First Judge in California: అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం.. ఈమె ఎవ‌రో తెలుసా..

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది.

చిలకలపూడి (మచిలీపట్నం): అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన జయ బాడిగ నియమితులయ్యారు. 2022 నుంచి ఆమె కోర్టు కమిషనర్‌గా పనిచేసి ఫ్యామిలీ లా నిపుణురాలిగా పేరొందారు.

కుటుంబ న్యాయ సలహాల రంగంలో పలువురికి మార్గదర్శకురాలిగా వ్యవహరించారు. ఏపీలోని విజయవాడలో ఆమె జన్మించారు. 1991–94 మధ్య ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా వర్సిటీలో సైకాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో బీఏ పూర్తి చేశారు. 

అనంతరం అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రిలేషన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. శాంటాక్లారా వర్సిటీ నుంచి లా పట్టాను పొందారు. కాలిఫోర్నియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ అటార్నీగా, గవర్నర్‌ కార్యాలయం అత్యవసర సేవల విభాగంలో పనిచేశారు. జయ బాడిగ మంగళవారం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె తండ్రి బాడిగ రామకృష్ణ 2004–09 వరకు మచిలీపట్నం ఎంపీ (కాంగ్రెస్‌)గా పనిచేశారు.  

Global Excellence Award: చంద్రకాంత్ సతీజాకు గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు

#Tags