Russia Ukraine War: యుద్ధఖైదీలను పరస్పరం మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్‌

రష్యా, ఉక్రెయిన్‌లు 103 మంది చొప్పున యుద్ధఖైదీలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) దీనికి మధ్యవర్తిత్వం వహించింది. ‘మావాళ్లు స్వదేశానికి చేరుకున్నారు. రష్యా చెర నుంచి 103 మంది యోధులను విజయవంతంగా ఉక్రెయిన్‌కు తీసుకొచ్చాం’అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సెప్టెంబ‌ర్ 14వ తేదీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. యుద్ధఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్‌కు చేరిన వారిలో 82 సాధారణ పౌరులు, 21 మంది సైనిక సిబ్బంది ఉన్నారు. 

‘కస్క్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ బందీలుగా పట్టుకున్న 103 సైనిక సిబ్బంది కీవ్‌ ఆదీనంలోని భూభాగం నుంచి విముక్తులయ్యారు. బదులుగా 103 యుద్ధఖైదీలను ఉక్రెయిన్‌కు అప్పగించాం’అని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్‌ చెర వీడిన రష్యా యుద్ధఖైదీలు ప్రస్తుతం బెలారస్‌లో ఉన్నారు. వారికి అవసరమైన వైద్య, మానసిక సహాయాన్ని అందిస్తున్నట్లు రష్యా తెలిపింది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత యూఏఈ మధ్యవర్తిత్వంలో జరిగిన ఎనిమిదో యుద్ధఖైదీల మార్పిడి ఇది. మొత్తం ఇప్పటిదాకా 1,994 మంది ఖైదీలకు తమ చొరవతో చెరవీడిందని యూఏఈ తెలిపింది.

Al Najah 2024: 'అల్ నజా'కు బయలుదేరిన భారత సైన్యం.. దేనికంటే..

#Tags