3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ టెంపుల్..

ప్రపంచంలోనే తొలిసారిగా సిద్దిపేటలో 3డీ ప్రింటింగ్‌ విధానంలో ఒక దేవాలయం నిర్మితమవుతోంది.

సిద్దిపే­ట అర్బన్‌ మండలం బూరుగుపల్లిలోని చర్విత మె­డోస్‌ గేటెడ్‌ విల్లాస్‌ కమ్యూనిటీలో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణం, 30 అడుగుల ఎత్తుతో దీ­న్ని కడుతున్నారు. మూడు గర్భాలయాలతో కూ­డిన ఈ ఆలయంలో పార్వతీపరమేశ్వరులు, వి­ఘ్నే­శ్వరుడు వేర్వేరుగా కొలువుదీరనున్నారు. మోదక్, చతురస్రాకార, తామరపువ్వు ఆకారాల్లోని గర్భాలయాలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్‌లో తొలుత 3డీలో డిజైన్‌ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌.. త్రీడీ ప్రింటింగ్‌ నిర్మాణ సంస్థ అయిన సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌తో కలసి దీన్ని నిర్మిస్తోంది.

పూర్తిగా ఆన్‌–సైట్‌ వద్దనే ముద్రించబడిన మోదక్, కమలం, ఆలయ గోపురం ఆకారపు నిర్మాణాలు తమ నిర్మాణ బృందానికి సవాళ్లుగా నిలిచాయని అప్సుజా ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ హరికృష్ణ జీడిపల్లి తెలిపారు. ఆలయ సూత్రాలకు అనుగుణంగా నిర్మాణ శైలి ఉండటంతోపాటు ఆర్కిటెక్చరల్‌గా వినూత్న పద్ధతుల్లో నిర్మిస్తున్న ఈ ఆలయం దేశంలోకెల్లా ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే శివాలయం, మోదక్‌ ఆకార గర్భాలయం పూర్తి కావడంతో కమలం, పొడవైన గోపురాలతో కూడిన రెండవ దశ పనులను మొదలుపెట్టామని చెప్పారు.

Yoga Day: సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో 25 రోజుల ‘యోగా డే’ కౌంట్‌డౌన్‌

ఆలయ రూపకల్పన, 3డీ ప్రింటింగ్‌ సాంకేతికత, ఆన్‌సైట్‌ నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ సీఈఓ ధ్రువ్‌ గాంధీ పేర్కొన్నారు. 10 రోజుల వ్యవధిలో కేవలం 6 గంటల్లోనే మోదక్‌ ఆకార నిర్మాణాన్ని ముద్రించామన్నారు. తామరపువ్వు ఆకారంలోని నిర్మాణాన్ని అంతకన్నా తక్కువ సమయంలోనే సిద్ధం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.  

ఇప్పటికే దేశంలోనే తొలి 3డీ నమూనా వంతెన 
సింప్లిఫోర్జ్‌ క్రియేషన్స్‌ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్‌ నమూనా వంతెనను నిర్మించింది. ఈ వంతెనను ప్రస్తుతం నిర్మిస్తున్న ఆలయం ఆవరణలో ఉన్న తోటలో పాదచారుల వంతెనగా ఉపయోగిస్తున్నట్లు ధ్రువ్‌ గాంధీ తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రింటింగ్‌ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో ఒక చర్చి నిర్మాణం జరిగిందన్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (07-13 మే 2023)

#Tags