WHO: బీఈ పోలియో వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ఓ గుర్తింపు

బయోలాజికల్-ఈ (బీఈ) లిమిటెడ్‌ కంపెనీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి నోవెల్‌ ఓరల్‌ పోలియో వ్యాక్సిన్‌ టైప్‌ 2 (ఎన్‌ఓపీవీ2)కి ప్రీ క్వాలిఫికేషన్‌(పీక్యూ) హోదా లభించింది.

ఇది బీఈ నుంచి ప్రీ క్వాలిఫైడ్‌ హోదా పొందిన 10వ వ్యాక్సిన్‌. వ్యాక్సిన్ల ద్వారా సంక్రమించే పెరాలిటిక్‌ పోలియో (వీఏపీపీ) రిస్క్‌ను తగ్గించడం లక్ష్యంగా ఎన్‌ఓపీవీ2ని తయారుచేశారు. ఇది వ్యాక్సిన్‌ ద్వారా సంక్రమించే పోలియో వైరస్‌ 2 (సీవీడీపీవీ2) వ్యాప్తిని అరికడుతుందని బీఈ తెలిపింది.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి సాధారణ పద్ధతిలో టీకాలు ఇస్తే, దానివల్ల పోలియో వచ్చే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమస్యలకు నోటి ద్వారా ఇచ్చే పోలియో టీకా సరైన పరిష్కారముంది.
 
గతంలో తయారుచేసిన సాబిన్‌ పోలియో వైరస్‌ టైప్‌2 (ఎంఓపీవీ2) వ్యాక్సిన్‌తో పోల్చితే ఇందులో జన్యుపరమైన స్థిరత్వం కల్పించిన కారణంగా తక్కువ రోగనిరోధక శక్తి గల ప్రాంతాల్లో సీవీడీపీవీ2 వ్యాప్తిని అరికడుతుందని కంపెనీ వెల్లడించింది. ఏటా 50 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేయగల సామర్థ్యం బీఈకి ఉంది.

Malaria Vaccine: ఈ దేశంలో అందుబాటులోకి వచ్చిన మలేరియా వ్యాక్సిన్

#Tags