Sardardham Bhavan: విద్యార్థుల కోసం సర్దార్‌ధామ్‌ భవన్‌ను ఏ నగరంలో నిర్మించారు?

విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు వసతి కల్పించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్‌ధామ్‌ భవన్‌ ప్రారంభమైంది.

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 11న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ భవన్‌ను ప్రారంభించారు. అనంతరం బాలికల హాస్టల్‌ అయిన సర్దార్‌ధామ్‌ ఫేజ్‌–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. సర్దార్‌ధామ్‌ భవన్‌ను రూ.200 కోట్లతో విశ్వ పాటిదార్‌ సమాజ్‌ నిర్మించింది.

బీహెచ్‌యూలో తమిళ పీఠం...

తమిళ భాష అధ్యయనానికి బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి(సెప్టెంబర్‌ 12) సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్‌ భారత్‌.. శ్రేష్ట భారత్‌ అనే భావనను సర్దార్‌ పటేల్‌ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : విశ్వ పాటిదార్‌ సమాజ్‌ నిర్మించిన సర్దార్‌ధామ్‌ భవన్‌ ప్రారంభం 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 11 
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : అహ్మదాబాద్, గుజరాత్‌
ఎందుకు   : విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు వసతి కల్పించేందుకు...
 

 

#Tags