Sampanthan: శ్రీలంక సీనియర్ తమిళ నేత సంపంతన్ కన్నుమూత

శ్రీలంకకు చెందిన సీనియర్‌ తమిళ నేత ఆర్‌.సంపంతన్‌ (91) కన్నుమూశారు.

టీఎన్‌ఏ పార్టీ ప్రకారం జూన్ 30వ తేదీన కొలంబోలోని ఒక ఆస్పత్రిలో ఆయన చివరి శ్వాస విడిచారు.

మితవాద భావాలు కలిగిన సంపంతన్, శ్రీలంకలో తమిళులకు శాంతి, న్యాయం, గౌరవప్రదమైన స్థానం కోసం జీవితాంతం కృషి చేశారు. సింహళులు మెజారిటీగా ఉన్న శ్రీలంకలో, సంపంతన్ సారథ్యంలోని టీఎన్‌ఏ 2004లో తమిళులకు చెందిన రెండో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

1948లో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి శ్రీలంక తమిళులు స్వతంత్ర హక్కుల కోసం పోరాడుతున్నారు. 1970ల వరకు శాంతియుతంగా సాగిన ఈ పోరాటం, ఆ తర్వాత హింసాత్మక రూపం దాల్చింది. 1977లో ట్రింకోమలి నుండి పార్లమెంట్‌కు ఎన్నికైన సంపంతన్, తమిళుల స్వతంత్ర ప్రతిపత్తికి రాజకీయ పరిష్కారం కోసం కృషి చేశారు. 2015లో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ఆయన, శ్రీలంక నూతన రాజ్యాంగం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.

Srinivas Hegde: చంద్రయాన్‌-1 మిషన్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ హెగ్డే కన్నుమూత

#Tags