World’s Largest Coral: ప్రపంచంలో అతిపెద్ద పగడం గుర్తింపు

ఏకంగా 100 అడుగులకు పైగా పొడవైన పగడాన్ని(కోరల్‌)ను నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని చెబుతున్నారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుందని అంటున్నారు.

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ప్రిస్టీన్‌ సీస్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా గత నెలలో సోలోమాన్‌ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేయడానికి బయలుదేరిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. 

చదవండి: Birsa Munda: చిన్న వయసులో ఆదివాసీ యోధునిగా ఎదిగిన‌ బిర్సా ముండా

గతంలో అమెరికాలో సమోవాలో గుర్తించిన భారీ పగడం కంటే ఇది మూడు రెట్లు పెద్దది కావడం విశేషం. అంతేకాదు భూమిపై అతిపెద్ద జంతువైన బ్లూవేల్‌ కంటే కూడా పొడవైనది. సాధారణంగా సముద్రాల అంతర్భాల్లో పగడపు దిబ్బలు ఏర్పడతాయి.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ దిబ్బల్లో చిన్నచిన్న పగడాలు కనిపిస్తాయి. కానీ, నైరుతి పసిఫిక్‌ మహాసముద్రంలో తాజాగా గుర్తించి పగడం సింగిల్‌ కోరల్‌ కావడం గమనార్హం. కొన్ని శతాబ్దాలుగా దీని పరిమాణం పెరుగుతున్నట్లు గుర్తించారు.  

#Tags