Project ASMITA: భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలు!

కేంద్ర విద్యా శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కలిసి భారతీయ భాషల్లో 22,000 పుస్తకాలను అనువదించే "అస్మిత" అనే ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి.

రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య అంశాలు..
➣ 22 భాషల్లో 1,000 పుస్తకాల అనువాదం.
➣ 13 నోడల్ విశ్వవిద్యాలయాల ద్వారా అమలు.
➣ బహుభాష శబ్దకోశం అభివృద్ధి.
➣ రియల్ టైమ్ అనువాద వ్యవస్థ ఏర్పాటు.

ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఇదే..
➣ భారతీయ భాషల్లో ఉన్నత విద్యకు అవకాశాలను పెంచడం.
➣ విద్యార్థులకు మరింత సమగ్రమైన అధ్యయన సామాగ్రి అందించడం.
➣భారతీయ భాషల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం.
➣ భాషా సాంకేతికత అభివృద్ధికి దోహదం చేయడం.

కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌లను ప్రారంభించినట్లు తెలిపారు.

Anti Narcotics Helpline: యాంటి నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నంబర్ ఇదే..

#Tags