Utpal Kumar Singh: లోక్‌సభ సెక్రటరీ జనరల్ పదవీకాలం పొడిగింపు
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా ఉన్న ఉత్పల్ కుమార్ సింగ్ పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
1986 బ్యాచ్ ఉత్తరాఖండ్ ఐఏఎస్ అధికారి అయిన ఉత్పల్ సింగ్.. 2020 జులై 31న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 2020 సెప్టెంబర్ 1న లోక్‌సభ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల తర్వాత ఆయనను సెక్రటరీ జనరల్‌గా నియమించారు.
ఇప్పటివరకు ఆయన పదవీకాలాన్ని మళ్ళీ పొడిగించే నిర్ణయం తీసుకోవడంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పాత్ర కీలకంగా ఉంది. ఈ పొడిగింపు 2025 నవంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.
#Tags