AP High Court: ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయ­మూర్తులుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణం చేశారు.

ఆగ‌స్టు 28వ తేదీ హైకోర్టులో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. అంతకుముందు ఇరువురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయ­మూ­ర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీ­జియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు.

జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు.. 
జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌ సోమయ్య, కోటేశ్వరమ్మలకు 1964 ఆగస్టు 30న జన్మించారు. 10వ తరగతి మచి­లీపట్నంలోని జైహింద్‌ హైస్కూల్‌లో, ఇంటర్మీ­డియట్‌ చల్లపల్లిలోని ఎస్‌ఆర్‌వైఎస్‌పీ జూని­యర్‌ కాలేజీలో.. గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యు­యేషన్, న్యాయ విద్యను మచిలీపట్నంలో అభ్యసించారు. 1989 ఏప్రిల్‌ 5వ తేదీన న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో చేరి ప్రాక్టీస్‌ చేశారు. 1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. 

New Secretaries: ఈ శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించిన కేంద్ర ప్రభుత్వం.. వారెవ‌రంటే..

అనంతరం 2016 నుంచి 2019 వరకు శ్రీకాకుళంలో ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక జడ్జిగా పని చేశారు. అనంతరం తిరుపతిలోని ఫ్యామిలీ కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పని చేస్తున్న సమయంలో గతేడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.  

జస్టిస్‌ పి.వెంకట జ్యోతిర్మయి..  
జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా తెనాలిలో పీవీకే శాస్త్రి, బాల త్రిపుర సుందరి దంపతులకు జన్మించారు. డిగ్రీ వరకు తెనాలిలోనే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. అనంతరం 2008లో నేరుగా జిల్లా జడ్జి కేడర్లో ఎంపికై..  ఫ్యామిలీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్, ఎస్సీ ఎస్టీ కోర్టు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

New Governors: తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం.. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ ఈయ‌నే..

#Tags