Syamala Rao: టీటీడీ కొత్త‌ ఈవోగా నియమితులైన‌ శ్యామ‌ల‌రావు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు నియమితులయ్యారు.

ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్యామలరావును ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జూన్ 14వ తేదీ ఉత్తర్వులు జారీ చేశారు.

టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సెలవుపై వెళ్లడంతో శ్యామలరావును నియమించారు.

1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శ్యామలరావు, మొదట అసోం కేడర్‌కు కేటాయించబడ్డారు. 2009లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఆయన విశాఖ కలెక్టర్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ఎండీగా పనిచేశారు. శ్యామలరావు మున్సిపల్ శాఖలో ఎక్కువ కాలం పనిచేశారు.

Nirab Kumar Prasad: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్

#Tags