Amrit Bharat Station Scheme: చిన్న రైల్వేస్టేషన్లకు మహర్దశ

దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న రైల్వే స్టేషన్ల ప్రాధాన్యతను పెంచేలా కొత్త ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. వీటికి భారీఎత్తున పునరుద్ధరణ పనులను ‘అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌’ కింద చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. భవిష్యత్తులో రూఫ్‌ ప్లాజాలు, సిటీ సెంటరు మాల్స్‌ ఏర్పాటుచేసేలా చిన్న రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దడం ఈ స్కీమ్‌ లక్ష్యం. దీనికోసం 65 డివిజన్ల పరిధిలోని వెయ్యి రైల్వేస్టేషన్లను ఎంపిక చేశారు. ఒక్కో డివిజన్‌ లో 15 స్టేషన్లను గుర్తించారు. రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల చొప్పున ఒక్కోదానిపై ఖర్చు చేయనున్నారు. మరోవైపు ఎంపిక చేసిన 200కిపైగా పెద్ద రైల్వే స్టేషన్లకు విస్తరణను కూడా చేపట్టనున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags