US: న్యూయార్క్‌ కోర్టు జడ్జిగా భారతీయుడు.. మొట్టమొదటి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డు!!

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న‌ తూర్పు జిల్లా కోర్టుకు భారత సంతతికి చెందిన సంకేత్‌ జయసుఖ్‌ బల్సరా న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

బల్సరాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నామినేట్ చేశారు.  
న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టులో పనిచేస్తున్న బల్సరా.. సెక్యూరిటీలు, కాంట్రాక్టులు, దివాలా, నియంత్రణ విషయాలలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. అతని తల్లిదండ్రులు భారతదేశం నుంచి అక్కడికి వలస వచ్చారు. 46 ఏళ్ల బల్సరా 2017 నుంచి న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్‌లో యూఎస్‌ మేజిస్ట్రేట్ జడ్జిగా పనిచేస్తున్నారు. యూఎస్‌ కోర్టుకు నియమితులైన మొట్టమొదటి దక్షిణాసియా అమెరికన్ ఫెడరల్ న్యాయమూర్తిగా బల్సరా ఘనత సాధించారు.

బల్సరా న్యూ రోషెల్‌లో జన్మించారు. అతని తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు. అతని తండ్రి ఇంజనీర్‌గా పనిచేశారు. తల్లి నర్సు. బల్సరా 2002లో హార్వర్డ్ లా స్కూల్ నుంచి జేడీ, 1998లో హార్వర్డ్ కళాశాల నుంచి ఏబీ పట్టా పొందాడు. ప్రస్తుతం బల్సరా తన భార్య క్రిస్టీన్ డెలోరెంజోతోపాటు లాంగ్ ఐలాండ్ సిటీలో ఉంటున్నారు.

Finance Commission Members: 16వ ఆర్థిక సంఘం సభ్యుల నియామకం.. వారు ఎవ‌రంటే..

#Tags