Vladimir Putin in China: చైనాలో ప్ర‌ర్య‌టించిన రష్యా అధ్యక్షుడు పుతిన్..

రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ మే 16వ తేదీ చైనాకు చేరుకున్నారు.

చైనా రాజధాని బీజింగ్‌లో పుతిన్‌తో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు.  

చైనా–రష్యా మధ్య వ్యూహాత్మక సంబంధాలను దెబ్బతీసేందుకు అమెరికా చేసే ప్రయత్నాలను సహించకూడదని, గట్టిగా ఎదిరించాలని నిర్ణయానికొచ్చారు. తమ రెండు దేశాల సంబంధాల్లో కలుగజేసుకోవద్దని అమెరికాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. 

ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్‌ తొలి విదేశీ పర్యటన ఇదే. చర్చల అనంతరం జిన్‌పింగ్, పుతిన్‌ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి త్వరగా తెరపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చైనా–రష్యా సంబంధాలను మూడోదేశం ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. అలా ప్రభావితం చేసేందుకు సాగే ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు. 

Solar Power: సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడవ స్థానానికి చేరుకున్న‌ భారత్

తమ రెండు దేశాల మధ్య బంధం ప్రచ్ఛన్న యుద్ధ కాలం కంటే ఇప్పుడు ఇంకా దృఢమవుతోందని పేర్కొన్నారు. తమ చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను కచ్చితంగా కాపాడుకుంటామని తేల్చిచెప్పారు. అణు ఇంధనం నుంచి ఆహార సరఫరా దాకా భిన్న రంగాల్లో చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని పుతిన్‌ వెల్లడించారు. 

రష్యాలో చైనా కార్ల తయారీకి ప్రోత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ సంక్షోభానికి తెరదించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నందుకు చైనాకు పుతిన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Indian Sailors: ఐదుగురు భారతీయ నావికుల విడుదల.. ఎక్క‌డి నుంచి అంటే..

#Tags