Health Insurance: 70 ఏళ్లు పైబడిన వారందరికీ.. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా
ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 11వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబ్ధిదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.
ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా..
కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్‌ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది.
Vande Bharat: వందేభారత్ స్లీపర్ కోచ్ వచ్చేసింది.. ఇందులో ఉండే సౌకర్యాలు ఇవే..
ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు.
ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్‌వాడీ/ఏడబ్ల్యూహెచ్‌ఎస్‌లకూ వర్తింపజేశారు.
Swachh Vayu Survekshan: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ఫలితాలు.. టాప్‌లో ఉన్న నగరాలు ఇవే..