Climate Change: ఐఎస్‌ఏ, యూఎన్‌ఎఫ్‌సీసీసీ మధ్య కుదిరిన ఒప్పంద ఉద్దేశం?

భారత్‌ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్‌–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నవంబర్‌ 12న ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్‌ఏ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అజయ్‌ మాథుర్, యూఎన్‌ఎఫ్‌సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ సెక్రెటరీ ఓవైస్‌ సర్మాద్‌ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి.

సోలార్, క్లీన్‌ ఎనర్జీ వినియోగం ద్వారా...

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్‌ క్లైమేట్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్‌ఏ హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్‌ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్‌ మాథుర్‌ చెప్పారు.
 

 

చ‌ద‌వండి: అంతర్జాతీయ సోలార్‌ కూటమిలో చేరిన 101వ దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) మధ్య అవగాహనా ఒప్పందం
ఎప్పుడు   : నవంబర్‌ 12
ఎవరు    : ఐఎస్‌ఏ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అజయ్‌ మాథుర్, యూఎన్‌ఎఫ్‌సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ సెక్రెటరీ ఓవైస్‌ సర్మాద్‌
ఎక్కడ    : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యూకే 
ఎందుకు : దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags