ISA: అంతర్జాతీయ సోలార్ కూటమిలో చేరిన 101వ దేశం?
భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance&ISA)లో 101వ సభ్య దేశంగా అమెరికా చేరింది. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న సీఓపీ 26 సదస్సు సందర్భంగా... ఐఎస్‌ఏ కార్యాచరణ ఒప్పందంపై అమెరికా అధ్యక్ష ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ సంతకం చేశారు. ఐఎస్‌ఏలో చేరడం సంతోషంగా ఉందని.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నట్టు జాన్ కెర్రీ పేర్కొన్నారు. 2015 నవంబర్ 30వ తేదీన ప్యారిస్‌లో జరిగిన సీఓపీ–21 సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు కలిసి ఐఎస్‌ఏను ప్రారంభించారు. సోలార్ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంతో ప్రపంచ దేశాల్ని ఒకే వేదికపైకి తేవాలన్న భారత్ ఆలోచన నుంచి పుట్టిందే ఐఎస్‌ఏ. దీని ప్రధాన కార్యాలయం హరియాణలోని గురుగ్రామ్‌లో ఉంది.
చదవండి: ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్‌కు ఎవరు నేతృత్వం వహించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ నేతృత్వంలోని అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ సభ్య దేశంగా చేరిన దేశం?
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : అమెరికా
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్
ఎందుకు : సోలార్ ఇంధనాన్ని పోత్సహించే లక్ష్యంలో భాగంగా...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్