Igor Kirillov: బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్‌ మృతి

రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్‌ జనరల్‌ ఇగోర్‌ కిరిల్లోవ్‌ (54) మృతిచెందారు.

ఆయన ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిసెంబ‌ర్ 17వ తేదీ ఆయన కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలో ఉన్న కారు వద్దకు రాగానే, ఆ పక్కనే ఉన్న స్కూటర్‌లో అమర్చిన బాంబు పేలింది. ఈ ఘటనలో కిరిల్లోవ్‌తో పాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్‌ సర్వీస్‌(ఎస్‌బీయూ) హస్తముందని ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు.   

ఆ దేశాలే కారణం..
ఉక్రెయిన్‌ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్‌ ఆదేశాలే కారణమని డిసెంబ‌ర్ 16వ తేదీ ఎస్‌బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్‌ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 

Terry Griffiths: స్నూకర్‌ దిగ్గజం గ్రిఫిత్‌ కన్నుమూత

2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్‌బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్‌ అనే విష వాయువును ఉక్రెయిన్‌ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.

బాంబును రిమోట్‌తో..
ఈ ఘటనపై రష్యా అధికారులు స్పందిస్తూ.. బాంబును రిమోట్‌తో పేల్చారని చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణించి, తగిన ప్రతీకార చర్యలు చేపడతామని ప్రకటించింది. రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఉక్రెయిన్‌ ఈ చర్యకు పాల్పడిందన్నారు.

Zakir Hussain Passed Away: తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

#Tags