First Baby With DNA: ముగ్గురి డీఎన్‌ఏతో జన్మించిన శిశువు.. అరుదైన ప్రయోగం విజయవంతం

బ్రిటన్ శాస్త్రవేత్తలు సంచాలనాత్మక శాస్త్రీయ ప్రయోగంలో విజయం సాధించారు. ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్‌ఏలతో జన్మించింది.

ఇందులో 99.8 శాతం డీఎన్‌ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను ఉయోగిస్తున్నారు. దీనికి మైటోకాండ్రియల్ డోనేషన్ ట్రీట్‌మెంట్‌(ఎండీటీ)గా నామకరణం చేశారు.  ఈ పద్ధతిలో ఆరోగ్యవంతమైన మహిళా దాత అండాల కణజాలన్ని ఉపయోగించి ఐవీఎఫ్‌ పిండాలను సృష్టిస్తారు. తద్వారా పిల్లలకు  తల్లుల ద్వారా మైటోకాండ్రియా సోకకుండా నిరోధిస్తారు.

మైటోకాండ్రియా వ్యాధులు అత్యంత ప్రమాదకరమైనవి. వీటితో పుట్టిన బిడ్డలు గంటల్లో లేదా కొన్ని రోజుల తర్వాత చనిపోయే ప్రమాదం ఉటుంది. తల్లుల ద్వారా మాత్రమే పిల్లలకు ఈ వ్యాధులు సోకుతాయి. అందుకే వీటిని నిరోధించేందుకు ఇతర మహిళల అండాల కణజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫలితంగా పిల్లలు మైటోకాండ్రియా వ్యాధుల బారినపడకుండా  చేస్తున్నారు.

Richest Cities: ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు!

పోలికలు తల్లిదండ్రులవే..
ఈ పద్ధితిలో జన్మించిన శిశువు తన తల్లిదండ్రుల ద్వారా వచ్చే న్యూక్లియర్ డీఎన్‌ఏను కలిగి ఉంటుంది. అందుకే శిశువు వ్యక్తిత్వం, కంటి రంగు వంటి ముఖ్యమైన లక్షణాలు తల్లిదండ్రుల లాగే ఉంటాయి.  అయితే ఈ విధానంలో పుట్టిన బిడ్డ తల్లిదండ్రుల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అతికొద్ది మంది మాత్రమే ఇందులో భాగమయ్యారని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే దీని భద్రత, ప్రభావశీలత గురించి ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నారు. ఎండీటీ పద్ధతి ద్వారా శిశువు జన్మించిన ఘటన యూకేలో ఇదే తొలిసారి అయినప్పటికీ.. అమెరికాలో మాత్రం 2016లోనే ఈ ప్రయోగం జరిగింది. జోర్డాన్‌కు చెందిన ఓ జంట ఈ సాంకేతికతతోనే ఆ ఏడాది  పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే..

#Tags