Brightest Student: ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థిగా భారత సంతతి చిన్నారి
ప్రపంచంలో అసాధారణ తెలివితేటలు కలిగిన విద్యార్థిగా 13 ఏళ్ల ఇండియన్ అమెరికన్ నటాషా పెరియనాయగం నిలిచింది.
అమెరికాకు చెందిన జాన్ హాప్‌కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ నిర్వహించిన పలు రకాల పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచి వరసగా రెండో సంవత్సరం ఈ ఘనత సాధించింది. మొత్తం 76 దేశాల నుంచి 15 వేల మంది విద్యార్థినీ విద్యార్థులు జాన్ హాప్‌కిన్స్ సెంటర్ పరీక్షల్లో పాల్గొంటే నటాషా అత్యంత తెలివైనదానిగా తన ప్రతిభ కనబరిచింది. న్యూజెర్సీ ఫ్లోరెన్స్ ఎం గాడినీర్ మిడిల్ స్కూల్లో చదువుతున్న నటాషా 2021లో జరిగిన పోటీల్లో కూడా పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. శాట్, యాక్ట్, స్కూల్, కాలేజీ ఎబిలిటీ టెస్టుల్లో నటాషా అసాధారణ ప్రతిభ కనబరిచినట్టుగా జాన్ హాప్‌కిన్స్ సెంటర్ ఒక ప్రకటనలో తెలిపింది.
U-19 Women’s T20 World Cup: టి20 వరల్డ్‌కప్ సాధించిన మహిళలు.. ఒక్కొక్కరి కథ ఒక్కోలా..
#Tags