World Tuberculosis Day 2023: ప్ర‌పంచ క్ష‌య వ్యాధి 2023 థీమ్ ఏమిటి.. క్షయ వ్యాధి లక్షణాలేంటి?

డాక్టర్‌ రాబర్ట్‌ కోచ్‌ ఈ క్షయ వ్యాధి కారక సూక్ష్మ క్రిములను మొదటిసారిగా మార్చి 24, 1882న గుర్తించారు.

ఇందుకుగానూ ఆయనకు 1905లో వైద్యశాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. ఈ సంద‌ర్భంగా క్షయ వ్యాధి వల్ల కలిగే నష్టాలపై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం 2023 ప్ర‌పంచ క్ష‌య వ్యాధి దినోత్సవం యొక్క థీమ్  'అవును, మేము క్ష‌య‌ను అంతం చేస్తాం' (Yes, We can end TB). 
క్షయ అంటువ్యాధి.. 
క్షయ వ్యాధిని మైకోబ్యాక్టీరియమ్‌ ట్యూబరిక్లోసిస్‌ అనే సూక్ష్మక్రిమి వ‌ల్ల వ‌స్తుంది. ఇది ఒక అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులకు సంబంధింది. కానీ చర్మం నుంచి మెదడు వరకు శరీరంలో ఏ భాగానికైనా వచ్చే అవకాశం ఉంది. మనదేశంలో దీర్ఘకాలిక రోగాల్లో ప్రధానమైనది. మైకోబాక్టీరియా లేదా మైకో బ్యాక్టీరియం ట్యూబర్‌ క్యులోసిస్‌ అనే సూక్ష్మక్రిమి వల్ల ఇది వస్తుంది. క్షయవ్యాధి సోకని శరీరావయవాలు క్లోమం, థైరాయిడ్‌ గ్రంథి, జుట్టు.
ఈ వ్యాధి శ్వాసకోశాలను, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన ప్రపంచ టీబీ(TB) నివేదిక ప్రకారం సుమారు 10 మిలియన్ల మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారు. డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌కారం క్ష‌య ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటువ్యాధులలో ఒకటిగా మిగిలిపోయింది. చాలా మంది ప్ర‌ముఖులు TB బాధితుల జాబితాలో ఉన్నారు.

International Womens Day: జయహో.. జనయిత్రీ

క్షయ వ్యాధి ముఖ్య లక్షణాలు
కొన్ని నెలల్లోనే బరువు తగ్గిపోవడం, రాత్రి పూట స్వల్ప స్థాయిలో జ్వరం, జ్వరం వచ్చినప్పుడు బాగా చెమట పట్టడం, నెలల తరబడి దగ్గు తగ్గక‌పోవ‌డం. రోగుల నుంచి నమూనాలు సేకరించి, పరిశోధనశాల్లో బ్యాక్టీరియాను ఒక గంటలో గుర్తించే విధంగా డీఎన్‌ఏ ఆధారిత పద్ధతిని బ్రిటన్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (HPA) శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీంతో రోగనిర్ధారణ పరీక్ష త్వరగా అయిపోతుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (జాతీయ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

#Tags