Veteran actor Sarath Babu: ఐపీఎస్ కావాల‌నుకుని... న‌ట‌న‌వైపు అడుగులు.. శరత్‌ బాబు జీవ‌న‌ప్ర‌స్థానం ఇలా...

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Veteran actor Sarath Babu

మ‌ల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కావడంతో కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలు దెబ్బతిని ఆయన మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆయన మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది.

☛➤☛ ప్రముఖ సినీనటుడు సీనియర్‌ నటుడు కైకాల కన్నుమూత.. ఈయ‌న జీవిత ప్ర‌స్థానం ఇలా..

శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలసకు చెందిన విజయశంకర దీక్షితులు సుశీలాదేవిల కుమారుడే శరత్‌బాబు. చిన్నతనం నుంచి ఐపీఎస్‌ కావాలని కలలు కన్న ఆయన అనుకోకుండా నాటకరంగం వైపు వచ్చారు. కళాశాలలో చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు వేసిన శరత్‌బాబు 1973లో విడుదలైన ‘రామరాజ్యం’తో హీరోగా తొలి అడుగు వేశారు. రెండో సినిమా కోసం విలన్‌ పాత్ర పోషించి.. హీరోగానే కాకుండా విలన్‌, సహాయనటుడిగా సుమారు 250కు పైగా చిత్రాల్లో నటించారాయాన.   

శరత్‌ బాబు తెలుగులోనే కాదు.. తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబు ఆదరణ పొందారు. గతేడాది రిలీజైన పవన్ కల్యాణ్ మూవీ నటించిన వకీల్ సాబ్‌లో ఓ అతిథి పాత్రలో కనిపించిన ఆయన.. వందలాది చిత్రాల్లో విభిన్నపాత్రలతో ఆకట్టుకున్నారు. శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఆయన జన్మించారు.

☛➤☛ ఐదు జాతీయ అవార్డులు అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఇకలేరు..

శరత్ బాబు తండ్రికి పెద్ద హోటల్ ఉండేది.. అతనిలాగే కుమారుడు బిజినెస్‌ చూసుకుంటాడని తండ్రి భావించారు. కానీ శరత్ బాబుకు మాత్రం తాను పోలీస్ ఆఫీసర్ కావాలన్న కోరిక ఉండేది. అప్పట్లో అతని మిత్రులు, లెక్చరర్స్ 'నువ్వు హీరోలా ఉంటావ్ … సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా' అని సలహా ఇచ్చారు. ఆ మాటలు కాస్తా శరత్ బాబు తల్లి దృష్టికి వచ్చాయి. తండ్రికి ఇష్టం లేకపోయినా.. తల్లి ప్రోత్సాహంతో మద్రాసులో అడుగుపెట్టాడు. మద్రాస్ చేరుకున్న శరత్‌ బాబు అవకాశాల కోసం వెతికారు.

వయసులో తనకంటే పెద్దదైన రమాప్రభతో ప్రేమ.. పెళ్లి
అప్పటికే కమెడియన్‌గా స్టార్‌ హోదాలో ఉన్న రమాప్రభతో పరిచయం ఏర్పడటం, అది ప్రేమకు దారి తీయడంతో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది. రమాప్రభ.. శరత్‌బాబు కంటే నాలుగేళ్లు పెద్దది. 14 ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్న ఈ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ తమిళ నటుడు నంబియార్‌ కూతురు స్నేహలతను పెళ్లాడగా ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు సైతం విడాకులిచ్చేశారు.

☛➤☛ Senior actress Jamuna : ప్రముఖ తెలుగు సీనియర్‌ నటి జమున కన్నుమూత

ఆ 25 మంది తన పిల్లలే....
ఆ తర్వాత నమితను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ అవంతా పుకారు అని ఆయనే స్వయంగా కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆయన సీక్రెట్‌గా ఎవరినో మూడో పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం మాత్రం ఆగలేదు. ఇక తన పిల్లల గురించి ప్రశ్న ఎదురైనప్పుడల్లా తన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల పిల్లలు 25 మంది తన తన పిల్లలే అని సరదాగా చెబుతుండేవారు. శరత్‌బాబుకు ఎటువంటి దురలవాట్లు లేవు. తను పూర్తిగా శాకాహారి.

#Tags