US Citizenship: వలసదారులకు భారీ ఆఫర్.. అమెరికా పౌరులను పెళ్లాడిన వారికి దేశ పౌరసత్వం

అమెరికాలో లక్షల మంది వలసదారులకు మేలు చేసే నిర్ణయాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ తీసుకున్నారు.

అమెరికా పౌరులను పెళ్లాడిన వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించినట్లు బైడెన్ జూన్ 18వ తేదీ ప్రకటించారు. అయితే ఈ వలసదారు ఇప్పటికే అమెరికాలోనే కనీసం పదేళ్లుగా నివసిస్తూ ఉండాలనే షరతు విధించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న దాదాపు ఐదు లక్షల మంది వలసదారులకు ఈ నిర్ణయంతో లబ్దిచేకూరనుంది.

అమెరికా పౌరుల భాగస్వాములు చట్టబద్ధత కోసం త్వరలో దరఖాస్తుచేసుకోవచ్చని తర్వాతి దశలో వాళ్లకు పౌరసత్వం ఇస్తామని బైడెన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ 17వ తేదీ నాటికి అమెరికాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని పదేళ్లు పూర్తయితే లీగల్‌ స్టేటస్‌(చట్టబద్ధత) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తు ఆమోదం పొందితే మూడేళ్ల తర్వాత గ్రీన్‌కార్డ్‌ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి తాత్కాలిక వర్క్ పర్మిట్‌ ఇస్తారు. ఈ వర్క్ పర్మిట్‌ సాధిస్తే వారు దేశ బహిష్కరణ వేటు నుంచి తప్పించుకుని అమెరికాలోనే ఉద్యోగాలు/పనులు చేసుకోవచ్చు. 

Cyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా

పిల్లలూ దరఖాస్తు చేసుకోవచ్చు..
అమెరికా పౌరులను పెళ్లాడిన అక్రమ వలసదారుల పిల్లలూ చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి పిల్లలు దేశవ్యాప్తంగా 50,000 మంది ఉంటారని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితభాగస్వామి చట్టబద్ధత కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అమెరికా పౌరులను పెళ్లాడి పదేళ్లు పూర్తికావాల్సిన పనిలేదు. అంటే పెళ్లికి ముందే అమెరికాలో పదేళ్లుగా ఉంటూ జూన్‌ 17వ తేదీలోపు పెళ్లాడినా సరే వాళ్లు దరఖాస్తుచేసుకునేందుకు అర్హులే.

17వ తేదీ తర్వాత పదేళ్లు పూర్తయితే వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అమెరికాలో సమ్మర్‌ సీజన్‌దాకా ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలను ఇంకా నిర్ణయించలేదు. అమెరికా పౌరులను పెళ్లాడిన దాదాపు 11 లక్షల మంది వలసదారుల్లో చాలా మంది ఈ తాజా నిర్ణయంతో లబ్ధిపొందనున్నారు.  

డ్రీమర్లకూ తాయిలాలు! 
అమెరికాలో నివసిస్తున్న చట్టబద్ధ వలసదారుల పిల్లల(డ్రీమర్లు)కు బైడెన్‌ సర్కార్‌ అదనపు సౌకర్యాలు కల్పించనుంది. ‘అమెరికా ఉన్నత విద్యా సంస్థలో డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ఆఫర్‌ పొందిన డ్రీమర్లు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చు’ అని బైడెన్‌ అన్నారు. అమెరికాలో హెచ్‌–1బీ, ఇతర దీర్ఘకాలిక నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాదారుల పిల్లలను ‘డ్రీమర్‌’లుగా పిలుస్తారు.

ఈ చట్టబద్ధ వలసదారుల పిల్లల వయసు 21 ఏళ్లు నిండితే వారు అమెరికాలో ఉండటానికి అనర్హులు. అప్పుడు వారివారి స్వదేశాలకు అమెరికా సాగనంపుతుంది. ఈ ప్రమాదం నుంచి వీరందరినీ బయటపడేసేందుకు గతంలో ఒబామా సర్కార్‌ ‘డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ ప్రోగ్రామ్‌’ పేరిట రక్షణ కల్పించింది.

G7 Summit 2024: జీ-7 దేశాల సమ్మిట్.. జ‌రిగింది ఎక్క‌డంటే..

#Tags