​Charu Sinha: సీఆర్పీఎఫ్‌ సదరన్ సెక్టార్‌ ఐజీగా చారుసిన్హా

సీఆర్పీఎఫ్‌ (సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌) సదరన్‌ సెక్టార్‌ ఐజీగా 1996 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి చారు సిన్హా నియమితులయ్యారు.

ఈ మేరకు ప్రస్తుత ఐజీ మహేశ్‌చంద్ర లడ్హా నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీఆర్పీఎఫ్‌ సదరన్‌ సెక్టార్‌ ఐజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా ఐపీఎస్‌ అధికారిగా కూడా చారు సిన్హా రికార్డు సొంతం చేసుకున్నారు. కేంద్ర సర్వీసులకు వెళ్లకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, చిత్తూరు, తూర్పుగోదావరి, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లలో ఎస్పీగా పనిచేశారు. యూఎన్‌ మిషన్‌ కోసం కోసావ్‌లోనూ పనిచేశారు. అక్కడ స్థానిక ముస్లిం, క్రిస్టియన్‌ తెగల మధ్య వివాదాల పరిష్కారంలో కీలకంగా పనిచేశారు. ఏసీబీ డైరెక్టర్‌గా, అనంతపురం రేంజ్‌ డీఐజీ అనంతపురం, చిత్తూరు జిల్లా పరిధిలో శాంతిభద్రతల నిర్వహణలో అత్యంత కీలకంగా పనిచేశారు. 
తెలంగాణ కేడర్‌కు చెందిన చారుసిన్హా తన కెరీర్‌లో అత్యంతకీలకమైన పోస్టుల్లో పనిచేసి విజయవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అప్పటి వరకు మహిళా ఐపీఎస్‌లు నిర్వర్తించని బాధ్యతలతో తనపేరిట అరుదైన రికార్డులను నెలకొల్పారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతమైన జమ్మూ సెక్టా ర్‌ ఐజీగా, శ్రీనగర్‌ సెక్టార్‌లో కలిపి మూడున్నరేళ్లపాటు విజయవంతంగా పనిచేశారు. అంతకు ముందు సీఆర్పీఎఫ్‌ బిహార్‌ కమాండ్‌ ఐజీగా నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టారు. 

Ajay Banga: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా అజయ్‌ బంగా.. ఈయ‌న చ‌దివింది మ‌న హైద‌రాబాద్‌లోనే..!

#Tags