Aircraft Plant: సీ295 విమాన తయారీ కర్మాగారం ప్రారంభం.. ఎక్క‌డంటే

భారత ప్రైవేట్ రక్షణ విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

దీంతో భారత్‌లోనే తొలి ప్రైవేట్‌ సైనిక, సరకు రవాణా విమానం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. ఇది గుజరాత్‌లోని వడోదర పట్టణంలో ఉన్న‌ టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌లో జరిగింది. స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి భారత ప్రధాని మోదీ అక్టోబర్ 28న సీ295 రకం సైనిక రవాణా విమాన తయారీకి శంకుస్థాపన చేశారు.

మోదీ మాట్లాడుతూ.. భారత్, స్పెయిన్ మధ్య భాగస్వామ్యం కొత్త దిశలను అందించగా, మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ లక్ష్యాలను సాకారం చేస్తున్నట్లు వివరించారు. కొత్త ఫ్యాక్టరీ ద్వారా వేలాది ఉద్యోగాల సృష్టి, 18,000 విమాన విడిభాగాల తయారీ సాధ్యం కానుందని చెప్పారు.

అంతేకాక.. మోదీ, స్పెయిన్‌లో యోగా, భారతదేశంలో స్పానిష్ ఫుట్‌బాల్ యొక్క ప్రాచుర్యం గురించి కూడా మాట్లాడారు. ఇది రెండు దేశాల మధ్య సంస్కృతిక సంబంధాలను బలంగా చేస్తుంది. 2026 సంవత్సరాన్ని ‘ఇండియా–స్పెయిన్ ఇయర్ ఆఫ్ కల్చర్, టూరిజం, ఏఐ’గా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం సంతోషకరమని ఆయన అన్నారు.

Best Schools: ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల్లో మూడు భార‌త‌దేశానివే..

స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ పారిశ్రామిక అభివృద్ధికి, రెండు దేశాల మధ్య స్నేహబంధాలను బలపరుస్తుందని వ్యాఖ్యానించారు.

40 విమానాల తయారీ ఇక్కడే..
ఎయిర్‌బస్‌ సీ295 రకం మధ్యశ్రేణి రవాణా విమానాన్ని తొలుత స్పెయిన్‌కు చెందిన సీఏఎస్‌ఏ ఏరోస్పేస్‌ సంస్థ డిజైన్‌చేసి తయారుచేసేది. సీ295 విమానం, యుద్ధాలకు, వైద్య సహాయానికి, విపత్తుల సమయంలో సహాయానికి, నిఘా కోసం విస్తృతంగా ఉపయోగపడుతుంది. మొత్తం 56 సీ295 విమానాలను భారత్‌కు అప్పగించేందుకు ఎయిర్‌బస్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లో తయారుచేసి, మిగతా 40 విమానాలను వడోదరలోని టాటా యూనిట్‌లో తయారు చేయబడతాయి.

Asia-Pacific Conference: ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌’ సదస్సు

#Tags