Lumpy skin disease (LSD): వణికిస్తున్న లంపీ ముప్పు.. పాడి పశువుల్లో వ్యాపిస్తున్న వ్యాధి

దేశంలో కొద్ది నెలలుగా మరో వైరస్‌ పేరు మారుమోగుతోంది. పాడి పశువుల్లో ఈ వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే లంపీ స్కిన్‌ వ్యాధి (ఎల్‌ఎస్‌డీ).
Lumpy skin disease in cattle spreads to over 8 States

కాప్రిపాక్స్‌ అని పిలిచే ఈ వైరస్‌ ఆవులు, గేదెలకు సోకుతోంది. ఈ ఏప్రిల్‌లో గుజరాత్‌లోని కచ్‌లో తొలిసారి ఇది బయటపడింది. రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 వేల పశువులు మరణించాయి. మరో 15 లక్షల పశువులకు వైరస్‌ సోకింది. ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే దేశ పాడిపరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి.  

Also read: COVID-19: వాయిస్‌ విని వైరస్‌ గుట్టు చెప్పేస్తుంది

ఏమిటీ వైరస్‌?  
దోమలు, ఈగలు, పేలు మరికొన్ని కీటకాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది గోటోపాక్స్, షీప్‌ పాక్స్‌ కుటుంబానికి చెందిన వైరస్‌. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్‌ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. అధికంగా లాలాజలం ఊరి నోట్లో నుంచి బయటకు వస్తుంది. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. కొన్నాళ్లకే పశువులు బరువును కోల్పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది.ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎన్నో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్‌ సోకిన జంతువులకు పశు వైద్యులు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్‌ ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు.  

Also read: Covid vaccine: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌కు DCGI అనుమతి

మనుషులకు సోకదు
లంపీ స్కిన్‌ వ్యాధి మనుషులకి సోకే అవకాశం ఎంత మాత్రం లేదదిది జూనోటిక్‌ (మనుషులకు సంక్రమించదు) వైరస్‌ కాదని, మనుషులకు సోకదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిపుణులు వెల్లడించారు. వ్యాధి సోకిన ఆవుల పాలను నిర్భయంగా తాగవచ్చునని మనుషులకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు.  

Also read: MCED blood test: క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో... గేమ్‌ చేంజర్‌

పరిష్కారమేంటి? 
ప్రస్తుతానికి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులు, పశుపోషకుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్రం రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కొన్నాళ్లు పాటు పశువుల్ని వేరే రాష్ట్రాలకు తరలించవద్దని సూచించింది. గోట్‌పాక్స్‌ వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ దీనినీ అరికడుతుందని నిపుణులు చెప్పడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 కోట్లను ఈ వైరస్‌ ఉన్న  ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌), ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐబీఆర్‌ఐ) సంయుక్తంగా లంపీ స్కిన్‌ వ్యాధికి వ్యాక్సిన్‌ కనుగొన్నారు. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుంది. దేశంలోని పశువులన్నింటికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలంటే 18–20 టీకా డోసులు అవసరం. దేశంలోని పశువులకి 80శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయితేనే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడతామని ఏనిమల్‌ సైన్సెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ బి.ఎన్‌. త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 2025 నాటికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.  
 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Also read: Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్‌ ఉంటాయి?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags