోబల్ నైపుణ్యాభివృద్ధి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) షార్జా
2) పారిస్
3) అబుదాబి
4) టోక్యో
- View Answer
- సమాధానం: 2
వివరణ: పారిస్‌లో జరిగిన రెండవ గ్లోబల్ నైపుణ్యాభివృద్ధి సమావేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఐటీ వినియోగం, వినూత్న ప్రయోగాల విభాగంలో ఉత్తమ పురస్కారం పొందింది.
- సమాధానం: 2
6. అంతర్జాతీయ ఆర్థిక అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
1) కౌశిక్ బసు
2) రాబర్ట్ వాద్రా
3) సురేష్ గరిమెళ్ల
4) సునందన శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు అంతర్జాతీయ ఆర్థిక అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
- సమాధానం: 1
7. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్కు సౌహార్థ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
1) రాశిఖన్నా
2) రాపోలు భాస్కరరావు
3) విద్యాబాలన్
4) ఐశ్వర్యా రాయ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: మెల్బోర్న్ చిత్రోత్సవానికి విద్యాబాలన్‌ను రాయబారిగా నియమించారు. ఈ చిత్రోత్సవంలో భారత్ నుంచి 20 భాషలలోని 60 చిత్రాలను ప్రదర్శిస్తారు.
- సమాధానం: 3
8. తొమ్మిదవ హాలే ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు ?
1) జకోవిచ్
2) రాఫెల్ నాదల్
3) అలెగ్జాండర్ వెరెవ్
4) రోజర్ ఫెదరర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: హాలే ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో అలెగ్జాండర్ వెరెవ్ను ఓడించి రోజర్ ఫెదరర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ టోర్నీని జర్మనీలో నిర్వహిస్తారు. మ్యాచ్‌లు గడ్డి కోర్టులో జరుగుతాయి.
- సమాధానం: 4
9. ఫిఫా అండర్ - 17 ప్రపంచ ఫుట్‌బాల్ కప్ ఎక్కడ జరగనుంది?
1) చైనా
2) భారత్
3) ఇండోనేషియా
4) ఇంగ్లండ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత్‌లోని ఆరు వేదికల్లో ఆక్టోబర్ 6 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
- సమాధానం: 2
10. అమెరికా - భారత్ బిజినెస్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్లోబల్ లీడర్షిప్ పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) ఎరిక్ బామ్
2) ఫ్రాంకోయిస్ లాండ్
3) ఆది గోద్రెజ్
4) సైరస్ మిస్త్రీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికా - భారత్ బిజినెస్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో గోద్రెజ్ చైర్మన్ ఆది గోద్రెజ్‌కు, డోన్ కెమికల్ సీఈవో ఆండ్రూ లై వీరస్కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
- సమాధానం: 3
11. ఇటీవల ఇస్రో జీశాట్ - 17 సమాచార ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపింది ?
1) శ్రీహరికోట
2) ఫ్రెంచ్ గయానా
3) ఫ్లోరిడా
4) కజన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో జీశాట్ - 17ను అంతరిక్షంలోకి పంపింది. Arianespace Flight VA238 ద్వారా ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఇందులో 17 టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయి.
- సమాధానం: 2
12. జవహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ కంప్యూటర్లపై ఇటీవల దాడి చేసిన వైరస్ పేరు ఏమిటి
1) వనా క్రై
2) లేడి విత్ ల్యాంప్
3) రోడ్
4) పెట్యా రాన్స్‌మ్‌వేర్
- View Answer
- సమాధానం: 4
13. ఇటీవల ఏ దేశం స్వలింగ సంపర్కులకు వివాహం చేసుకునే అవకాశాన్ని కల్పించింది ?
1) జర్మనీ
2) భారత్
3) ఇంగ్లండ్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: జర్మనీ పార్లమెంట్ స్వలింగ సంపర్కుల వివాహానికి ఇటీవలఅనుమతి ఇచ్చింది.
- సమాధానం: 1
14. యూఎన్ టాక్స్ ట్రస్ట్ ఫండ్‌కు భారత్ ఎంత డబ్బు అందించింది ?
1) 5 లక్షల డాలర్లు
2) 3 లక్షల డాలర్లు
3) లక్ష డాలర్లు
4) 50 వేల డాలర్లు
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఐరాస టాక్స్ ట్రస్ట్ ఫండ్‌కు ఆర్థిక సాయం అందించిన తొలి దేశం భారత్. ఆడిస్ అబాబాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి సదస్సులో యూఎన్ టాక్స్ ట్రస్ట్ ఫండ్‌ని ఏర్పాటు చేశారు. శాంతి పరిరక్షణ కోసం ఈ నిధులను వినియోగిస్తారు.
- సమాధానం: 1
15. దేశంలోని ఏ ఆశ్రమం ఏర్పాటు చేసి వందేళ్ల పూర్తయిన సందర్భంగా ఇటీవల శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు ?
1) నిత్యానంద స్వామి ఆశ్రమం
2) సబర్మతి ఆశ్రమం
3) రమణ మహర్షి ఆశ్రమం
4) అరవింద ఆశ్రమం
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 1917 జూన్ 17న మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఇటీవల ఈ ఆశ్రమం వందేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.
- సమాధానం: 2
16. భారత్ సీ - 17 రవాణా విమానాలను ఏ దేశం నుంచి కొనుగోలు చేయనుంది?
1) ఫ్రాన్స్
2) కెనడా
3) రష్యా
4) అమెరికా
- View Answer
- సమాధానం: 4
వివరణ: 366.2 బిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ అమెరికా నుంచి సీ - 17 రవాణా విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిని బోయింగ్ సంస్థ తయారు చేస్తుంది. సైన్యానికి ఆయుధాల సరఫరా కోసం ఈ విమానాలను ఉపయోగిస్తారు.
- సమాధానం: 4
17. వస్తు సేవల పన్ను బిల్లు(Goods and Service Tax)ని ఎవరి సిఫార్సు మేరకు పార్లమెంటులో తొలిసారి ప్రవేశపెట్టారు ?
1) కెల్కర్ టాస్క్‌ఫోర్స్ ఆన్ ఇన్‌డెరైక్ట్ టాక్స్
2) పీసీఎమ్ విజయ్ టాస్క్ ఫోర్స్
3) రంగరాజన్ టాస్క్‌పోర్స్ ఆన్ డెరైక్ట్ టాక్స్
4) బిమల్ జిలాన్ టాస్క్‌ఫోర్స్ ఆన్ ఇన్‌డెరైక్ట్ టాక్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేల్కర్ టాస్క్‌ఫోర్స్ ఆన్ ఇన్‌డెరైక్ట్ టాక్స్ 2003లో తొలిసారి జీఎస్టీని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అనంతరం అనేక అవాంతరాలు దాటుకొని 14 ఏళ్ల తర్వాత వస్తు సేవల పన్ను విధానం 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
- సమాధానం: 1
18. జాతీయ బయోఫార్మాసూటికల్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత వ్యయాన్ని ప్రతిపాదించింది ?
1) 100 మిలియన్లు
2) 150 మిలియన్లు
3) 200 మిలియన్లు
4) 250 మిలియన్లు
- View Answer
- సమాధానం: 4
వివరణ: దేశంలో తొలి బయోఫార్మా పరిశ్రమ, విద్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ బయో ఫార్మాసూటికల్ మిషన్‌ను 250 మిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేసింది. ఇందులో 125 మిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంకు రుణంగా అందించనుంది.
- సమాధానం: 4
19. ప్రతిష్టాత్మక మోహున్ బగన్ రత్న పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ?
1) బల్వంత్ సింగ్
2) సుభ్రత భట్టాచార్య
3) దేబాబ్రత దాస్
4) జులన్ గోస్వామి
- View Answer
- సమాధానం: 2
వివరణ: కోల్‌కత్తాలోని మోహున్ బగన్ క్లబ్ అందించే ఈ పురస్కారానికి మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు సుభ్రత భట్టాచార్య ఎంపికయ్యారు. అలాగే ఈ క్లబ్ నుంచి బల్వంత్ సింగ్ ఈ యేటి మేటి క్రీడాకారుడి పురస్కారం.. దేబాబ్రత్ దాస్ ఉత్తమ క్రికెటర్ పురస్కారం, భారత మహిళా క్రికెట్ జట్ట్టు ఫాస్ట్‌బౌలర్ జులన్ గోస్వామి ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.
- సమాధానం: 2
20. 15వ భారత అటార్నీ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ముకుల్ రోహత్గీ
2) రఘురామ్చంద్ర
3) కేకే వేణుగోపాల్
4) జయసూర్య
- View Answer
- సమాధానం: 3
వివరణ: ప్రస్తుత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్థానంలో కొత్త ఏజీగా కేకే వేణుగోపాల్ నియమితులయ్యారు. ఈయన 2015లో భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.
- సమాధానం: 3
21. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రదానం చేసే గొప్ప వలసదారుల పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) వివేక్ మూర్తి
2) రాఘవ హనుపూడి
3) వరుణ్ సంకర
4) రాజేంద్ర సింగ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఈ పురస్కారానికి భారత సంతతికి చెందిన మాజీ అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, శాంతను నారాయణ్ (అడోబ్ సీఈవో)లు ఎంపికయ్యారు. శాంతను నారాయణ్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఈయన బెర్కల్లీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు.
- సమాధానం: 1
22. జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూలై 8
2) జూలై 4
3) జూలై 1
4) జూలై 28
- View Answer
- సమాధానం: 3
వివరణ: బెంగాల్‌కు చెందిన ప్రముఖ డాక్టర్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకొని ఏటా జూలై 1న జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈయన 1961లో భారత రత్న అందుకున్నారు.
- సమాధానం: 3
23. అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) జూన్ తొలి శనివారం
2) జూలై తొలి శనివారం
3) ఆగస్టు తొలి శనివారం
4) మే తొలి శనివారం
- View Answer
- సమాధానం: 2
వివరణ: అంతర్జాతీయ సహకార దినోత్సవం రోజున ప్రజలలో సహకార ఉద్యమం గురించి అవగాహన కల్పిస్తారు.
2017 Theme : Cooperatives ensure no one is left behind.
- సమాధానం: 2
24. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయించిన రాష్ట్రం ఏది ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రారంభించిన తొలి రాష్ట్రం కర్ణాటక. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టింది. 2018 నుంచి వ్యవసాయనికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
- సమాధానం: 1
25. బ్రాండ్ అకాడమీ ప్రదానం చేసే ఈ సంవత్సరపు ఉత్తమ భారతీయుడు లేదా భారతీయురాలు పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) విక్రమ్ సేథ్
2) అరుంధతి రాయ్
3) రస్కిన్ బాండ్
4) ప్రీతి షెనోయ్
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారత్‌లో అతిముఖ్యమైన సంస్థ బ్రాండ్ అకాడమీ ఏటా సాహిత్యం, క్రీడలు, కళలు, సంగీత రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం ప్రముఖ రచయిత్రి ప్రీతి షెనోయ్ ఉత్తమ భారతీయురాలి అవార్డుకు ఎంపికైంది.
- సమాధానం: 4
26. అమెరికా నుంచి ఉత్తమ పురస్కారం పొందిన భారత పోలీస్ ఆఫీసర్ ఎవరు ?
1) మహేశ్ భగవత్
2) మహేందర్‌రెడ్డి
3) సీవీ ఆనంద్
4) మేఘనాథ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: మానవ అక్రమ రవాణాను అడ్డుకొని, కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేసినందుకు గాను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భవగత్ అమెరికా నుంచి ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్ట్ హీరోస్ పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికా పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది.
- సమాధానం: 1
27. భారత ప్రధాన ఎన్నికల అధికారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) అచల్ కుమార్ జ్యోతి
2) నసీమ్ జైదీ
3) మనిష్ కుమార్ సిసోడియా
4) కేకే వేణుగోపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ప్రధాన ఎన్నికల అధికారి నసీం జైదీ స్థానంలో అచల్ కుమార్ జ్యోతి నియమితులయ్యారు. సీఈవో పదవీ కాలం 6 ఏళ్లు. పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లు. ఇందులో ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది.
- సమాధానం: 1
28. హాంకాంగ్ ముఖ్య పరిపాలనా అధికారిగా ఎవరు ఎన్నికయ్యారు ?
1) లై టన్ర్లీ
2) క్వారీ లామ్ చెంగ్
3) త్సె - త్సోంగ్
4) రైనతు లామ్ టింగ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రిటన్ 1997లో హాంకాంగ్‌ను చైనాకు అప్పగించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉంది. ఇటీవల హాంకాంగ్ ముఖ్య పరిపాలనా అధికారిగా క్వారీ లామ్ చెంగ్ ఎన్నికయ్యారు. 20 ఏళ్లలో ఆ ప్రాంతానికి ఓ మహిళ ఈ పదవికి ఎన్నిక కావడం ఇదే తొలిసారి.
- సమాధానం: 2
29. వన్డే క్రికెట్లో ఇటీవల 200వ సిక్సర్ నమోదు చేసిన క్రికెటర్ ఎవరు ?
1) విరాట్ కోహ్లీ
2) యువరాజ్ సింగ్
3) మహేంద్రసింగ్ ధోని
4) కీరన్ పొలార్డ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: వన్డే క్రికెట్లో 200 సిక్సర్ల మార్కుని దాటిన మొదటి భారత బ్యాట్స్‌మెన్ మహేంద్రసింగ్ ధోని. కెరీర్లో(అన్ని ఫార్మాట్లలో కలిపి) అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ల జాబితాలో ధోని 5వ స్థానంలో ఉన్నాడు. షాహిద్ ఆఫ్రిది, క్రిస్ గేల్, బ్రెండన్ మెక్కల్లమ్, సనత్ జయసూర్య తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
- సమాధానం: 3
30. ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూలై 8
2) జూలై 6
3) జూలై 4
4) జూలై 2
- View Answer
- సమాధానం: 4
వివరణ: అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్‌ను 1924 జూలై 2న ఏర్పాటు చేశారు. ఈ సందర్భంను పురస్కరించుకొని ఏటా జూలై 2న క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
- సమాధానం: 4
31. ఇటీవల ఏ రాష్ట్రంలో ఒకే రోజు 6 కోట్ల మొక్కలను నాటారు ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
వివరణ: నర్మదా నది పరివాహక ప్రాంతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 12 గంటల్లో 6 కోట్ల మొక్కలు నాటి రికార్డు సృష్టించింది. నర్మదా నది సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
- సమాధానం: 3
32. సుప్రీంకోర్టు ఇటీవల ఏ వ్యాధితో బాధపడే స్త్రీలకు అబార్షన్ చేయించుకునే అవకాశాన్ని కల్పించింది ?
1) గుండె సంబంధిత వ్యాధులు
2) క్షయ
3) క్యాన్సర్
4) ఎయిడ్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుండె సంబంధిత జబ్బు ఉన్న 26 వారాల గర్భిణులు అబార్షన్ చేయించుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది.
- సమాధానం: 1
33. ఎఫ్ 1 ఏ ఫార్ములా 3 యూరోపియన్ చాంపియన్‌షిప్ రేసు విజేత ఎవరు ?
1) జేహన్ దారువుల
2) మాక్సిమలియన్ గుంతర్
3) నారాయణ్ కార్తికేయన్
4) డేవిడ్ రామ్సే
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎఫ్ 1 ఏ ఫార్ములా 3 యూరోపియన్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న తొలి భారతీయ రేసర్ జేహన్ దారువుల.
- సమాధానం: 1
34. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
1) జూలై 20
2) జూలై 15
3) జూలై 7
4) జూలై 3
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఏటా జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్లాస్టిక్ బ్యాగుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
- సమాధానం: 4
35. భారత్ - థాయ్‌లాండ్ సైనిక విన్యాసాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు ?
1) లెహ్
2) బక్లొక్
3) సిలిగురి
4) మంగళగిరి
- View Answer
- సమాధానం: 2
వివరణ: హిమాచల్ ప్రదేశ్‌లోని బక్లొక్ ప్రాంతంలో 15 రోజుల పాటు భారత్ - థాయ్‌లాండ్ సైనిక విన్యాసాలు జరిగాయి. రెండు దేశాల సైన్యం మధ్య సంబంధాల బలోపేతం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- సమాధానం: 2
36. చైనా ఇటీవల ఏ వివాదాస్పద ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది ?
1) సిలిగురి
2) సియాచిన్
3) డొక్లాం
4) కారా కోరమ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: భూటాన్‌కు చెందిన డొక్లాం ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డొక్లాంలో చైనా, భారత్, భూటాన్ దేశాల ఉమ్మడి సరిహద్దు ఉంది.
- సమాధానం: 3
37. ఏ దేశానికి చెందిన వ్యక్తులు స్విస్ బ్యాంకుల్లో అత్యంత ఎక్కువ ధనం డిపాజిట్ చేశారు ?
1) యూకే
2) అమెరికా
3) భారత్
4) రష్యా
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం స్విస్ బ్యాంకుల్లో యూకే చెందిన వ్యక్తులు ఎక్కువ డిపాజిట్లు కలిగి ఉన్నారు. ఈ జాబితాలో భారత్ 88వ స్థానంలో ఉంది. 2015 నివేదికలో భారత్ స్థానం 75.
- సమాధానం: 1
38. UNDP నుంచి ఈక్వేటర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1) వినయ్ ఫౌండేషన్
2) స్వయం శిక్షాన్ ప్రయోగ్
3) జనశిక్షణ సంస్థాన్
4) కావూరి విద్యా ఫౌండేషన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: పూణెకు చెందిన స్వయం శిక్షాన్ ప్రయోగ్ సంస్థ UNDP నుంచి ఈక్వేటర్ పురస్కారానికి ఎంపికైంది. మహారాష్ట్ర మరట్వాడా ప్రాంతంలోని మహిళలు సేంద్రీయ పద్ధతుల్లో మిశ్రమ పంటలు పండించేందుకు ఈ సంస్థ ఎకరా నమూనాను రూపొందించింది. దీని ద్వారా అక్కడి మహిళలు ఆర్థిక, పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడ్డారు. ఇందుకు గాను ఈ సంస్థకు ఐక్యరాజస్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఈక్వేటర్ పురస్కారాన్ని అందించింది.
- సమాధానం: 2
39. ఇటీవల ఏ దేశంలో వివాహ నమోదను తప్పనిసరి చేశారు ?
1) పాకిస్తాన్
2) శ్రీలంక
3) భూటాన్
4) భారత్
- View Answer
- సమాధానం: 4
వివరణ: పెళ్లి జరిగిన 30 రోజుల లోపు వివాహ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ, హర్యానా, మేఘాలయ, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాలు వివాహ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టాలు తీసుకొచ్చాయి.
- సమాధానం: 4
40. భారత్ - జోర్డాన్ 10వ వ్యాపార, ఆర్థిక సంయుక్త కమిటీ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) సనా
2) రియాద్
3) అమ్మన్
4) న్యూఢిల్లీ
- View Answer
- సమాధానం: 4
41. డ్రీ వ్యవసాయ పండుగను ఏ తెగ ప్రజలు జరుపుకుంటారు ?
1) గోండు
2) ఆపతాని
3) సంతాల్
4) బైగా
- View Answer
- సమాధానం: 2
వివరణ: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆపతాని తెగ ప్రజలు డ్రీ వ్యవసాయ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా తాము, హరినైయాంగ్, మీతి, దానియి అనే తెగ దేవతలను పూజిస్తారు.
- సమాధానం: 2
42. బ్రిక్స్ దేశాల 5వ విద్యావంతుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు ?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) కజన్
4) ఫోర్తలేజా
- View Answer
- సమాధానం: 2
వివరణ: చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఈ సమావేశానికి భారత తరపున HRD మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు.
- సమాధానం: 2
43. అత్యంత అరుదైన తెల్ల పులిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు ?
1) సుందర్ బన్
2) గిర్ అడవులు
3) నల్లమల అడవులు
4) నీలగిరి పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
వివరణ: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ నీలాంజన్ రే.. నీలగిరి పర్వతాల్లో ఇటీవల అరుదైన తెల్ల పులిని ఫోటో తీశారు.
- సమాధానం: 4
44. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం ఎంత ?
1) 96
2) 98
3) 108
4) 158
- View Answer
- సమాధానం: 1
వివరణ: 2015 ఫిఫా ర్యాంకింగ్స్‌లో 173వ స్థానంలో ఉన్న భారత్ప్రస్తుతం 77 స్థానాలు మెరుగుపరుచుకుని 96వ స్థానానికి చేరుకుంది.
- సమాధానం: 1
45. ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?
1) పాకిస్తాన్
2) మలేషియా
3) భారత్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: పంకజ్ మరియు లక్ష్మణ్ రావత్‌ల ద్వయం పాకిస్తాన్ జట్టుని ఓడించి ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.
- సమాధానం: 3
46. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు పోలీస్ రోబోను ప్రవేశపెట్టనున్నారు ?
1) తెలంగాణ
2) మహారాష్ట్ర
3) తమిళనాడు
4) గోవా
- View Answer
- సమాధానం: 1
వివరణ: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసు శాఖ త్వరలోనే పోలీస్ రోబోను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం దుబాయ్‌లో పోలీసు రోబో సేవలను వినియోగిస్తున్నారు.
- సమాధానం: 1
47. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం వృక్ష మిత్ర పురస్కారాలను ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) మహారాష్ట్ర
4) మధ్యప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన వారికి వృక్ష మిత్ర అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
- సమాధానం: 2
48. భారత్, అమెరికా, జపాన్ దేశాల త్రైపాక్షిక మలబార్ నౌకా విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు ?
1) ఫ్లోరిడా
2) ఒసాకా
3) చెన్నై
4) కొబ్
- View Answer
- సమాధానం: 3
49. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ - 2017లో భారత్ ర్యాంకు ఎంత ?
1) 10
2) 16
3) 19
4) 23
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ టెలిక మ్యూనికేషన్స్ యూనియన్.. సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్‌ను తయారు చేసింది. ఈ నివేదికలో సింగపూర్ తొలి స్థానంలో ఉంది. అమెరికా, మలేషియా, ఒమన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఈ నివేదికలో 23వ స్థానంలో ఉంది.
- సమాధానం: 4
50. యూకేలో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న దేశం ఏది ?
1) అమెరికా
2) భారత్
3) చైనా
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: యూకేలో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న దేశం అమెరికా. తర్వాతి స్థానంలో చైనా, ఫ్రాన్స్, భారత్ ఉన్నాయి. గతేడాది 3వ స్థానంలో ఉన్న భారత్ ఈ సారి 4వ స్థానానికి పడిపోయింది.
- సమాధానం: 1