Food Security Rankings: ‘ఆహార భద్రత’ అమలులో ఒడిశా నంబర్‌వన్‌

Odisha is number one in implementation of food security

రేషన్‌ దుకాణాల ద్వారా జాతీయ ఆహార భద్రతాచట్టం(ఎన్‌ ఎఫ్‌ఎస్‌ఏ) అమలులో ఒడిశా దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి. తెలంగాణకు 12వ స్థానం దక్కింది. ప్రత్యేక కేటగిరి రాష్ట్రాల్లో(ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు) త్రిపుర మొదటి స్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్నప్పటికీ.. సాధారణ రాష్ట్రాలతో పోటీ పడ్డాయని సూచీ తెలిపింది. ఎన్‌ ఎఫ్‌ఎస్‌ఏ కింద రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యవసరాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ(టీపీడీఎస్‌) కింద ఎన్‌ ఎఫ్‌ఎస్‌ఏ అమలు తీరును ఈ సూచీ లెక్కించింది.

Weekly Current Affairs (National) Bitbank: 2022లో హెల్త్‌కేర్‌లో డ్రోన్‌లను ప్రారంభించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags