Shikshak Parv–2021: శిక్షక్‌ పర్వ్‌–2021 కాంక్లేవ్‌ థీమ్‌ ఏమిటీ?

శిక్షక్‌ పర్వ్‌–2021 కాంక్లేవ్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 7న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఇండియన్‌ సైన్‌లాంగ్వేజి డిక్షనరీ, ఆడియో పుస్తకాలు, టాకింగ్‌ బుక్స్‌ను మోదీ విడుదల చేశారు. సీబీఎస్‌ఈకి అవసరమైన స్కూల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ విధానాలు, నిపుణ్‌ భారత్‌ కోసం నిష్టా టీచర్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం, పాఠశాలల అభివృద్దికి సంబంధించిన విద్యాంజలి పోర్టల్‌ ఆవిష్కరించారు. దివ్యాంగుల కోసం టాకింగ్, ఆడియో బుక్స్, సైన్‌లాంగ్వేజి డిక్షనరీని విడుదల చేశారు. 2021 శిక్షక్‌ పర్వ్‌ థీమ్‌గా క్వాలిటీ అండ్‌ సస్టైనబుల్‌ స్కూల్స్‌: లెర్నింగ్‌ ఫ్రమ్‌ స్కూల్స్‌ ఇన్‌ ఇండియా ఎంచుకున్నారు.

జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?
దేశంలో 2021 ఏడాది మొదటి 8 నెలల్లో మహిళలపై నేరాల్లో గత ఏడాదితో పోలిస్తే 46 శాతం పెరుగుదల నమోదైందని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తెలిపింది. ఇందులో దాదాపు సగం వరకు ఫిర్యాదులు ఒక్క యూపీలోనివేనని ఎన్‌సీడబ్ల్యూ చైర్మన్‌ రేఖా శర్మ వివరించారు. 

#Tags