KC Venugopal: పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మ‌న్‌గా వేణుగోపాల్

పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ నియమితులయ్యారు.

15 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి వేణుగోపాల్‌ నేతృత్వం వహిస్తారు.

ఇందులో సభ్యులుగా అనకాపల్లి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ సీఎం రమేష్, ఒంగోలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ నియమితులయ్యారు. లోక్‌సభ సచివాలయం ఆగ‌స్టు 16వ తేదీ దీనికి సంబందించిన ప్రకటన జారీ చేసింది. 2025 ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీకి గడువు ఉంటుంది.

TV Somanathan: కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శిగా టీవీ సోమ‌నాథ‌న్‌.. ఆయ‌న ఎవ‌రంటే..

#Tags