Hydrogen Cruise: భారతదేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్.. ఎక్కడంటే..
ఈ క్రూయిజ్ జూలై 14వ తేదీ వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్‌ను నమో ఘాట్‌కు తీసుకువచ్చి, తరువాత రామ్‌నగర్‌లోని మల్టీమోడల్ టెర్మినల్‌కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్‌యార్డ్‌లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది.
ఈ క్రూయిజ్‌లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది. కాలుష్యాన్ని ఉత్పత్తి చేయకుండా గంగానదిలో నడిచే తొలి క్రూయిజ్ ఇది. ఈ క్రూయిజ్ వారణాసి-చునార్ మధ్య నడుస్తుంది. దీనిని పర్యాటక శాఖ పర్యవేక్షించనుంది.
ఈ క్రూయిజ్ నిర్వహణ కోసం వారణాసిలోని రామ్‌నగర్ మల్టీ మోడల్ టెర్మినల్‌లో తాత్కాలిక హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ క్రూయిజ్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్ కూడా అమర్చారు. తద్వారా హైడ్రోజన్ ఇంధనం తగ్గినప్పుడు, క్రూయిజ్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడపవచ్చు. వారణాసి తర్వాత అయోధ్య, మథురలలో కూడా ఈ క్రూయిజ్‌ను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Viraat Ramayan Mandir: అయోధ్య ఆలయాన్ని మించి నిర్మితమవున్న రామాలయం.. ఎక్కడంటే..